ఈసారి కూడా... | NavaChitram | NavaTelangana | Cinema News and Celebrity News from NavaTelangana.com

హోంనవచిత్రం ఈవెంట్స్

ఈసారి కూడా...

      ఆస్కార్‌ అవార్డుల బరిలో ఈసారి కూడా భారతీయ సినిమా పోరాడ లేకపోయింది. ప్రపంచ వ్యాప్తంగా సినీ వర్గాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డు ఆశించిన భారతీయ సినీ ప్రేక్షకులకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. మన దేశం తరఫున ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో 'విసారణై' తమిళ చిత్రం నామినేట్‌ అయింది. నామినేటై ఉత్తమ సినిమాలుగా నిలిచిన
9 చిత్రాల్లో 'విసారణై' స్థానం సొంతం చేసుకోలేకపోయింది. వెట్రిమారన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ధనుష్‌ తన సొంత బ్యానర్‌లో నిర్మించారు. సాధారణ ఆటో డ్రైవర్‌ చంద్రకుమార్‌ రాసిన 'లాకప్‌' అనే నవల ఆధారంగా తెరకెక్కిన 'విసారణై' చిత్రం ఈ ఏడాది ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డును కైవసం చేసుకుంది. అలాగే 72వ వెనిస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో కూడా ఈ చిత్రం ప్రదర్శితమై విమర్శకుల ప్రశంసలను అందుకుంది. జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రేక్షకులు, విమర్శకుల అభినందనలు అందుకున్నప్పటికీ 'విసారణై' ఆస్కార్‌ బరిలో నిలవకపోవడం బాధాకరం. ఇదిలా ఉంటే, ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ పురస్కార గ్రహీత ఏ.ఆర్‌.రెహ్మాన్‌ కంపోజ్‌ చేసిన 'పీలే' చిత్రం ఆస్కార్‌ బరిలో ఉండటం విశేషం. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు పీలే బయోపిక్‌ ఆధారంగా రూపొందిన 'పీలే : బర్త్‌ ఆఫ్‌ ఏ లెజెండ్‌' చిత్రానికి రెహ్మాన్‌ సంగీతం అందించారు. జెఫ్‌ జింబాలిస్ట్‌, మైఖేల్‌ జింబాలిస్ట్‌ దర్శకులుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో ఆస్కార్‌కి ఎంట్రీ ఇచ్చింది. ఈసారి ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో 145 మంది సంగీత దర్శకులు పోటీ పడుతున్నారు. అలాగే 91 పాటలు పోటీ పడుతుండగా, వాటిల్లో 'పీలే' చిత్రంలోని రెహ్మాన్‌ కంపోజ్‌ చేసిన 'గింగా..' అనే పాట పోటీలో నిలవడం విశేషం. దీనికి సంబంధించి నామినేషన్ల తుది జాబితాను వచ్చే ఏడాది జనవరి 24న విడుదల చేస్తారు. ఫిబ్రవరి 26న అవార్డుల ప్రదానం ఉంటుంది.

ఈసారి కూడా...
ఈసారి కూడా...

MORE STORIES FROM THE SECTION

ఈసారి కూడా...

ఈవెంట్స్

ఆస్కార్‌లో కొత్త కేటగిరి

09-09-2018

సినిమాలకు సంబంధించి ప్రపంచంలోనే ఆస్కార్‌ను అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారంగా భావిస్తారు. ఈ అవార్డు కోసం తపించని నటీనటులు, సాంకేతిక నిపుణులుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు దీంట్లో ఓ కొత్త విభాగాన్ని జోడిస్తున్నారు. ఔట్‌స్టాండింగ్‌ ఎచీవ్‌మెంట్‌ ఇన్‌ పాపులర్‌ ఫిల్మ్

ఈసారి కూడా...

ఈవెంట్స్

ఏడేండ్ల సైమా అపూర్వ దిగ్విజయ యాత్ర

14-08-2018

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌-2018 (సైమా) కర్టెన్‌ రైజర్‌, లఘు చిత్రాల అవార్డుల కార్యక్రమం ఆదివారం జరిగింది. అతిథిగా విచ్చేసిన హీరో దగ్గుబాటి రానా మాట్లాడుతూ, 'ఇది సైమా ఏడవ ఎడిషన్‌. విష్ణు, బృందాలకు కంగ్రాట్స్‌. వీరు సైమాతో ఓ బ్రాండ్‌ను క

ఈసారి కూడా...

ఈవెంట్స్

అందరికీ స్ఫూర్తినిస్తున్న మనం సైతం

02-08-2018

'మనం సైతం' గురించి చాలా విన్నాను. కానీ ఇక్కడికి వచ్చాక ఇది ఎంత గొప్ప కార్యక్రమమో అర్థమైంది' అని దర్శకుడు మారుతి అన్నారు. చిత్ర పరిశ్రమలోని పేద కళాకారులకు, వివిధ విభాగాల కార్మికులకు కాదంబరి కిరణ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న మనంసైతం ఆర్థిక సాయం అందిస్తోన్న విషయం విదితమే. ఇటీవల పలువురు కార్మికులకు ఆ

ఈసారి కూడా...

ఈవెంట్స్

ఆద్యంతం ఉత్సాహ భరితం..

20-05-2018

ప్రతిష్టాత్మక కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం చివరి దశకు చేరుకుంది. 12 రోజులపాటు ప్రపంచ సినీ ప్రముఖులందరి దృష్టిని తమ వైపు తిప్పుకునేలా చేసే ఈ ఫెస్టివల్‌ 11వ రోజు సైతం ఆద్యంతం అత్యంత ఉత్సాహంగా సాగింది. వేడుకలు తుది దశకు చేరే ముందు రోజు సైతం కథానాయికలు అబ్బురపరిచే దుస్తులతో, ఎంతో అందంగ

ఈసారి కూడా...

ఈవెంట్స్

బిగ్‌ బాస్‌ 2 వ్యాఖ్యాతగా నాని..

19-05-2018

బుల్లితెర ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసిన బిగ్‌బాస్‌ షో గురించి అందరికీ తెలిసిందే. బిగ్‌బాస్‌ షో ఫస్ట్‌ సీజన్‌కి ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించి తనదైన పంథాలో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశారు. అంతేకాకుండా షోని గ్రాండ్‌ సక్సెస్‌ చేశారు. ఇందుల

ఈసారి కూడా...

ఈవెంట్స్

కేన్స్‌లో శ్రీదేవికి ఘన నివాళి..

18-05-2018

కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 9వ రోజు కూడా అత్యంత సందడిగా సాగింది. ఇటీవల ఆకస్మికంగా మరణించిన అతిలోక సుందరి శ్రీదేవికి కేన్స్‌ అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమెకు టైటాన్‌ రెజినాల్డ్‌ ఎఫ్‌ లెవిస్‌ అవార్డును ప్రకటించి చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు

ఈసారి కూడా...

ఈవెంట్స్

కొత్త పెళ్ళి కూతురికి కేన్స్‌ సర్‌ప్రైజ్‌ ..!

17-05-2018

ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సరికొత్త ఉత్సాహంతో సాగుతుంది. ఎనిమిదో రోజు కూడా సందడిగా సాగింది. కొత్త పెళ్ళి కూతురు, బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ రెండో రోజు సైతం మెరిసింది. వేరా వాంగ్‌ గౌన్‌ ధరించి ఎర్ర తివాచీపై మెస్మరైజ్‌ చేసింది. 'సోలో: ఏ స్

ఈసారి కూడా...

ఈవెంట్స్

కేన్స్‌లో మెరిసిన కొత్త పెళ్ళికూతురు..

16-05-2018

కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఏడవ రోజు కూడా ఆద్యంతం సందడి సందడిగా సాగుతుంది. ప్రతి రోజు విభిన్నమైన, నవ్యమైన దుస్తులు ధరించిన తారల తళుకులు రెడ్‌ కార్పెట్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈసారి బాలీవుడ్‌ కథానాయికలు కేన్స్‌లో చేస్తున్న హైలైట్‌గా నిలవడం విశేషం.

ఈసారి కూడా...

ఈవెంట్స్

ఘనంగా సినీ గోయర్స్‌ అవార్డుల ప్రదానోత్సవం

15-05-2018

'సినిమాకు చెందిన నటీనటులను కలవడం కష్టంగా ఉన్న రోజుల్లో బి.కిషన్‌ ఎంతో కృషి చేసి సినీ గోయర్స్‌ సంస్థ ద్వారా ప్రతిభ కనబర్చిన సినిమా వాళ్ళకి అవార్డులను అందజేశారు. ఆయన వరసత్వాన్ని తనయుడు రామకృష్ణ కొనసాగించడం, 49ఏండ్లుగా ఈ వేడుకను నిర్వహించడం అభినందనీయం' అని కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి అన్నా

ఈసారి కూడా...

ఈవెంట్స్

కేన్స్‌లో ఐశ్వర్యరారు హవా..

15-05-2018

కేన్స్‌లో మరోమారు ఐశ్వర్యరారు అందర్నీ మంత్రముగ్దుల్ని చేసింది. ఇప్పటికే దీపికా పదుకొనె, కంగనా రనౌత్‌, హ్యూమా ఖురేషి, మల్లీకా షెరావత్‌ కేన్స్‌లో పాల్గొని సందడి చేశారు. ఐదో రోజు ఐశ్వర్యరారు సీతాకోక చిలుకను పోలిన డ్రెస్‌ ధరించి వేడుకకే హైలైట్‌గా నిలవడం ఓ విశేషమైతే, ఆరవ