నవతెలంగాణ కంటేశ్వర్
జాతీయ స్థాయి సైక్లింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు జిల్లాకు చెందిన ముగ్గురు సైక్లిస్ట్ లు ఎంపికయ్యారు. ఇటీవల సిద్దిపేట జిల్లాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి సైక్లింగ్ ఛాంపియన్షిప్ లో మెరుగైన ప్రతిభను కనబరిచి పతకాలు సాధించారు. ఇందులో అండర్ 16 బాలికల విభాగంలో బి. శ్రీముఖ, బాలుర విభాగంలో కె.రాఘవేంద్ర, అండర్ 18 బాలుర విభాగంలో కే. యశ్వంత్ ఎంపికయ్యారు. వీరు ఈనెల 5 నుంచి 8 వరకు మహారాష్ట్రలోని ముంబై లో జరగనున్న 25వ జాతీయ స్థాయి రోడ్ సైక్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర సైక్లిస్ట్ ల బృందంలో జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం వహించనున్నట్లు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి భూలోకం విజయకాంత్ రావు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అడ్హాక్ కమిటీ చైర్మన్ గడిల శ్రీరాములు, సైక్లింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవి కృపాకర్ రెడ్డి, కార్యదర్శి విజయకాంత్ రావు, ఉపాధ్యక్షుడు రాజ్కుమార్ సుబేదార్, సూర్య ప్రకాష్, పీ. నర్సింగ్ రావు, దివాకర్ రావు, రాకేష్ కుమార్, సురేందర్, గడ్డం రవి, వినోద్, దుర్గ మల్లేష్, అఫ్సర్, శరత్ కుమార్ గౌడ్, నరేష్ కుమార్ తదితరులు జాతీయస్థాయికి ఎంపికైన జిల్లా సైక్లిస్ట్ లను అభినందించి వర్షం వ్యక్తం చేశారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 05 Mar,2021 08:42PM