నవతెలంగాణ నిజామాబాద్ సిటీ
ఎన్సీఎస్ఎఫ్ ఫ్యాక్టరీ పునరుద్దాన చేయాలని అరసపల్లి లో ఏఐకెఎమ్ఎస్ నాయక్ వాడి నరసయ్య అధ్యక్షత లో రైతులతో శుక్రవారం ఏర్పాటుచేసిన సమావేశంలో రాష్ట్ర నాయకులు వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ తీపిని పంచ చక్కెర ఫ్యాక్టరీ లు రైతు కుటుంబాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చైదును నింపుతున్నాయి అని అన్నారు. గత ప్రభుత్వాలు మూసివేసి రైతులను రోడ్డుపాలు చేశాయని, సీఎం కేసీఆర్, (మాజీ ఎంపీ) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వంద రోజుల్లో ఫ్యాక్టరీని తెరిపిస్తామని 7 ఏండ్లు కావస్తుంది అని అన్నారు. ఇప్పటికైనా ఫ్యాక్టరీ పై ఉన్న అప్పులను మాఫీ చేసి ఫ్యాక్టరీ రిపేర్ లకు కార్మికుల జీతాల కు 40 కోట్లు కేటాయించి నట్లయితే తెలంగాణలో ఏకైక చక్కెర ఫ్యాక్టరీ నడపడానికి అవకాశం ఉందని అన్నారు. ఫ్యాక్టరీ పునరుద్ధరణ కై గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తామని రైతు జనరల్ బాడీ మీటింగ్ లు గ్రామ పంచాయతీ తీర్మానం లతో రైతు ఉద్యమం చేపడతామని అన్నారు. ప్రభుత్వం నడవకపోతే యాక్ట్ 95 ప్రకారం రైతులే నడుచుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో టి.కృష్ణ గౌడ్, సల్ల గంగాధర్, అగ్గు ఎర్రన్న, గోవురు మల్లన్న, శ్రీనివాస్ రెడ్డి, శంకర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Mar,2021 08:35PM