జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్‌' | NavaChitram | NavaTelangana | Cinema News and Celebrity News from NavaTelangana.com

హోంనవచిత్రం ఈవెంట్స్

జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్‌'

జాతీయ ఉత్తమ నటీనటులు : సురభి లక్ష్మీ, అక్షరుకుమార్‌
జాతీయ ఉత్తమ ప్రజాదరణ చిత్రం : శతమానం భవతి
ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రం : పెళ్లిచూపులు
'సముద్రమే ప్రాణాధారంగా జీవించే తాబేళ్ల పరిరక్షణ ప్రాజెక్ట్‌తో తన జీవితానికొక
అర్థాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నించిన జానకి అనే విడాకులు తీసుకున్న మహిళకి,
ఆత్మహత్య చేసుకోవాలనుకునే మానవ్‌ అనే యువకుడికి మధ్య జరిగిన
సంఘటనల సమాహారమే 'కాసవ్‌'. వాస్తవ పరిస్థితులకు, మానవత్వానికి ప్రతీకగా,
ఆద్యంతం హృద్యంగా తెరకెక్కిన ఈచిత్రం 64వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. మరాఠిలో రూపొందిన ఈ చిత్రం సుమిత్ర భావే, సునీల్‌ సుక్తాకర్‌ సంయుక్త స్వీయ దర్శకత్వంలో తెరకెక్కడం విశేషం.
ఇదిలా ఉంటే, జాతీయ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా 'శతమానం భవతి', ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా 'పెళ్లిచూపులు' చిత్రాలు ఎంపికై తెలుగు సినిమా సత్తాను మరోసారి జాతీయ వేదికపై చాటాయి. చిన్న చిత్రంగా విడుదలై 2016లో పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్న 'పెళ్ళి చూపులు' చిత్రానికి సంబంధించి సంభాషణలకు కూడా అవార్డు లభించడం చెప్పుకోదగ్గ మరో విశేషం. వీటితోపాటు ఎన్టీఆర్‌ నటించిన 'జనతాగ్యారేజ్‌' చిత్ర కొరియోగ్రాఫర్‌ రాజుసుందరం బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌గా అవార్డుకి ఎంపికయ్యారు. 64వ జాతీయ చలన చిత్ర అవార్డులను దర్శక, నిర్మాత ప్రియదర్శన్‌ అధ్యక్షతన జ్యూరీ సభ్యులు శుక్రవారం ఢిల్లీలో ప్రకటించారు. ఉత్తమ జాతీయ నటుడి అవార్డుకు బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షరుకుమార్‌ (రుస్తుమ్‌) ఎంపికై, తొలిసారి జాతీయ అవార్డుని అందుకోబోతున్నారు. ఉత్తమ నటిగా సురభి లక్ష్మీ (మిన్నామినుంగు - మలయాళం)ని
జ్యూరీ సభ్యులు సెలెక్ట్‌ చేశారు. 2016 సంవత్సరానికి సంబంధించి ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో
26 భాషల నుంచి దాదాపు 344 చిత్రాలు పోటీలో పాల్గొన్నాయి.
దర్శకుడు క్రిష్‌ ఫ్రెండ్లీ ఫిల్మ్‌ అవార్డు జ్యూరీ సభ్యుడిగా వ్యవహరించారు. సినిమాల నిర్మాణానికి స్నేహపూర్వక రాష్ట్రంగా ఉత్తర ప్రదేశ్‌ను, స్పెషల్‌ మెన్షన్‌ స్నేహ పూర్వక రాష్ట్రంగా జార్ఖండ్‌ రాష్ట్రాన్ని జ్యూరీ ఎంపిక చేసింది. ఈ అవార్డులతోపాటు బెస్ట్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌ అవార్డును ఈసారి కొత్తగా ప్రవేశపెట్టారు. ఈ యేడాది బెస్ట్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌గా పీటర్‌ హెయిన్స్‌ సెలెక్ట్‌ అయ్యారు.
మోహన్‌లాల్‌ నటించిన మాలయాళ చిత్రం 'పులిమురుగన్‌' చిత్రం కోసం పీటర్‌ సమకూర్చిన యాక్షన్‌ సీక్వెన్స్‌లు ప్రేక్షక లోకాన్నే కాదు జ్యూరీ సభ్యుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేశాయి. ఈసారి ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే, బెస్ట్‌ ఎడిటింగ్‌, బెస్ట్‌ ఆడియో గ్రఫీ (లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌), ఉత్తమ ఎడిటింగ్‌, ఉత్తమ కాస్టూమ్స్‌ డిజైనింగ్‌, ఉత్తమ ప్రాంతీయ చిత్రం వంటి తదితర విభాగాలో తొమ్మిది జాతీయ అవార్డులను కైవసం చేసుకుని మరాఠి చిత్ర పరిశ్రమ సత్తా చాటగా, ఉత్తమ నటుడు, ఉత్తమ బాల నటుడు, బెస్ట్‌ యానిమేషన్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ సోషల్‌ ఫిల్మ్‌, ఉత్తమ సహానటి, బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌, ఉత్తమ ప్రాంతీయ చిత్రం వంటి తదితర ఏడు అవార్డులతో బాలీవుడ్‌ సరిపెట్టుకుంది. కొసమెరుపుగా 'నీరజా' చిత్రంలో ఉత్తమ నటన ప్రదర్శించిన కథానాయిక సోనమ్‌కపూర్‌కు జ్యూరీ స్పెషల్‌ అవార్డును ప్రకటించడం విశేషం.
ఇక ఉత్తమనటి, ఉత్తమ బాలనటుడు, బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే, బెస్ట్‌ ఆడియోగ్రఫీ, బెస్ట్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ, ఉత్తమ ప్రాంతీయ చిత్రాల అవార్డులతో మాలీవుడ్‌ హల్‌చల్‌ చేసింది. 'పులిమురుగన్‌', 'జనతాగ్యారేజ్‌' వంటి చిత్రాల్లో అద్భుత నటన ప్రదర్శించిన మోహన్‌లాల్‌ స్పెషల్‌ జ్యూరీ అవార్డుకు ఎంపికయ్యారు. బెంగాలీ, తమిళ, కన్నడ చిత్ర పరిశ్రమలు నాలుగైదు విభాగాల్లో అవార్డులను కైవసం చేసుకోగా, నాలుగు విభాగాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ అవార్డులను అందుకుని మరోసారి
జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో సముచిత స్థానాన్ని సొంతం చేసుకుంది.
బాలీవుడ్‌ కథానాయిక ప్రియాంక చోప్రా నిర్మాతగా మరాఠిలో నిర్మించిన 'వెంటిలేటర్‌' చిత్రం మూడు విభాగాల్లో జాతీయ అవార్డులను దక్కించుకోవడం విశేషం. అలాగే నటుడు, నిర్మాత అజరుదేవగన్‌ నిర్మించిన 'శివారు' చిత్రం బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో జాతీయ అవార్డును దక్కించుకుంది.
నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ చరిత్రలో గతేడాది జాతీయ ఉత్తమ చిత్రంగా 'బాహుబలి' ఎంపికై తెలుగు సినిమా స్థాయిని చాటింది. ఆ కోవలోనే ఈ యేడాది కూడా తెలుగు సినిమా జాతీయ వేదికపై సందడి చేసింది. నాలుగు అవార్డులు రావడం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు
విజేతలను ప్రశంసల వర్షంలో ముంచెత్తారు.
జాతీయ అవార్డుల్లో భాగంగా ఆయా చిత్రాలకు ప్రశంసాపత్రంతోపాటు నగదు బహుమతిని అందజేస్తారు. ఉత్తమ చిత్రానికి, ఉత్తమ దర్శకుడికి స్వర్ణ కమలంతోపాటు రూ.2,50,000 బహూకరిస్తారు. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రానికి రూ.2,00,000, ఉత్తమ బాలల చిత్రానికి రూ.1,50,000, ఉత్తమ నూతన దర్శకుడు రూ.1,25,000, ఉత్తమ యానిమేషన్‌ చిత్ర్రానికి రూ.1,00,000 అందజేస్తారు. అవార్డుల్లో భాగంగా వెండి కమలంతోపాటు ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం, ఉత్తమ సామాజిక చిత్రం, ఉత్తమ పర్యావరణ పరిరక్షణ చిత్రాలకు రూ.1,50,000. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయనటీనటులకు రజిత కమలంతోపాటు 50 వేల రూపాయల నగదుని అందజేస్తారు. వీరితోపాటు ఇతర విభాగాల్లోని విజేతలను కూడా ఇదే రీతిలో సత్కరిస్తారు.దీంతోపాటు స్పెషల్‌ జ్యూరీ అవార్డుకుగానూ రూ.2,00,000. స్పెషల్‌ మెన్షన్‌ విభాగంలో కేవలం సర్టిఫికేట్‌ ఇస్తారు. ప్రాంతీయ చిత్రాలకు లక్ష రూపాయలు అందజేస్తారు. నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్స్‌ విభాగంలో ఉత్తమ నాన్‌ ఫీచర్‌ చిత్రానికి రూ.లక్ష రూపాయలు, బెస్ట్‌ డైరెక్షన్‌కి రూ.50,000లను బహూకరిస్తారు.సినిమాలపై ప్రచురితమైన ఉత్తమ పుస్తక రచయితకు, సినిమాలపై విశ్లేషాణత్మక ఆర్టికల్స్‌ రాసిన ఉత్తమ సినీ విమర్శకుడికి స్వర్ణ కమలంతోపాటు రూ.75,000 అందజేస్తారు.
64వ జాతీయ చలన చిత్ర
పురస్కార గ్రహీతల వివరాలు
జాతీయ ఉత్తమ చిత్రం - కాసవ్‌ (మరాఠి)
ఉత్తమ నూతన దర్శకుడు (ఇందిరాగాంధీ అవార్డ్‌ ) - దీప్‌ చౌదరి (అలిఫా -బెంగాలీ)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం - శతమానం భవతి (తెలుగు)
ఉత్తమ దర్శకత్వం - రాజేష్‌ మపుస్కర్‌ (వెంటిలేటర్‌ - మరాఠి)
ఉత్తమ నటుడు - అక్షరు కుమార్‌ ( రుస్తుమ్‌ - హిందీ)
ఉత్తమ నటి - సురభి లక్ష్మీ (మిన్నామినుంగే (ది ఫైర్‌ ప్లే)- మలయాళం)
ఉత్తమ బాలల చిత్రం - ధనక్‌ (హిందీ)
ఉత్తమ యానిమేటెడ్‌ చిత్రం - మహాయోధ రామ (హిందీ)
ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం (నర్గీస్‌దత్‌ అవార్డ్‌) - దిక్ష బనత్‌ పాలాక్స్‌ (అస్సామి)
ఉత్తమ సామాజిక చిత్రం - పింక్‌ (హిందీ)
ఉత్తమ ఎన్విరాన్‌మెంట్‌ చిత్రం - లోక్‌టాక్‌ లై రెంబీ (మణిపురి)
ఉత్తమ సహాయ నటుడు - మనోజ్‌ జోషి (దశక్రియ- మరాఠి)
ఉత్తమ సహాయ నటి - జైరా వసీమ్‌ (దంగల్‌- హిందీ)
ఉత్తమ బాల నటుడు - కె. మనోహర (రైల్వే చిల్డ్రన్‌ - కన్నడ),
అదిష్‌ ప్రవీణ్‌ (కుంజు దైవమ్‌ - మలయాళం),
నూర్‌ ఇస్లామ్‌, శామ్యూల్‌ అలమ్‌ (సహజ్‌ పతర్‌ గప్పో - బెంగాలీ)
ఉత్తమ నేపథ్య గాయకుడు - సుందర అయ్యర్‌ (జోకర్‌ - తమిళం)
ఉత్తమ నేపథ్య గాయని - ఇమన్‌ చక్రవర్తి (ప్రకటన్‌ - బెంగాలీ)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ - ఎస్‌. తిరునవుకారాసు (తిరు) (24 - తమిళం)
ఉత్తమ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే - శ్యామ్‌ పుష్కరన్‌ (మహిషింతే ప్రతీకారమ్‌ - మలయాళం)
బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే - సంజరు కృష్ణాజీ పటేల్‌ (దశక్రియ - మరాఠి)
ఉత్తమ సంభాషణలు - తరుణ్‌ భాస్కర్‌ (పెళ్లిచూపులు- తెలుగు)
బెస్ట్‌ ఆడియోగఫ్రీ (లొకేషన్‌ సౌండ్‌ రికార్డిస్ట్‌) - అలోక్‌ డే (వెంటిలేటర్‌ - మరాఠి)
బెస్ట్‌ ఆడియోగఫ్రీ (సౌండ్‌ డిజైనర్‌) - జయదేవన్‌ (కాడు పుక్కున్న నేరమ్‌ - మలయాళం)
ఉత్తమ ఎడిటింగ్‌ - రామేశ్వర్‌ ఎస్‌.భగత్‌ (వెంటీలేటర్‌ - మరాఠి)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైన్‌ - సచిన్‌ లవలేకర్‌ (సైకిల్‌ -మరాఠి)
బెస్ట్‌ మేకప్‌ - ఎన్‌.కె.రామకృష్ణన్‌ (అల్లమ - కన్నడ)
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌ (సాంగ్స్‌) - బాపు పద్మనాభ (అల్లమ - కన్నడ)
బెస్ట్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌ (బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌) - బాపు పద్మనాభ (అల్లమ - కన్నడ)
బెస్ట్‌ లిరిక్స్‌్‌ - వైరముత్తు (ధర్మ దురై - తమిళం), అనుపమ్‌ రారు (ప్రకటన్‌ - బెంగాలీ)
స్పెషల్‌ జ్యూరీ అవార్డు -మోహన్‌లాల్‌ (జనతా గ్యారేజ్‌, పులిమురుగన్‌)
బెస్ట్‌ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ - శివారు (హిందీ)
బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ - 24 (తమిళం)
బెస్ట్‌ కొరియోగ్రఫీ - రాజు సుందరం (జనతా గ్యారేజ్‌ - తెలుగు)
బెస్ట్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ - పీటర్‌ హెయిన్స్‌ (పులిమురుగన్‌- మలయాళం)
ప్రత్యేక అవార్డు - సోనమ్‌ కపూర్‌ (నీరజా)
బెస్ట్‌ మోరన్‌ ఫిల్మ్‌ - హందుక్‌
ఉత్తమ సినీ విమర్శకుడు -జి.ధనుంజయన్‌
బెస్ట్‌ బుక్‌ ఆన్‌ సినిమా - లత : సుర్‌ గాథ (యతీంద్ర మిశ్రా)
స్పెషల్‌ మెన్షన్‌ - సినిమాలపై ఉత్తమ పుస్తకం - ఏ ఫ్లై ఇన్‌ ద కర్రీ (కె.పి.జయశంకర్‌)
బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ - ఫైర్‌ప్లయిస్‌ ఇన్‌ ద అభ్యాస్‌
బెస్ట్‌ నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ డైరెక్షన్‌ - ఆదిత్య సుహాస్‌ జామ్‌భలే (ఆబా అకితారు నా?)
మోస్ట్‌ ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌ అవార్డు - ఉత్తర ప్రదేశ్‌
స్పెషల్‌ మెన్షన్‌ - మోస్ట్‌ ఫిల్మ్‌ ఫ్రెండ్లీ స్టేట్‌ అవార్డు - జార్ఖండ్‌
ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రాలు
ఉత్తమ తెలుగు చిత్రం - పెళ్ళిచూపులు
ఉత్తమ హిందీ చిత్రం - నీరజా
ఉత్తమ మరాఠీ చిత్రం - దశక్రియ
ఉత్తమ కొంకణి చిత్రం - కె శర శర
ఉత్తమ మలయాళ చిత్రం - మహిషింతే ప్రతీకారమ్‌
ఉత్తమ కన్నడ చిత్రం - రిజర్వేషన్‌
ఉత్తమ తమిళ చిత్రం - జోకర్‌
ఉత్తమ బెంగాలీ చిత్రం -బిసర్జన్‌
ఉత్తమ గుజరాతీ చిత్రం - రాంగ్‌ సైడ్‌ రాజు
ఉత్తమ తులు చిత్రం - మదిపు
ఉత్తమ అస్సామీ చిత్రం - మజ్‌ రతి కెటికే
స్పెషల్‌ మెన్షన్‌ - కడ్వి హవా (హిందీ), ముక్తి భావన్‌ (హిందీ), మజ్‌ రతి కెటికే (అస్సామీ)
ఆదరణ ఎప్పుడూ ఉంటుంది..
మంచి చిత్రాలకు ప్రేక్షకాదరణే కాదు అవార్డుల రూపంలో ప్రభుత్వ ఆదరణ కూడా లభిస్తుందని మా 'శతమానం భవతి' చిత్రంతో మరోసారి రుజువైంది. రచయితగా, దర్శకుడిగా పలు చిత్రాలకు పని చేశాను. ఇంత వరకు ఒక్క అవార్డు కూడా లభించలేదు. ఇటువంటి తరుణంలో నేను దర్శకత్వం వహించిన చిత్రానికి జాతీయ అవార్డు రావడం ఎనలేని ఆనందాన్ని కలిగిస్తోంది. ఓ మంచి సినిమా చేస్తే తప్పకుండా ఆదరణ లభిస్తుందన్న నమ్మకంతో ఈ సినిమా చేశాం. ప్రేక్షకాదరణతోపాటు ఈ తరహా అవార్డులు రావడం స్ఫూర్తిదాయకం. నన్ను, నా కథను నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత దిల్‌రాజుకి కృతజ్ఞతలు. ఈ అవార్డు నాపై
మరింత బాధ్యతను పెంచింది.
- వేగేశ్న సతీష్‌, శతమానం భవతి దర్శకుడు
'ప్రేక్షకులు మా 'శతమానం భవతి' చిత్రాన్ని మెచ్చారు. అలాగే మా చిత్రానికి జాతీయ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. దీంతో మాపై మరింత బాధ్యత పెరిగింది. ఏ తరహా సినిమా అయినప్పటికీ ప్రేక్షకులకు నచ్చే చిత్రాన్ని నిర్మించాలన్నది మా సంకల్పం. అందులో భాగంగా మేం తీసిన ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణతోపాటు ప్రభుత్వ ఆదరణ లభించడం గర్వంగా ఉంది.
- దిల్‌ రాజు, శతమానం భవతి నిర్మాత
ఊహించలేదు..
అవార్డుల గురించి ఆలోచించకుండా ఓ మంచి సినిమా తీయాలని మా వంతు ప్రయత్నం చేశాం. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకాదరణతోపాటు ఇప్పుడు ప్రభుత్వ పరంగా అవార్డులు లభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఓ మంచి చిత్రానికి తప్పకుండా అవార్డులు వస్తాయని నిర్మాతలు నూటికి నూరుశాతం విశ్వాసంతో ఉన్నప్పటికీ నేనైతే అవార్డుల గురించి నామ మాత్రం కూడా ఊహించలేదు. టీమ్‌ వర్క్‌కు దక్కిన రిజల్జ్‌ ఇది. ఇటువంటి ఆనందం సమయంలో మేం ఆడుతూపాడుతూ చేసిన షూటింగ్‌ రోజులు గుర్తొస్తున్నాయి. ప్రాంతీయ ఉత్తమ చిత్రంగానే కాకుండా 'పెళ్లిచూపులు' చిత్రానికి సంబంధించి ఉత్తమ సంభాషణల రచయితగా నాకు కూడా అవార్డు లభించడం మరింత సంతోషంగా ఉంది. ఈ అవార్డుని నాకు ఇచ్చారంటే కమిటీ మా చిత్రాన్ని తరచి తరచి క్షుణ్ణంగా పరిశీలించిందని అర్థమవుతోంది. ఏదిఏమైనా ఈ అవార్డుల స్ఫూర్తితో ఇంకా ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేస్తాను.
- తరుణ్‌ భాస్కర్‌, పెళ్లిచూపులు దర్శకుడు

జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్‌'
జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్‌'
జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్‌'
జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్‌'

MORE STORIES FROM THE SECTION

జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్‌'

ఈవెంట్స్

ఆస్కార్‌లో కొత్త కేటగిరి

09-09-2018

సినిమాలకు సంబంధించి ప్రపంచంలోనే ఆస్కార్‌ను అత్యంత ప్రతిష్టాత్మక పురస్కారంగా భావిస్తారు. ఈ అవార్డు కోసం తపించని నటీనటులు, సాంకేతిక నిపుణులుండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు దీంట్లో ఓ కొత్త విభాగాన్ని జోడిస్తున్నారు. ఔట్‌స్టాండింగ్‌ ఎచీవ్‌మెంట్‌ ఇన్‌ పాపులర్‌ ఫిల్మ్

జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్‌'

ఈవెంట్స్

ఏడేండ్ల సైమా అపూర్వ దిగ్విజయ యాత్ర

14-08-2018

సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌-2018 (సైమా) కర్టెన్‌ రైజర్‌, లఘు చిత్రాల అవార్డుల కార్యక్రమం ఆదివారం జరిగింది. అతిథిగా విచ్చేసిన హీరో దగ్గుబాటి రానా మాట్లాడుతూ, 'ఇది సైమా ఏడవ ఎడిషన్‌. విష్ణు, బృందాలకు కంగ్రాట్స్‌. వీరు సైమాతో ఓ బ్రాండ్‌ను క

జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్‌'

ఈవెంట్స్

అందరికీ స్ఫూర్తినిస్తున్న మనం సైతం

02-08-2018

'మనం సైతం' గురించి చాలా విన్నాను. కానీ ఇక్కడికి వచ్చాక ఇది ఎంత గొప్ప కార్యక్రమమో అర్థమైంది' అని దర్శకుడు మారుతి అన్నారు. చిత్ర పరిశ్రమలోని పేద కళాకారులకు, వివిధ విభాగాల కార్మికులకు కాదంబరి కిరణ్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న మనంసైతం ఆర్థిక సాయం అందిస్తోన్న విషయం విదితమే. ఇటీవల పలువురు కార్మికులకు ఆ

జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్‌'

ఈవెంట్స్

ఆద్యంతం ఉత్సాహ భరితం..

20-05-2018

ప్రతిష్టాత్మక కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం చివరి దశకు చేరుకుంది. 12 రోజులపాటు ప్రపంచ సినీ ప్రముఖులందరి దృష్టిని తమ వైపు తిప్పుకునేలా చేసే ఈ ఫెస్టివల్‌ 11వ రోజు సైతం ఆద్యంతం అత్యంత ఉత్సాహంగా సాగింది. వేడుకలు తుది దశకు చేరే ముందు రోజు సైతం కథానాయికలు అబ్బురపరిచే దుస్తులతో, ఎంతో అందంగ

జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్‌'

ఈవెంట్స్

బిగ్‌ బాస్‌ 2 వ్యాఖ్యాతగా నాని..

19-05-2018

బుల్లితెర ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసిన బిగ్‌బాస్‌ షో గురించి అందరికీ తెలిసిందే. బిగ్‌బాస్‌ షో ఫస్ట్‌ సీజన్‌కి ఎన్టీఆర్‌ హోస్ట్‌గా వ్యవహరించి తనదైన పంథాలో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశారు. అంతేకాకుండా షోని గ్రాండ్‌ సక్సెస్‌ చేశారు. ఇందుల

జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్‌'

ఈవెంట్స్

కేన్స్‌లో శ్రీదేవికి ఘన నివాళి..

18-05-2018

కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 9వ రోజు కూడా అత్యంత సందడిగా సాగింది. ఇటీవల ఆకస్మికంగా మరణించిన అతిలోక సుందరి శ్రీదేవికి కేన్స్‌ అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమెకు టైటాన్‌ రెజినాల్డ్‌ ఎఫ్‌ లెవిస్‌ అవార్డును ప్రకటించి చిత్ర పరిశ్రమకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు

జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్‌'

ఈవెంట్స్

కొత్త పెళ్ళి కూతురికి కేన్స్‌ సర్‌ప్రైజ్‌ ..!

17-05-2018

ప్రతిష్టాత్మక కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ సరికొత్త ఉత్సాహంతో సాగుతుంది. ఎనిమిదో రోజు కూడా సందడిగా సాగింది. కొత్త పెళ్ళి కూతురు, బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ రెండో రోజు సైతం మెరిసింది. వేరా వాంగ్‌ గౌన్‌ ధరించి ఎర్ర తివాచీపై మెస్మరైజ్‌ చేసింది. 'సోలో: ఏ స్

జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్‌'

ఈవెంట్స్

కేన్స్‌లో మెరిసిన కొత్త పెళ్ళికూతురు..

16-05-2018

కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం ఏడవ రోజు కూడా ఆద్యంతం సందడి సందడిగా సాగుతుంది. ప్రతి రోజు విభిన్నమైన, నవ్యమైన దుస్తులు ధరించిన తారల తళుకులు రెడ్‌ కార్పెట్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈసారి బాలీవుడ్‌ కథానాయికలు కేన్స్‌లో చేస్తున్న హైలైట్‌గా నిలవడం విశేషం.

జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్‌'

ఈవెంట్స్

ఘనంగా సినీ గోయర్స్‌ అవార్డుల ప్రదానోత్సవం

15-05-2018

'సినిమాకు చెందిన నటీనటులను కలవడం కష్టంగా ఉన్న రోజుల్లో బి.కిషన్‌ ఎంతో కృషి చేసి సినీ గోయర్స్‌ సంస్థ ద్వారా ప్రతిభ కనబర్చిన సినిమా వాళ్ళకి అవార్డులను అందజేశారు. ఆయన వరసత్వాన్ని తనయుడు రామకృష్ణ కొనసాగించడం, 49ఏండ్లుగా ఈ వేడుకను నిర్వహించడం అభినందనీయం' అని కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి అన్నా

జాతీయ ఉత్తమ చిత్రం 'కాసవ్‌'

ఈవెంట్స్

కేన్స్‌లో ఐశ్వర్యరారు హవా..

15-05-2018

కేన్స్‌లో మరోమారు ఐశ్వర్యరారు అందర్నీ మంత్రముగ్దుల్ని చేసింది. ఇప్పటికే దీపికా పదుకొనె, కంగనా రనౌత్‌, హ్యూమా ఖురేషి, మల్లీకా షెరావత్‌ కేన్స్‌లో పాల్గొని సందడి చేశారు. ఐదో రోజు ఐశ్వర్యరారు సీతాకోక చిలుకను పోలిన డ్రెస్‌ ధరించి వేడుకకే హైలైట్‌గా నిలవడం ఓ విశేషమైతే, ఆరవ