- బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమంద్ విజయ్ కృష్ణ
నవతెలంగాణ కంటేశ్వర్/బోధన్
బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ పిలుపు మేరకు బోధన్ బీజేవైఎం పట్టణ శాఖ అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో బోధన్ తహాశీల్దార్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసినటువంటి బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అమంద్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 7సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు ఏ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదని ఆయా శాఖలలో కలిపి మొత్తం రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నప్పటికీ ఏ ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదల కాకపోవడం చాలా బాధాకరమని ఇప్పటికైనా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని అంతేకాకుండా వారు మానిఫెస్టోలో పెట్టిన విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పించాలని డిమాండ్ చేశారు లాక్ డౌన్ సమయంలో ఖాళీగా ఉన్న ప్రైవేట్ కళాశాల మరియు స్కూల్ టీచర్లకు తొమ్మిది నెలల గౌరవ వేతనం ప్రభుత్వమే ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. లేని పక్షాన రాష్ట్రమంతటా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు మరియు రాస్తారోకోలు పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు పెర్కా వెంకటేష్, బీజేవైఎం నాయకులు ప్రకాష్, యగ్నేశ్వర్, రవి, శ్రీకాంత్, బాలక్రిష్ణ, పవన్, మహేష్, పవన్ కళ్యాణ్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Mar,2021 08:21PM