ప్రేమికుల మధ్య ఉండే క్రేజీ ఫీలింగ్స్‌.. | NavaChitram | NavaTelangana | Cinema News and Celebrity News from NavaTelangana.com

హోంనవచిత్రం సినిమా వార్తలు

ప్రేమికుల మధ్య ఉండే క్రేజీ ఫీలింగ్స్‌..

'ప్రేమికుల మధ్య ఉండే ఫీలింగ్స్‌ని వినోదాత్మకంగా, ఆకట్టుకునేలా చూపిస్తున్నాం' అని అంటున్నారు దర్శకుడు సంజరు కార్తీక్‌. విష్వంత్‌, పల్లక్‌ లల్వాని జంటగా సంజరు కార్తీక్‌ దర్శకత్వంలో విజ్ఞత ఫిల్మ్స్‌ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తున్న చిత్రం 'క్రేజీ క్రేజీ ఫీలింగ్‌'. శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌ ద్వారా బాపిరాజు ఈ సినిమాని విడుదల చేయనున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు సంజరు మాట్లాడుతూ, ''కేరింత', 'మనమంతా' చిత్రాలతో ప్రేక్షకులని ఆకట్టుకున్న విష్వంత్‌ హీరోగా, పల్లక్‌ లల్వాని హీరోయిన్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించడం చాలా హ్యాపీగా ఉంది. వెన్నెల కిషోర్‌ ఇప్పటి వరకు చేసిన పాత్రల కంటే నిడివి ఎక్కువగా ఉండే పాత్రలో కడుపుబ్బ నవ్విస్తాడు. సినిమాకి ఆయనే మెయిన్‌ పిల్లర్‌. నిర్మాతలు క్వాలిటీగా నిర్మించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ముఖ్యంగా యూత్‌ని బాగా ఆకట్టుకునే అంశాలతో సినిమాని రూపొందించాం' అని అన్నారు. 'ప్రేమ, ఫీల్‌, వినోదం ఈ మూడు అంశాలకు ప్రయారిటీ ఇస్తూ దర్శకుడు యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు. వెన్నెల కిషోర్‌ కామెడీ హిలేరియస్‌గా ఉంటుంది. భీమ్స్‌ మంచి పాటలందించారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఆడియో ఫంక్షన్‌ని నిర్వహించనున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాని ఈ నెల 22న విడుదల చేస్తున్నాం' అని నిర్మాత మధు తెలిపారు.

MORE STORIES FROM THE SECTION

ప్రేమికుల మధ్య ఉండే క్రేజీ ఫీలింగ్స్‌..

సినిమా వార్తలు

రాజకీయాలు చేయటానికి రాలేదు..

17-02-2019

'నేను రాజకీయాలు చేయటానికి రాలేదు. మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చా' అని అంటున్నారు నందమూరి బాలకృష్ణ. ఆయన నటించిన చిత్రం 'ఎన్టీఆర్‌- మహానాయకుడు'. నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందించిన బయోపిక్‌ ఇది. విద్యాబాలన్‌, కళ్యాణ్‌రామ్‌, రానా, సుమంత్‌ ప్రధాన పాత్రలు

ప్రేమికుల మధ్య ఉండే క్రేజీ ఫీలింగ్స్‌..

సినిమా వార్తలు

భలే బంపర్‌ ఆఫర్‌..!

17-02-2019

మెగా కాంపౌడ్‌ వారసురాలిగా చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తోంది నిహారిక. యాంకర్‌గా కెరీర్‌ ప్రారంభించి 'ముద్దపప్పు అవకాయి' వెబ్‌ సిరీస్‌ చేసింది. ఆ తర్వాత 'ఒక మనసు'తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. గతేడాది 'హ్యాపీ వెడ్డింగ్‌' చిత్రంలో నటించి అందరి

ప్రేమికుల మధ్య ఉండే క్రేజీ ఫీలింగ్స్‌..

సినిమా వార్తలు

మళ్ళీ మ్యాజిక్‌ చేస్తారట..!

17-02-2019

'జర్నీ', 'రాజా రాణి' చిత్రాలతో జై తెలుగు ఆడియెన్స్‌ని ఆకట్టుకున్నారు. 'జర్నీ'లో శర్వానంద్‌తో, 'రాజారాణి'లో ఆర్యతో కలిసి నటించాడు కూడా. అలాగే శింబు నటించిన 'ఇదునమ్మ ఆలు', 'వాలు' చిత్రాల్లో జై అతిథిగా నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి నటించబోతున్నాడు. శింబు

ప్రేమికుల మధ్య ఉండే క్రేజీ ఫీలింగ్స్‌..

సినిమా వార్తలు

సాయం చేద్దాం రండి

17-02-2019

కాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఉగ్రవాదులు అత్యంత పాశవిశంగా చేసిన దారుణ దాడిని యావత్‌ భారతావనీతోపాటు సినీ లోకం సైతం ఖండించింది. అమర జవాన్ల త్యాగాలని గుర్తుపెట్టు కుంటామంటూ నివాళ్లర్పించింది. టాలీవుడ్‌ కథానాయకుడు విజరు దేవరకొండ ఓ అడుగు ముందుకేసి మృతి చెందిన

ప్రేమికుల మధ్య ఉండే క్రేజీ ఫీలింగ్స్‌..

సినిమా వార్తలు

బిగ్‌బి విరాళం రెండున్నర కోట్లు..

17-02-2019

ఇదిలా ఉంటే, విజరుతోపాటు బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ కూడా సాయం చేశారు. తన వంతుగా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలను (దాదాపు రెండున్నర కోట్లు) విరాళంగా సీఆర్‌పిఎఫ్‌ జవాన్ల నిధికి అందించారు. దీంతోపాటు అక్షరు కుమార్‌ జవాన్ల కోసం ఓ యాప్‌ని తయారు చేశారు. బాధి

ప్రేమికుల మధ్య ఉండే క్రేజీ ఫీలింగ్స్‌..

సినిమా వార్తలు

ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే..

17-02-2019

'సృష్టిలో ఏది జరుగుతుందో, ఏది జరగదో!? చెప్పడానికి మనుషులు ఎవరు? ఈ సృష్టిలో ఏదైనా సాధ్యమే. సృష్టి ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. అందులో మనుషులు కొంత కాలం మాత్రమే జీవిస్తారని చెప్పే ప్రయత్నమే 'విశ్వామిత్ర' సినిమా' అని దర్శకుడు రాజకిరణ్‌ అన్నారు. నందితారాజ్‌, సత్యం రాజేష్‌, అశుతోష్‌ రాణ

ప్రేమికుల మధ్య ఉండే క్రేజీ ఫీలింగ్స్‌..

సినిమా వార్తలు

నయా హీరోయిన్‌ ఫిక్స్‌..!

17-02-2019

'అర్జున్‌రెడ్డి' చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేస్తూ 'వర్మ' పేరుతో తెరకెక్కిస్తున్న విషయం విదితమే. విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్‌ పూర్తయ్యింది. కానీ ఔట్‌పుట్‌ విషయంలో సంతృప్తి చెందని నిర్మాతలు సినిమా మొత్తాన్ని రీ షూట్‌ చేయ

ప్రేమికుల మధ్య ఉండే క్రేజీ ఫీలింగ్స్‌..

సినిమా వార్తలు

ఆద్యంతం ఉత్కంఠభరితం

17-02-2019

వరలక్ష్మి, కేథరిన్‌, లక్ష్మీరారు ప్రధాన పాత్రధారులుగా జై హీరోగా ఎల్‌. సురేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నాగకన్య'. జంబో సినిమాస్‌ పతాకాలపై ఏ. శ్రీధర్‌ నిర్మిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇటీవల రిలీజ్‌ అయిన

ప్రేమికుల మధ్య ఉండే క్రేజీ ఫీలింగ్స్‌..

సినిమా వార్తలు

మిఠాయి పాటలొచ్చారు

17-02-2019

రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి ముఖ్య పాత్రధారులుగా ప్రశాంత్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మిఠాయి'. రెడ్‌ యాంట్స్‌ పతాకంపై డా||ప్రభాత్‌ కుమార్‌ నిర్మించారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం శుక్రవారం వైభవంగా జరిగింది.

ప్రేమికుల మధ్య ఉండే క్రేజీ ఫీలింగ్స్‌..

సినిమా వార్తలు

ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరించే 118

16-02-2019

కళ్యాణ్‌ రామ్‌, నివేదా థామస్‌, షాలినీ పాండే హీరోహీరోయిన్లుగా కె.వి. గుహన్‌ దర్శకత్వంలో ఈస్ట్‌ కోస్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మహేష్‌ కోనేరు నిర్మిస్తున్న చిత్రం '118'. ఈ చిత్ర ట్రైలర్‌ విడుదల కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా హీర