నవతెలంగాణ -భిక్కనూర్
భిక్కనూర్ పట్టణ ప్రజలు తడి,పొడి చెత్తను వేరు చేసి చెత్త ట్రాక్టర్, రిక్షలో వేయాలని పట్టణ సర్పంచ్ తునికి వేణు అన్నారు. శుక్రవారం భిక్కనూర్ పట్టణ కేంద్రంలో ప్రతి ఇంటికీ తిరుగుతూ చెత్త బుట్టలను పంపిణీ చేశారు. ప్రతిరోజు తమ తమ ఇంటిలోని చెత్తను తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామపంచాయతీ నుండి వచ్చే చెత్త ట్రాక్టర్లలో వేయాలని సూచించారు. ఎవరైనా తడి పొడి చెత్తను వేరు చేయకుండా ట్రాక్టర్లలో వేస్తే చర్యలు తప్పవని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిలోని చెత్తను చెత్త బుట్టలో వేసి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గంగధర్, జునియర్ అసిస్టెంటు సిద్దరాములు, వార్డు సభ్యులు భాను, సిద్దరాములు, రవి, చంద్రం, కో అప్షన్ సభ్యుడు శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Mar,2021 08:38PM