కొత్త రెజీనాని చూస్తారు | NavaChitram | NavaTelangana | Cinema News and Celebrity News from NavaTelangana.com

హోంనవచిత్రం సినిమా వార్తలు

కొత్త రెజీనాని చూస్తారు

'నేను 2012లో చిత్ర పరిశ్రమలోకి వచ్చాను. మొదట ఎలాంటి సినిమాలు చేయాలో, ఏది తప్పు, ఏది రైటో తెలియని పరిస్థితి. ఇండిస్టీ అర్థం కావడానికి చాలా టైమ్‌ పట్టింది. ఇకపై జాగ్రత్తగా కెరీర్‌ని మలుచుకోవాలనుకుంటున్నా' అని అంటోంది రెజీనా. ఆమె కథానాయికగా నటించిన చిత్రం 'ఎవరు'. రామ్‌ జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం రెజీనా మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
నెరేషన్‌ బాగా నచ్చింది
పీవీపీగారు ఫోన్‌ చేసి ఈ కథ గురించి చెప్పారు. అడివిశేషు, దర్శకుడు రామ్‌జీ చెన్నై వచ్చి కథ చెప్పారు. వాళ్ళ నెరేషన్‌ నన్ను బాగా ఆకట్టుకుంది. సమీర పాత్ర గురించి చెప్పగానే మైండ్‌లో ఓ పిక్చర్‌ వచ్చేసింది. వెంటనే చేస్తా అని చెప్పా. ఎంతో హార్డ్‌ వర్క్‌ చేసి ఓ స్థాయికి వచ్చిన నా జీవితంలో ఓ ఘటన జరుగుతుంది. అది ఎలాంటి మలుపులు తిప్పిందనేది కథ. నా పాత్రలో ఎక్కువగా ఎక్స్‌ప్రెషన్స్‌ ఉండవు. సెటిల్డ్‌గా కనిపించాలి. సినిమా మొత్తంలో ఎక్కువగా నేనే కనిపిస్తా. కచ్చితంగా ఓ కొత్త రకమైన రెజీనాని చూడొచ్చు. ఇంటెన్స్‌గా ఉండే ఈ సినిమా ఆడియెన్స్‌కి విందుభోజనంలా ఉంటుంది.
టామ్‌ అండ్‌ జెర్రీ
అడవి శేషుతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. తను ఎప్పుడూ ఆట పట్టిస్తుంటాడు. సినిమాలో శేషు, నా మధ్య ఇన్వెస్టిగేషన్‌ ఎలాగైతే టామ్‌ అండ్‌ జెర్రీలా సాగుతుందో, సెట్‌లో కూడా శేషు అలా ఇరిటేట్‌ చేస్తుంటాడు. కానీ అదంతా ఫన్‌ కోసమే. రామ్‌జీ కొత్త దర్శకుడైనా తనకు ఏం కావాలో బాగా క్లారిటీగా ఉంటాడు. ఈ సినిమా నా కెరీర్‌కి హెల్ప్‌ అవుతుందా? నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్తుందా? లేదా అనేది తెలియదు. రిజల్ట్‌ కోసం వెయిటింగ్‌. ఈ సినిమాని బాలీవుడ్‌కి 'బద్లా'తో పోలుస్తున్నారు. నిజమా.. కాదా అనేది సినిమా చూశాక మీరే చెప్పాలి.
డిమాండ్‌ మేరకు బోల్డ్‌గా నటిస్తా
కెరీర్‌ ప్రారంభంలో ఎలాంటి పాత్రలు చేయాలి?, ఎలాంటి స్క్రిప్ట్స్‌ ఎంచుకోవాలో అర్థం కాలేదు. సొంత నిర్ణయాలు తీసుకుంటూ నచ్చింది చేసుకుంటూ వెళ్ళాను. ఇండిస్టీ అర్థం కావడానికి, ఇక్కడి ఫొటోకాల్‌, రూల్స్‌ అర్థం కావడానికి టైమ్‌ పట్టింది. సక్సెస్‌, ఫెయిల్యూర్‌ పక్కన పెడితే మిస్‌ క్యాలిక్యూలేషన్స్‌ జరిగాయి. దీంతో ఒడిదుడుకులతో సాగింది. అంతేకానీ నా కెరీర్‌ ఏం అయిపోలేదు. బోల్డ్‌ నెస్‌ అంటే వల్గారిటీ అనే మీనింగ్‌ మన దగ్గర ఉంది. కానీ దాన్ని నేను సీరియస్‌గా భావిస్తాను. పాత్రకు, సినిమాకి అవసరాన్ని బట్టి బోల్డ్‌గా కనిపిస్తాను. బాలీవుడ్‌లో 'ఏక్‌ లడ్కీ కో దేెఖా తో ఐసా లగా' చిత్రంలో బోల్డ్‌గా ఉండే పాత్ర పోషించాను. ఆఫర్‌ వచ్చినప్పుడు చేయాలా వద్దా అనుకున్నా. నా కెరీర్‌లో అదో డిఫరెంట్‌ చిత్రం. అందులో నా పాత్రకి మంచి స్పందన లభించింది.
మూడు భాషల్లో మంచి ఆఫర్స్‌ వస్తున్నాయి
తెలుగులో కొత్తగా మరే సినిమాకి సైన్‌ చేయలేదు. కొన్నింటికి కథా చర్చలు జరుగుతున్నాయి. ఆ వివరాలు త్వరలో వెల్లడిస్తా. అలాగే తమిళంలో 'నింజమ్‌ మరపథిల్లై', 'పార్టీ', 'కల్లపార్ట్‌', 'కసడ తపర' వంటి చిత్రాల్లో నటిస్తున్నా. అక్కడ మంచి ఆఫర్స్‌ రావడం చాలా హ్యాపీగా ఉంది. బాలీవుడ్‌లో కూడా కొన్ని ప్రాజెక్ట్‌లకు చర్చలు జరుగుతున్నాయి. అక్కడ స్టీరియోటైప్‌ పాత్రలు అస్సలు రావు. ఎందుకంటే మనమేంటో తెలిశాక విభిన్న పాత్రలను ఆఫర్‌ చేస్తారు. నేను కూడా మంచి పాత్రలు వస్తే బ్యారియర్స్‌ దాటి నటిస్తాను.

MORE STORIES FROM THE SECTION

కొత్త రెజీనాని చూస్తారు

సినిమా వార్తలు

హాలీవుడ్‌ సినిమాలకు పోటీ ఇవ్వడం ఖాయం

20-08-2019

- 'సాహో' ప్రీ రిలీజ్‌ వేడుకలో కృష్ణంరాజు
ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా సుజిత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, విక్కీ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'సాహో'. ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ వేడుక ఆదివారం ఆర్‌ఎఫ్‌సీలో అ

కొత్త రెజీనాని చూస్తారు

సినిమా వార్తలు

సంక్రాంతి స్పెషల్‌గా రిలీజ్‌

20-08-2019

కళ్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా రూపొందుతున్న చిత్రం 'ఎంత మంచివాడవురా..'. సతీష్‌ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్‌ ఇండియా (ప్రైవేట్‌) లిమిటెడ్‌ నిర్మిస్తున్న చిత్రమిది. ఉమేష్&

కొత్త రెజీనాని చూస్తారు

సినిమా వార్తలు

ఎమోషనల్‌ థ్రిల్లర్‌తో కొత్త సినిమా

20-08-2019

ఇటీవల 'కల్కీ'తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న రాజశేఖర్‌ తాజాగా ఓ ఎమోషనల్‌ థ్రిల్లర్‌ చిత్రంలో నటించేందుకు గ్రీన్‌సిగల్‌ ఇచ్చారు. సరికొత్త తరహా కథాంశంతో తెరకెక్కబోయే ఈచిత్రాన్ని క్రియేటివ్‌ ఎంటర్‌టైనర్స్‌ అండ్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ అధినేత డా||జి.ధను

కొత్త రెజీనాని చూస్తారు

సినిమా వార్తలు

చూసీ చూడంగానే..

20-08-2019

శివ కందుకూరి, వర్ష బొల్లమ్మ జంటగా రూపొందుతున్న చిత్రం 'చూసీ చూడంగానే'. శేష సింధురావు దర్శకత్వంలో ధర్మపథ క్రియేషన్స్‌ పతాకంపై రాజ్‌ కందుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తనయుడుని కథానాయకుడిగా పరిచయం చేస్తూ రాజ్‌కందుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు

కొత్త రెజీనాని చూస్తారు

సినిమా వార్తలు

బాలీవుడ్‌ తొలి చిత్రం మైదాన్‌ షురూ

20-08-2019

ఇటీవల జాతీయ ఉత్తమ నటిగా అవార్డుని కైవసం చేసుకున్న కీర్తి సురేష్‌కి పలు భాషల నుంచి బంపర్‌ ఆఫర్లు రావడం విశేషం. అందులోనూ మహిళా ప్రధాన చిత్రాల్లో నటించే అవకాశం రావడం మరో విశేషం. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో రెండు మహిళా ప్రధాన చిత్రాల్లో నటిస్తున్న కీర్తికి తాజాగా బాలీవుడ్‌లోనూ ఇదే తర

కొత్త రెజీనాని చూస్తారు

సినిమా వార్తలు

టెక్నాలజీ మాయలో పడితే..?

20-08-2019

అంజలి, ఆండ్రియా, వసంత్‌ రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'తారామణి'. రామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జె.ఎస్‌.కె ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సమర్పణలో డి.వి.సినీ క్రియేషన్స్‌, లక్ష్మీ వెంకటేశ్వర ఫ్రేమ్స్‌ బ్యానర్‌పై ఉదరు హర్ష వడ్డేల్ల, డి.వి.వెంకటేష్‌ సం

కొత్త రెజీనాని చూస్తారు

సినిమా వార్తలు

ఈ రియాక్షన్‌ని ఊహించలేదు

20-08-2019

'సినిమాని పక్కా ప్లానింగ్‌తో అనుకున్నట్టుగానే చేశాం. ఇది ఏ సెంటర్‌కి పరిమితమయ్యే చిత్రమనుకున్నాం. కానీ బి, సి సెంటర్ల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తుంది. జనం నుంచి ఇంత రియాక్షన్‌ ఉంటుందని అస్సలు ఊహించలేదు. మాకిది కిక్‌నిచ్చింది' అని అంటున్నారు దర్శకుడు వెంకట్‌ రామ్

కొత్త రెజీనాని చూస్తారు

సినిమా వార్తలు

వైభవంగా వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే ఉత్సవాలు

20-08-2019

తెలుగు సినీ స్టిల్‌ ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ తరఫున 181వ వరల్డ్‌ ఫొటోగ్రఫీ డే ఉత్సవాలు హైదరాబాద్‌లోని నాగార్జున నగర్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లో సోమవారం వైభవంగా జరిగాయి. తెలుగు సినిమా స్టిల్‌ ఫొటోగ్రాఫర్ల అధ్యక్షుడు జి.శ్రీను, జనరల్‌ సెక్రటరీ కె.శ్ర

కొత్త రెజీనాని చూస్తారు

సినిమా వార్తలు

ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదు

18-08-2019

'మంచి కథని చెప్పాలని గాని, ఏదో సందేశం ఇవ్వాలని గాని ఈ సినిమా చేయలేదు. స్క్రీన్‌ప్లే ప్రధానంగా కొత్త రకమైన ప్రయోగం చేశామనుకున్నాం. కానీ ఫలితం మరోలా ఉంటుందని ఊహించలేదు' అని అంటున్నారు శర్వానంద్‌. ఆయన హీరోగా నటించిన చిత్రం 'రణరంగం'. సుధీర్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇట

కొత్త రెజీనాని చూస్తారు

సినిమా వార్తలు

డూప్‌ లేకుండా చిరు పోరాటాలు!

18-08-2019

చిరంజీవి ప్రస్తుతం 'సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్నారు. మొదటితరం స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని తెరకెక్కిస్తున్న విషయం విదితమే. దీనికి సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఇటీవల విడుదల చేసిన మే