Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
పర్యాటక ప్రపంచం | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

పర్యాటక ప్రపంచం

Sat 26 Sep 23:35:26.858907 2020

''వెయ్యి సార్లు వినడం కన్నా ఒక్క వాక్యం చదవడం మేలు. వెయ్యి వాక్యాలు చదవడం కన్నా ఒక్కసారి చూడడం మేలు'' అని లోక నానుడి ఉంది. అంటే యాత్రల వలన ఎంతో అనుభవం, విజ్ఞానం వస్తుందనేది నిర్వివాదాంశం . అసలు మొదటగా ఈ యాత్ర అనే శబ్దం ఎలా వచ్చిందో చూద్దాం. ''యాన్తి అస్యామ్‌ ఇతి యాత్రాయా- ప్రాపణే'' అని సంస్కృతం లో దీనికి వ్యుత్పత్తి ఉన్నది. మనుస్మతి కాలం నాటికి యాత్ర అంటే రాజులు పొరుగు రాజ్యాలపై దండెత్తి పోరు సర్పి విజయం పొందడానికి చేసే జైత్రయాత్ర, విజయయాత్ర. అనే అర్థంలో ఉండేది. కాలక్రమేణా అది తీర్థయాత్ర అన్న అర్థంలో విస్తరించబడింది. యాత్రల వలన ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, ఆహార విశేషాలు, వేష భాషలు, సంప్రదాయాలు వంటి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ప్రపంచం వన్య భాషల, భిన్న ఆకారాల, భిన్న మతాల సమాహారం. కొత్త ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తెలిసిన ఆశ్చర్యకర విషయాలను యాత్రికులైన మహానుభావులు కొందరు అక్షర రూపంలోకి మలిచారు. వారి కళ్ళు చూసిన అత్యద్భుత సౌందర్యాలను, వారి గుండెల్ని తాకిన ఆశ్చర్యకర సంఘటనలను, హదయ స్పందనలను అక్షరీక రించారు. ఇటువంటి యాత్రా చరిత్రల వలన మనకీనాడు ఎంతో విషయ పరిజ్ఞానం లభిస్తున్నది.
ప్రపంచ పర్యాటక దినోత్సవమని దీనికి ఒకరోజు ఎందుకు కేటాయించారో తెలుసుకుందాం. అంతర్జాతీయ సమాజంలో పర్యాటక పాత్ర మీద అవగాహన కలిగించడం కోసం ఇలా ఒక రోజును నిర్ణయించారు. యునైటెడ్‌ నేషన్స్‌ వరల్డ్‌ టూరిజవమ్‌ ఆర్గనైజేషన్‌ వారు ప్రతి యేటా సెప్టెంబరు 21వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపు కోవాలని నిర్ణయించారు. ప్రతి సంవత్సరం ఒక నినాదాన్ని ఏర్పరచుకొని ఆ దిశగా ప్రయత్నాలు చేపట్టాలని నిశ్చయించు కున్నారు. 1980వ సంవత్సరం నుంచి ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపు కుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సామాజిక, సాంస్కతిక, రాజకీయ, ఆర్థిక విలువలను పర్యాటకం ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి ఒక రోజును ఏర్పాటు చేసుకున్నారు. ప్రపంచ దేశాల మధ్య సాంఘిక, రాజకీయ, ఆర్థిక జీవన విధానాల మీద అవగాహన కల్పించటమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ప్రపంచ పర్యాటక రంగంలో ఇది ఒక మైలు రాయిగా అభివర్ణించబడింది. ప్రతి సంవత్సరం ఒక దేశం ఆతిధేయ దేశమై సమావేశాలను పర్యవేక్షిస్తుంది. 15వ ప్రపంచ పర్యాటక దినోత్సవం సమావేశాలు చైనాలోని బీజింగ్‌లో జరిగాయి. ప్రతి సంవత్సరం సమావేశాలు ఒక్కో దేశంలో జరుగుతున్నాయి. అయితే 2003వ సంవత్సరంలో ఈ సమావేశాలను భౌగోళిక క్రమంలో జరపాలని నిర్ణయించు కున్నారు. 2011 నుంచి UTWTO సంస్థ వరసగా ''సస్టెయినబుల్‌ టూరిజమ్‌'', ''టూరిజమ్‌ అండ్‌ ద డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్‌'', ''టూరిజమ్‌ అండ్‌ జాబ్స్‌ ఎ బెటర్‌ ఫ్యూచర్‌ ఫర్‌ ఆల్‌'' అనే నినాదాలతో పర్యాటక దినోత్సవాలను జరుపుకున్నది.
యాత్రలు ఎలా చేసినా దేని కోసం చేసినా అనుభవం, అనుభూతి ప్రధానమైనవి. యాత్రలు చాలా రకాలుగా ఉంటాయి. సాహస యాత్రలు, అన్వేషణ యాత్రలు, అంటూ ఆయా ఎన్నో రకాలు ఉంటాయి. కాని యాత్రలను ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించారు. లక్ష్యాన్ని బట్టి, గమన విధానాన్ని బట్టి, సమాచారాన్ని బట్టి, కాలక్రమాన్ని బట్టి వాటిని పరిగణించవచ్చు. విజ్ఞాన వినోద, విహారయాత్రలు, తీర్థయాత్రలు, పరిశీలన యాత్రులు, వ్యాపార యాత్రలు, సాహిత్య, సాంస్కతిక యాత్రలు వంటివన్నీ లక్ష్యం గలిగిన యాత్రల కిందికి వస్తాయి. పాద యాత్రలు, నౌకాయాత్రలు, వాహన యాత్రలు, ఆకాశ యాత్రలు, రోదసిి యాత్రలు వంటి వాటిని గమన, విధాన యాత్రలుగా చెప్పుకోవచ్చు. మరికొన్ని విషయ ప్రధాన, వర్ణనా ప్రధాన యాత్రలుంటాయి. వాహనాలు రాకముందు చేసిన యాత్రలు, వాహనాలు అందుబాటులోకి వచ్చాక చేసిన యాత్రలు అని రెండు రకాలు విషయ యాత్రల కిందికి వస్తాయి. పర్యాటక దినోత్సవమంటూ ఒక రోజు పెట్టారు కాబట్టి ఇలా విపులంగా చర్చించుకుంటున్నాం గానీ మామూలుగా యాత్రలు చేయటం వలన రోజువారీ రొటీన్‌ నుండి దూరంగా కొత్త ప్రదేశాలకు వెళ్ళినపుడు మనసు ఉల్తాసంగా ఉత్తేజితంగా మారుతుంది. ప్రతిరోజూ ఉండే ఆఫీసులు, స్కూళ్ళు, వంటలు అని నిత్య పనుల నుండి తప్పుకొని కొత్తగా ఆలోచించినట్లుంటుంది. బహుశా పూర్వకాలం బంధువుల ఇళ్ళకు వెళ్ళి నెలల కాలాలు ఉండటం ఇందుకే కావచ్చు. ''ఇచ్చి పుచ్చుకుంటే వ్యవహారం, వచ్చి పోతుంటే బంధుత్వం'' అనే సామెత కూడా ఇలాగే పుట్టి ఉంటుంది. పూర్వపు మన వారు వత్తిడిని జయించడానికి ఇదొక కారణం అయి ఉండవచ్చు. ఇప్పుడు అమ్మమ్మ ఇళ్ళకు, నాయనమ్మ ఇళ్ళకు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముల ఇళ్ళకు వెళ్ళటం కూడా గగనమైపోయింది. వాళ్ళ ఇళ్ళలో కొన్ని రోజులు ఉండటం వలన, అందరికీ వచ్చే సామాన్య సమస్యలను వాళ్లెలా పరిష్కరించుకుంటున్నారో అర్థమవుతుంది. ఇప్పుడు ఎవరిళ్ళకి వెళ్ళక పోవటం వలన చిన్న సమస్యలకే కంగారు పడిపోయి, ఈ సమస్య మనకు మాత్రమే వచ్చింది, ఇంకెవరికీ ఉండదని భయపడి పోయి వత్తిడికి లోను కావటం గానీ, ఆత్మహత్యలు దిశగా ప్రయత్నించటం గానీ జరుగుతున్నది. దసరా శెలవులు, సంక్రాంతి శెలవులు, వేసవి శలవులలో తప్పనిసరిగా ఏదో ఒక చోటికి వెళ్ళి రావడం వల్ల పిల్లలు, పెద్దలు కూడా పునురుత్తేజం పొందుతారు.
ప్రపంచ చరిత్రను గమనిస్తే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యంత్రికులు ఎందరో కనిపిస్తారు. వారిలో క్రిస్టోఫర్‌ కొలంబస్‌, డొమింగ్‌పీస్‌, పాహియాన్‌, మార్కో పోలో మ్యువాన్‌త్సాంగ్‌, మెగస్తనీస్‌ వంటి వారు ప్రధానంగా కనిపిస్తారు. గ్రీకు చరిత్ర కారుడైన మెగస్తనీస్‌ భారతదేశాన్ని సందర్శించిన తొలి యాత్రికుడు. పది సంవత్సరాల పాటు పాటలీపుత్రంలో నివసించి భారతీయ ప్రజల ఆకార విశేషాల గురించి 'ఇండా' అనే గ్రంథంలో వివరించాడు. కొలంబస్‌ 14 వ శతాబ్దపు ఇటలీ నావికుడు, ప్రపంచ యాత్రికుడు అట్లాంటిక్‌ సముద్రంపై కొలంబస్‌ చేసిన సాహసపు యాత్ర వలన యూరోపియన్లకు పశ్చిమాన ఉన్న అమెరికా ఖండాన్ని పరిచయం చేసింది. మన దేశాన్ని సందర్శించిన మరో ప్రపంచ యాత్రికుడు మార్కోపోలో. ఇతడు శిల్క్‌ రూట్‌ గుండా చైనా వరకు ప్రయాణించాడు. పదమూడవ శతాబ్దంలో మన దేశంలో ప్రయాణించాడు. భారతదేశం గురించి తన రచనల్లో పొందు పరిచిన మరో ప్రపంచ యాంత్రికుడు ఫాహియాన్‌. ఇతను క్రీ.శ 402 సం||లో భారతదేశం వచ్చిన చైనా బౌద్ధ యాత్రికుడు హ్యుయాన్‌త్సాంగ్‌ కూడా చైనా బౌద్ధ భిక్షువే. క్రీ.శ. 646 వ సం||లో మధ్యయుగ ఆసియా, భారతదేశ విశేషాలను గురించి ఒక పుస్తకంలో రాశాడు. ''గ్రేట్‌ టాంగ్‌ రికార్డ్స్‌ ఆన్‌ ద వెస్ట్రన్‌ రీజియన్స్‌'' అనే పుస్తకాన్ని రచించాడు. ఇతనూ చైనా యాహకుడే. ప్రపంచ యాత్రికులు భారతదేశ విశేషాల్ని తమ రచనల్లో పొందుపరచటం వల్ల మన దేశం గొప్పదనం ప్రపంచానికి తెలిసింది. ఇదే యాత్రల వలన జరిగే ఉపయోగం ఇంకా ఆలేఖిమానీ, ఇబ్న్‌బటూటా, నికోలో కోంటీ, అబ్దుల్‌ రజాక్‌, స్కోరర్‌ వంటి ఎంతో మంది ప్రపంచ యుత్రికులున్నారు. వాస్కోడిగామా, పొర్చుగీసు యాత్రికుడు 14వ దశాబ్దంలో కాలికట్‌కు ప్రయాణించాడు. ''ద వాయేజ్‌ ఆఫ్‌ వాస్కోడిగామా'' అనే గ్రంథంలో ఆయన తన ప్రయాణం వివరాలను అక్షరీకరించాడు.
భారతీయ యాత్రికులను పరిశీలించినప్పుడు ''రాహుల్‌ సాంకృత్యాయన్‌'' పేరు ప్రస్ఫుటంగా వినిపించింది. భారతీయ యాత్రా చరిత్రకు పితామహుడు వంటి వాడు రామాలే సాంకృత్యాయన్‌. ఇతడు తన జీవితంలో 45 సంవత్సరాలు యాత్రలు చేసి తన అనుభవాలను యాత్రా చరిత్రలుగా మలిచాడు. ఈయన జీవితకాలం 1893 నుండి 1963. పురాతన బౌద్ధ గ్రంథాలను వెలికితీసి వాటిని అనువాదం చేసి ప్రపంచానికి తెలియ జేయటంలో రాహుల్‌ కషి అపారమైనది. రాహుల్‌ రాసిన ''మనుక్కడ్‌ శాస్త్ర్‌'' అనే యాత్రా విజ్ఞాన శాస్త్ర గ్రంథం మరెంతమందో యాత్రికులను తయారు చేసింది. ప్రపంచంలోనే ఇటువంటి యాత్ర చరిత్ర గ్రంథం మరొకటి లేదనే పేరు ఈ గ్రంథానికి లభించింది. 'ఓల్గా సే గంగా' అనే గ్రంథం కూడా అపురూప చారిత్రకాంశాల సమాహారం. క్రీ.పూ. వేయి సంవత్సరాల నుండి మానవుడి పరిణామ క్రమ వికాసాల గురించి తెలియ చెప్పిన అద్భుత గ్రంథమిది.
మేమూ మా పనుల ఒత్తిడిని తగ్గించుకోవటానికీ, కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి యాత్రలు చేస్తూంటాము. పైన వివరించినట్లుగా సాహస యాత్రలు, పరిశీలన యాత్రలు అని వివరించినట్లుగా మా యాత్రల్ని వర్ణించవలసి వస్తే కాన్ఫరెన్స్‌ యాత్రలు పేరు పెడతాను నేను. మేము ఇలా యాత్రలు చేయడమే కాదు అక్కడి విషయాలను, వింతలూ- విశేషాలను వ్యాసాలుగా రాస్తుంటాము. నేను దాదాపు 50-60 వ్యాసాలు రాశాను. వీటన్నిటినీ రెండు పుస్తకాలుగా ప్రచురించాను.
మేము ఎక్కడికి వెళ్ళినా విద్య, వైద్యం, విజ్ఞానం, హస్తకళల వంటి వాటిపై దష్టి పెడతాము. ఆయా రాష్ట్రాల, దేశాల ప్రత్యేక హస్తకళలకు సంబంధించిన బొమ్మలు కొనుక్కువస్తాను దక్షిణాఫ్రికా వెళ్ళినప్పుడు ఆస్ట్రిచ్‌ల గుడ్లును కొనుక్కొచ్చాను. గుడ్లను తెచ్చుకున్నారా అని ఆశ్చర్యపోకండి. గుడ్లపై నుండే షెల్స్‌పై అందంగా పెయింటింగ్‌ చేసి అమ్ముతారు. ఆ దేశాన్ని వారి ప్రత్యేకతనూ తెలిపే కళ అని తెచ్చాను. అలాగే స్విట్జర్లాండు నుంచి పైన్‌ చెట్ల కాయలు, అరకు నుంచి పట్టు పురుగుల కాయలు, అండమాన్‌ దీవుల నుండి గవ్వల వస్తువులు ఎన్నో తెచ్చుకున్నాను. ఏ దేశమెళ్ళినా, ఏ రాష్ట్రమేగినా అక్కడి భాషతో ఉన్న దినపత్రికలు సేకరించడం నా అలవాటు. వాటన్నిటినీ ఫైల్స్‌లో పెట్టి వచ్చిన వాళ్ళందరకూ చూపిస్తాను.
ఇవి మా వైద్య రంగానికి సంబంధించిన కన్ఫరెన్సులు కాబట్టి ప్రఖ్యాతమైన మెడికల్‌ కాలేజీలు, ఆసుపత్రులు చూసే అవకాశం కలుగుతుంది. నేనీ అవకాశం వదులుకోలేదు. మెడికల్‌ కాలేజీల దగ్గరా, ప్రముఖ హాస్పిటల్స్‌ దగ్గరా ఖచ్చితంగా ఫొటోలు తీసుకుంటాను. ఢిల్లీలోని ప్రఖ్యాత ఎయిమ్స్‌ మెడికల్‌ కాలేజీ, చంఢఘీర్‌లోని పిజిఐఎమ్‌ఆర్‌ కాలేజీని చూసినప్పుడు అపర ధన్యంతరులను తయారు చేసే విద్యాలయాలు కదా అని దణం పెట్టుకున్నాను. మణిపాల్‌లోని కస్తూరిబా మెడికల్‌ కాలేజీ, పూనాలోని భారతీయ విద్యా పీఠ్‌, మద్రాసులో శ్రీరామచంద్ర, ఢిల్లీలోని సర్‌ జంగ్‌ వంటి ప్రముఖ మెడికల్‌ కాలేజీలను చూస్తే ప్రాణదాతలను అందించే దేవ దూతలనిపిస్తుంది.
నేను దాదాపు పన్నెండు దేశాలు పదహారు రాష్ట్రాలు చూశాను. వాటిలో ప్రఖ్యాత ప్రపంచ వింతల్ని చూసినప్పుడు అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. చంద్రుడి మీదకు వెళ్ళినా భూగ్రహం మీద ఒక సన్నని గీతలా కనిపించే చైనా మహా కుడ్యాన్ని మూడు సార్లు చూడటం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. దక్షిణ ఆఫ్రికా దేశంలో జాతిపిత మహాత్మా గాంధీ యువకుడిగా ఉన్న విగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాము. నెల్సన్‌ మండేలా ఉన్న జైలును చూసినప్పుడు ఆ మహా నేత ఇంత చిన్న గదిలో ఉన్నాడా? 27 సంవత్సరాలు జాతి కోసం జైలు జీవితం గడిపాడా? అని ఆలోచిస్తే మనసంతా చేదుగా అయిపోయింది. గాంధీజీని రైలులో నుంచి కిందకు దింపేసింది ఈ దక్షిణాఫికాలోనే కదా అని బాధపడ్డాం. మన బాగు కోసం ఆ మహానేతలు ఎన్ని కష్టాలనుభవించారో కదా! అలాగే అండమాన్‌ దీవుల్లో స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్న దేశభక్తులు ఆ జైలులో మగ్గారని తెలుసుకుంటే మనమీనాడు ఆ స్వాతంత్య్ర ఫలాలను దుర్వినియోగం చేస్తున్నామని పించింది. పారిస్‌లోని ఈఫిల్‌ టవర్‌ను చూస్తే ఇది మానవ నిర్మితమేనా అని ఆశ్చర్యమనిపిస్తుంది. అందాల ప్రేమ మందిరం తాజ్‌మహల్‌ను దర్శించినపుడు షాజహాన్‌ కళాభిరుచికి జోహర్లు చెప్పాలనిపిస్తుంది.
హిందూ మహా సముద్రం, అట్లాంటిక్‌ మహా సముద్రాలు కలిసే అద్భుతాన్ని దక్షిణాఫ్రికా దేశంలో చూశాము. అట్లాస్‌ అనే రాక్షసుని పేరు మీదుగా ఉన్న ఈ మహాసముద్రాన్ని చూడటంతో చాలా ఉద్విగతకు లోనయ్యాం. ప్రపంచంలోని మూడవ అతి పెద్దదైన హిందూ మహా సముద్రం ఉపాంత సముద్రాలైన అరేబియా సముద్రం, బంగాళాఖాతం, అండమాన్‌ సముద్రం వంటి వాటిలో క్రూయిజ్‌ షికార్లు చేశాం. ప్రపంచంలోని అతి పెద్దదైన పసిఫిక్‌ మహా సముద్రాన్ని చూడాలని కోరిక. ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్‌ ఖండాలను చూశాను. అంటార్కిటికా ఖండం జనావాసం లేని ఖండం. పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది. నాలుగు ఖండాలు, రెండు మహా సముద్రాలు, నాలుగు ప్రపంచ వింతలు చూడటం నా అదష్టం.
నేను బాల సాహితీవేత్తను కాబట్టి ఆయా దేేశాలలోని ప్రముఖ బాల సాహిత్య పుస్తకాలు తీసుకు వస్తున్నాను. ఈ మధ్యనే ఈ ఆలోచన వచ్చింది. కాబట్టి దక్షిణాఫ్రికా, చైనా, స్విట్జర్లాండు దేశాల సాహిత్య పుస్తకాలు మాత్రమే ఉన్నాయి నా దగ్గర. చెట్ల ఎండు భాగాలు, సముద్రంలోని గవ్వలు, రాళ్ళు, ప్రవాళాలు వంటివెన్నో విదేశాల నుంచి తెచ్చి వాటితో బొమ్మలు తయారు చేసి మా మిల్కి మ్యూజియంలో భద్రపరిచాను. చండీఘర్‌లో రాక్‌ గార్డెన్‌ చూశాక 'నా బొమ్మల్ని కూడా ఇంత పెద్ద ఆర్ట్‌ గ్యాలరీగా పెట్టాలనిపించింది. శాంతినికేతన్‌లో విశ్వకవి ఠాగూర్‌ బొమ్మలు చిత్రాలు చూసా, అద్భుతమనిపించింది. అక్కడ చూసి వచ్చాకనే ఠాగూర్‌ రచించిన 'ఛుట్టీ' అనే పుస్తకాన్ని తెలుగులోకి అనువాదం చేసే అవకాశం లభించింది.
ప్రధానమైన క్రూగర్‌ నేషనల్‌ పార్కుల్లాంటి నేషనల్‌ పార్కులు, రంగన్ర తిట్టు పక్షి ధామం లాంటి బర్వ్‌ శాంక్చురీలు, మైసూరు లోని రవివర్మ ఆర్ట్‌ గ్యాలరీల వంటి గ్యాలరీలు, అనేక ఫ్లవర్‌ గార్డెన్లు చూశాం. చారిత్రాత్మకమైన హవా మాహల్‌, ఆమేర్‌ కోట, మధ్యప్రదేశ్‌లోని అహల్యాబాయి కోట, మాండూ కోట, దౌలతాబాద్‌ కోట వంటి రాజుల మందిరాలు, ప్రాచీన నలందా విశ్వవిద్యాలయంతో పాటు అనేక రాష్ట్రాల విశ్వవిద్యాలయాను దర్శించాను. యాత్రలు చేయటం ద్వారా అనేక సైన్స్‌ సెంటర్లనూ చూశాను. విద్యా వైద్య విజ్ఞాన, చారిత్రక, సాంస్కృతిక విషయాలెన్నో తెలుసుకో గలిగాము మేము. ఇంత వెలుగులిచ్చిన యాత్రల్ని మీరూ చేసే ఉంటారనీ, ఇకపై చేస్తారని భావిస్తున్నాను.
- డా|| కందేపి రాణీప్రసాద్‌,
9866160378

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆ మూడు చట్టాలలో అస‌లేముంది?
సినీ సంగీత సామ్రాజ్యంలో గాన గంధర్వుడు యేసుదాస్‌
క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే
2020లో ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా !
ఎన్ని క్రిస్ట్‌మస్‌ లో..!
వెల్లువెత్తిన భారత రైతు పోరాటం
మానవ హక్కులు : వర్తమాన వాస్తవం
గాలికి రంగులద్దిన దేవి
తెలంగాణ సినిమాకు తొలి కథానాయకుడు టి.ఎల్‌. కాంతారావు
మన బంగారు బాల్యం.. సమస్యలు.. సవాళ్ళు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
07:37 AM

గుడివాడ టూటౌన్ ఎస్సై ఆత్మహత్య

07:32 AM

నేడు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు సీఎం కేసీఆర్

07:04 AM

టీవీ నటిపై పైలట్ లైంగికదాడి

06:46 AM

నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

06:41 AM

భీమ‌డోలులో వింత‌వ్యా‌ధి క‌ల‌క‌లం...

08:58 PM

ఇసుక డంపును పట్టుకున్న పోలీసులు

08:43 PM

ప్రైవేటు బస్సు బోల్తా..

08:20 PM

సిరాజ్ పై కేటీఆర్ ప్రశంసల జల్లు..

08:13 PM

23 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లు పట్టివేత

08:05 PM

ఇంగ్లాండ్ తో తొలి రెండు టెస్టులకు రేపు భారత జట్టు ఎంపిక

07:52 PM

కత్తితో పోడిచి సారీ చెప్పి, 1000 ఇచ్చారు..

07:24 PM

ఇద్దరు మహిళా జడ్జీలను కాల్చి చంపాడు..

07:18 PM

23న బెంగాల్‌లో ప్రధాని మోడీ పర్యటన

06:51 PM

రెండు బైక్‎లు ఢీ..ఒకరు మృతి

06:32 PM

ఏపీలో 81 కరోనా కేసులు నమోదు

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.