- టీఆర్ యస్ రాష్ట్ర సెక్రెటరీ మెట్టు శ్రీనివాస్
నవతెలంగాణ- తాడ్వాయి
త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ని అధిక మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని హరిత హోటల్ లో టీఆర్ఎస్ పార్టీ ముఖ్యకార్యకర్తల, పట్టభద్రుల సమావేశం టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బండారు చంద్రయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని నాయకులను పట్టభద్రులను కోరారు. తాడ్వాయి మండలంలో అత్యధిక మెజార్టీ చూపించాలని తెలిపారు. తాడ్వాయి మండలంలో కాటాపూర్, తాడ్వాయి, నార్లాపూర్ అత్యధికంగా 375 ఓట్లు ఉన్నాయని వీటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పనిచేయాలని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వారి ముందుకు తీసుకెళ్లాలని కోరారు. ప్రతి ఒక్కరు సమన్వయంతో పనిచేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కువశాతం మొదటి ప్రాధాన్యత ఓటు పల్లా రాజేశ్వర్ రెడ్డికి పడే విధంగా కృషి చేయాలన్నారు. గతంలో జడ్పీటీసీ, ఎంపీపీ ఎలా గెలిపించుకున్నామో, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ములుగు జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జి గోవిందు నాయక్, ములుగు జడ్పిటిసి సకినాల శోభ రాణి, ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, జీసీసీ డైరెక్టర్ పులుసం పురుషోత్తం లు మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సమయం ఆసన్నమైంది కనుక ప్రతి ఒక్కరు ఒక ఇంచార్జిగా, ప్రతి ఒక్కరు ఒక సైనికుల్లా పని చేసి మండలంలోని పట్టభద్రుల ప్రాధాన్యత ఓటును అధిక సంఖ్యలో టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి వచ్చే విధంగా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బండారి చంద్రయ్య, ములుగు జిల్లా ఎమ్మెల్సీ పట్టభద్రుల ఇంచార్జి గోవిందు నాయక్, ములుగు జడ్పీటీసీ సకినాల శోభారాణి, ఏటూర్ నాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, ఎంపీపీ గొంది వాణిశ్రీ, కో ఆప్షన్ నెంబర్ దిలావర్ ఖాన్, టీఆర్ఎస్ పార్టీ మండల అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి, ఆర్ఎస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు సామ నాగమ్మ, టీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు దిడ్డి మోహన్ రావు, బాపురెడ్డి, మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల టీఆర్ఎస్ పార్టీ సర్పంచులు, నాయకులు కార్యకర్తలు పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Mar,2021 08:15PM