ఇదో తిరంతక్కువ లోకంరా బాబు ఇక్కడ దున్నపోతులు ఈనుతూనే వుంటాయి దూడల్ని కట్టాల్సిందే రాజుగారి బోడిమొలని చూస్తూనే దేవతావస్త్రాల సౌందర్యం శ్లాఘించబడుతుంది
రోగికి అర్థగంటలో బెడ్ ఏర్పాటు చేస్తున్నా వ్యాధిసోకినోడి యాతనకి ఇంటిగోడే ప్రత్యక్షసాక్షి
అరగంటకోసారి అరచేతుల్ని శానిటైజర్తో కడగాలి ఎవడో తాగిచచ్చాడని శానిటైజర్తోపాటు ప్రాణాలూ నిషేధింపబడతాయిక్కడ చూరులో దాచినచుట్ట ఇల్లు తగలెట్టిందని ఇంటిలో కాపురముండొద్దనటం ఇక్కడి సమయపాలన ఎండిపోయాక మొక్కముఖాన నీళ్ళుకుమ్మరించడం ఈ మట్టికి అలవాటైన వైద్యం చచ్చాక శస్త్రచికిత్సలు చేయడం ఈ దేశానికి కొత్తేంకాదులే
కరోనా కేసుల్లో ప్రధమస్థానం కోసం ఎవరో పరుగుపందెం పెట్టినట్టు లాక్ డౌన్ గేట్లు బార్లా తెరిచి ఊరకుక్కను ఉసిగొల్పినట్టు కోవిడ్ కుక్కను ఉసిగొల్పిన పెద్దలెవరు
అసలు లాక్ డౌన్ ఎవడెత్తమన్నాడ్రా వెర్రి మేధావుల్లారా...!''
ప్రజలక్కావాల్సింది ముప్పై రాజధానులూ మసీదు దిబ్బలమీద జబ్బలు చరుచుకోడానికి మందిరాలూ కాదు ఇప్పుడు ప్రాణాలు మాత్రమే....!! ప్రాణాలు మాత్రమే !! - బంగార్రాజు కంఠ, 8500350464