
తెలుగులో చేస్తున్న కొత్త ప్రయత్నమిది : విక్రమ్
విక్రమ్, కీర్తిసురేష్, ఐశ్వర్య రాజేష్ హీరోహీరోయిన్లుగా హరి దర్శకత్వంలో తమిళంలో రూపొందుతున్న చిత్రం 'సామి స్వ్కేర్'. గతంలో వచ్చిన 'సామి' చిత్రానికి సీక్వెల్. ఎం.జి.ఔరా సినిమా ప్రై.లి పతాకంపై బెల్లంరామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఇటీవల ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విక్రమ్ మాట్లాడుతూ, 'తెలుగులో నేను చేస్తున్న కొత్త ప్రయత్నమిది. కమర్షియల్‌గా, ఎమోషనల్‌గా ఉంటుంది. దర్శకుడు హరి పెద్ద హిట్ ఇచ్చి నన్ను కమర్షియల్ హీరోగా నిలబెట్టారు. ఎప్పట్నుంచో ఈ సీక్వెల్ చేయాలనుకున్నాం. కానీ 15 ఏండ్లు పట్టింది. అప్పుడు ఎలా ఉన్నామో, ఇప్పుడు కూడా అలానే కనిపించాల్సి వచ్చింది. అందుకు కెమెరామెన్ కష్టపడాల్సి వచ్చింది. కీర్తిసురేష్‌కి 'మహానటి' ఎంతో గొప్ప గౌరవాన్ని తెచ్చిపెట్టింది. ఆమె ఈ సినిమాలో నటించడం హ్యాపీగా ఉంది. ఇందులో కామెడీ ట్రాక్‌లో చాలా బాగా నటించింది. విలన్‌గా నటించిన బాబీ నాకు మంచి మిత్రుడు. నాకు సమానమైన పాత్రలో నటించాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు పెద్ద అసెట్. అందరం కష్టపడి చేశాం. తెలుగు ఆడియెన్స్ స్పందన కోసం ఎదురుచూస్తున్నాం. త్వరలోనే తమిళంలో కూడా విడుదల చేస్తాం' అని అన్నారు.
'నేను చేసిన ప్రతి సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని దర్శకుడు తెలిపారు. నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి చెబుతూ, 'ట్రైలర్‌తోనే హరి దుమ్ము దులిపేశాడు. విక్రమ్ సినిమాను మేం వదలలేకపోతున్నాం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు పెద్ద అసెట్. ఏషియన్, స్టార్ మా వారు సినిమాను తీసుకున్నారు. నాలుగు రోజుల్లో ఆడియో విడుదలతో మీ ముందుకు వస్తాం' అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శిబు, ఆర్.ఆర్ సినిమాస్ మహేష్, కె.వి.వి. సత్యనారాయణ, దుర్గం గిరీష్, శోభారాణి, బాబీ సింహా, సునీల్ తదితరులు పాల్గొన్ని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు.