- రిజిస్టర్ నసీంకు వినతిపత్రం అందజేత..
నవతెలంగాణ డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని వేంటనే పరిష్కరించాలని,
విద్యార్థి సంఘాలు (ఎస్ ఎఫ్ ఐ, ఎస్ఎస్‌యూఐ ) ఆధ్వర్యంలో విద్యార్థులు తెలంగాణ యునివర్సిటీ రిజిస్టర్ ప్రొపెసర్ డాక్టర్ నసీంకు శుక్రవారం వినతి పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ యునివర్సిటీ అధ్యక్షులు శ్రీనాథ్, ఎన్.ఎస్.యూఐ ఉపాధ్యక్షులు సోమగోని నవీన్, మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు అవుతున్నా వర్సిటీ అధికారులు ఇప్పటివరకు హాస్టల్ ను ప్రారంభించకపోవడం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమని అన్నారు. అదేవిధంగా న్యాయశాస్త్ర విభాగంలో ఖలిగా ఉన్న 22 సీట్లను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు.ఖలిలను త్వరలో భర్తీ చేయకుంటే గ్రామీణ పేద విద్యార్థులకు తివ్ర నష్టం జరుగుతుందన్నారు. అదేవిధంగా స్కాలర్షిప్ల విషయంలో డేస్ స్కాలర్ గా ఉన్నవాటిని కాలేజ్ అటాచ్డ్ హాస్టల్ గా మార్చాలని ప్రభుత్వానికి వెల్ఫేర్ ఆఫీసర్ లకు లేఖలు రాయాలని వినతి పత్రం లో వివారించారు. అదేవిధంగా రానున్న బడ్జెట్ లో తెలంగాణ యూనివర్సిటీకి రెండు వందల కోట్ల బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని ఇప్పటికే యూనివర్సిటీ అభివృద్ధి అడుగడుగునా కుంటుపడిందని వారూ ఆవేదన వ్యక్తం చేశారు. లేనిపక్షంలో ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మణ్జూర్ ప్రశాంత్, సాయి కృష్ణ, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Mar,2021 07:55PM