నవతెలంగాణ ధర్మసాగర్
తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలను పరిష్కార మార్గాలను చూపే ముఖ్యమంత్రికి దగ్గరుండి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలిపించాలని జిల్లా సహాయ సహకార సంఘం డైరెక్టర్ ,పిఎసిఎస్ చైర్మన్ గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఎంపీపీ నిమ్మ కవిత రెడ్డి జడ్పిటిసి పిట్టల శ్రీలత మండలంలో క్లస్టర్ల ఇన్చార్జిల వారీగా శుక్రవారం ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరగబోయే పట్టభద్రుల ఎలక్షన్స్ లో మన టిఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పినట్టుగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేసింది తెలంగాణ ప్రభుత్వం అని, రానున్న రోజుల్లో మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడుతుందని తెలిపారు .పట్టభద్రుల సమస్యలు పరిష్కరించే సత్తా కేవలం పల్లా రాజేశ్వర్ రెడ్డి గారికే ఉందని పట్టభద్రులు అందరూ ఒక్కసారి ఆలోచించి సమస్యను పరిష్కరించే వ్యక్తికి ఓటు వేసి గెలిపించగలరని అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని తనను మరోసారి ఒకసారి అవకాశం ఇవ్వాలని ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేశారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆపదలు ఆదుకునే వ్యక్తి తక్షణ పరిష్కారం చూపే వ్యక్తి అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మ కవిత , జిల్లా కో ఆప్షన్ సభ్యులు జుబేదా లాల్ వైస్ ఎంపీపీ బండారి రవీందర్ మాజీ ఎంపీపీ రాజుగారి రఘు , పి ఎస్ సి ఎస్ వైస్ చైర్మన్ యాదవ్ కుమార్, కర్ర సోమిరెడ్డి లాల్ మొహమ్మద్ చాడ కుమార్ కొలిపాక రమేష్ యాదగిరి మంజుల , ధర్మసాగర్ మండల పార్టీ అధ్యక్షులు సోంపల్లి కర్ణాకర్, మాజీ అధ్యక్షులు గుడి వెనుక దేవేందర్, వైస్ ఎంపీపీ రవీందర్, కొలిపాక రమేష్, కుమార్, హరీష్, ప్రసాద్, అశోక్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Mar,2021 08:25PM