Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అడ్డు గోడ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

అడ్డు గోడ

Sat 07 Nov 23:28:43.68668 2020

నేను వినడం, కల్పించుకుని అడగడం సభ్యతగా ఉంటుందా? అని ఆలోచించే దాన్ని. బాధపడేదాన్ని. నీ గదిలో నువ్వు దీర్ఘంగా నిట్టూర్చినా అది నా గదిలోకి వినిపించేది. బహుశా ఈ విషయం నీకు తెలియకపోవచ్చు ఒకరి వెనక ఒకరం కూర్చుని ఉన్నాం. కాని, మన మధ్య ఒక 'అడ్డుగోడ' ఉంది.
ఆఫీసులో నీ గది నా గది పక్కపక్కనే ఉన్నాయి. అయినా నా గది అటు వైపు పోలేదు. నీ గది ఇటు వైపు రాలేదు. ఈ గదులకు కొన్ని పరిమితులున్నాయి. ఈ రెండింటి మధ్య ఒక అడ్డుగోడ ఉంది. అది ఎప్పటి నుంచో ఉంది. పొరపాటున ఎప్పుడైనా నీ చేయి అడ్డుగోడ మీద పడితే, ఆ చప్పుడు ఆవతలి వైపు నాకు వినిపిస్తుంది. ఓ రోజు ఎవరో నీ గదిలో మన మధ్య గోడ మద మేకు కొట్టారు. ఆ రోజు నా గది యావత్తు శబ్దాలతో ప్రకంపనలతో కదిలి పోయింది. నేను గది బయటికి వరండాలోకి వచ్చి చూద్దును కదా నీ గది గుమ్మానికి ఒక దళసరి పరదా వేలాడుతూ ఉంది. నేను తిరిగి నా గదిలోకి వెళ్లిపోయాను. గుమ్మాలకు, కిటికీలకు జనం ఈ మధ్య ఖరీదైన గుడ్డలతో అందంగా పరదాలు వేసుకోవడం నేర్చారు. ఆ మాటకొస్తే నా గది గుమ్మానికి కూడా ఓ అందమైన కర్టెన్‌ వేలాడుతూ ఉంది.
ఒక్కొసారి నువ్వెప్పుడైనా బంట్రోతును చివాట్లేస్తున్నప్పుడు నేను రాయడం ఆపేసి, కలం పక్కన పెట్టి, ఊరికే కూర్చునేదాన్ని. వచ్చి 'విషయమేమి'టని అడుగుదామని అనిపించేది. కాని, నేనలా చేయడం నీకు నచ్చుతుందో లేదోనని జంకేదాన్ని. నీ బంట్రోతును నువ్వు చివాట్లేసేప్పుడు.. నేను వినడం, కల్పించుకుని అడగడం సభ్యతగా ఉంటుందా? అని ఆలోచించే దాన్ని. బాధపడేదాన్ని. నీ గదిలో నువ్వు దీర్ఘంగా నిట్టూర్చినా అది నా గదిలోకి వినిపించేది. బహుశా ఈ విషయం నీకు తెలియకపోవచ్చు ఒకరి వెనక ఒకరం కూర్చుని ఉన్నాం. కాని, మన మధ్య ఒక 'అడ్డుగోడ' ఉంది.
ఓ రోజు నా గదిలో ఫ్యాన్‌ ఆగి పొయ్యింది - బహుశా కరెంట్‌ పోయి ఉంటుంది. కొన్ని నిముషాలు చూశాను. ఉక్కతో ఊపిరాడక బయటికి వరండాలోకి వచ్చాను. నీ గదిలో కూడా ఫ్యాన్‌ ఆగిపోయి ఉంటుందని అనుకున్నాను. పరదా సందులోంచి నీ గదిలోకి తొంగి చూస్తూ ''పంఖా నడుస్తోందా?''- అని అడిగాను.
'కరెంట్‌ లేక ఫ్యాన్‌ ఆగిపోతే బయట వరండాలోకి రావొచ్చు కదా?' అని నా ఉద్దేశం. గది లోపల ఉక్కపోతలో ఇబ్బందిపడే కన్నా కొంత సేపు బయటికొచ్చి హాయిగా ఊపిరి పీల్చుకోవడంలో తప్పేముంది?
''లేదు. పంఖా ఆగిపోయింది! కాని, కిటికీ తెరుచుకున్నాను'' అన్నావు నువ్వు.
నా గదికీ ఉంది. ఓ కిటికీ.. కానీ, నాకు ఆ సంగతే గుర్తు లేదు. అందుకే బయటి వరండాలోకి వచ్చాను.
ఓ రోజు ఫైల్‌ రాస్తున్నప్పుడు పొరపాటున నా పెన్ను జారి కింద పడిపోయింది. నిబ్‌ విరిగిపోయింది. నీ గది నుండి మరో పెన్‌ తెప్పించుకుందా మనుకున్నాను. కాని, మరో పెన్‌ అదనంగా ఉందో లేదోనని.. అనుమానపడ్డాను. ఎవరైనా ఒక పెన్నే కదా ఉంచుకుంటారు. సామాన్యంగా- ''ఒకటే ఉంది. మరొకటి లేదు.'' అని నువ్వంటే.. నేను నా మనసు కష్ట పెట్టుకోకుండా ఉండలేమోనని అనిపించింది. అందుకే ధైర్యం చాలలేదు.. అడగడానికి! కొన్ని కొన్ని విషయాల గూర్చి చాలా సార్లు మనమే ప్రశిస్తాం! మళ్లీ మనకు మనమే సమాధానం చెప్పుకుంటాం!
ఈ మధ్య గోడను తీసేయిస్తే ఎలాగుంటుందీ- అని ఒక్కోసారి ఆలోచిస్తుంటాను. అప్పుడు నీ గది నీ గదిలో ఉండదు. నా గది నా గదిలా ఉండదు. ఒక విశాలమైన హాలులాంటి పెద్ద గది అవుతుంది. పెద్దదయినా, చిన్నదయినా గది గదే కదా? అయినా అలా చేయడం సబబు కాదేమో.. ఇలా వేరు వేరు గదులు కట్టినవాడు, అన్ని ఆలోచించే కట్టించి ఉంటాడు కదా ?
సిమెంటూ, ఇటుకలతో కటిన ఈ అడ్డుగోడ ఒక్కోసారి నాకు అసలు అడ్డుగోడే కాదనిపిస్తుంది. అందుకే గోడలోంచి అన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాను. ఒక్కోరోజు నువ్వు పని చేయలేక పోతున్న సంగతి నీరసంగా పై కప్పు వైపు చూస్తూ కూర్చున్న సంగతి, ఫైలు తెరచి కాసేపు, ఫైలు మూసి కాసేపు.. కాలయాపన చేస్తున్న సంగతి నాకు తెలిసిపోతుంటుంది. బూట్లు వేసుకుంటూ, విడుస్తూ, కూచోలేక, నిలబడలేక అసహనంగా ఊగిపోతున్న సంగతి, ఎటూ తోచక అరచేతి గీతలు చూసుకుంటూ పరధ్యానంగా ఉన్న సంగతి అన్నీ నాకు తెలసిపోతూ ఉంటాయి. ఒక్కోసారి కాస్త హుషారుగా ఉన్నప్పుడు సన్నగా విజిల్‌ వేస్తూ పాట పాడడం, టేబుల్‌పై నున్న పేపర్‌ వెయిట్‌ గుండ్రంగా తిప్పుతూ ఉండడం కుర్చీలో ప్రశాంతంగా వెనక్కి జారగిలబడి, కాళ్లు పైకెత్తి పెట్టుకోవడం అన్నీ నాకు తెలిసిపోతూ ఉంటాయి. ఆ సమయంలో నేనేమాత్రం చప్పుడు చేయను. ఆ చిన్న శబ్దానికైనా నువ్వు ఉలిక్కి పడతావేమోనని నా భాయం!
వచ్చేప్పుడో, పోయేప్పుడో వరండాలోనో, మెట్ల మీదో కలుసుకుంటాం ''ఊ..చెప్పు. ఎలా ఉన్నావ్‌'' అని కుశలమడుగుతావు. సన్నగా నవ్వుతూ ''బావున్నాను'' అని అంటాను.
నువ్వు నీ గదిలోకి పోతావు. నేను నా గది లోకి- నీ గది ఇటు వైపు రాలేదు. నా గది అటు వైపు పోలేదు. ఈ గదులకు కొన్ని పరిమితులున్నాయి. ఈ రెండింటి మధ్య ఒక వాస్తవం- అడ్డుగోడ.
మన గదుల మధ్య అడ్డుగోడ ఉండి కూడా నువ్వు ఆఫీసుకు రాని రోజు- అంటే నీ గదిలో నువ్వు లేని రోజు నాలో ఏదో వింత భావం బెంగగా తిరుగాడుతూ ఉంటుంది. ఆ రోజు ఎన్నిసార్లు గడియారం చూసుకుంటానో, ఎన్నిసార్లు నీళ్ళు తాగుతావో, అవసరం లేకపోయినా ఎంత మందికి ఫోన్‌ చేస్తానో చెప్పలేను. రోజటిలా ఆఫీసు పని చకచకా చేసుకోలేను. పని వాయిదా వేస్తుంటాను. ''ఏం. ఇవాళ మీ సారు రాలేదా?'' అని వరండాలో కనిపించిన నీ అటెంటర్‌ని అడుగుతాను. ఒక్కోసారి అడగకపోయినా, అతనే చెపుతుంటా డు. ''మా అయ్యగారు ఊళ్ళో లేరమ్మా''- అనో ''సారింటికి చుట్టా లొచ్చారనో'' చెపుతుంటాడు.
ఒకసారి చిత్రమైన ఆలోచనలు ఉండి ఉండి నా మెదడులో తిరుగుతూ ఉంటాయి. నా గదిలో యాభై యేళ్ల క్రితం ఎవరో కూర్చుని ఉంటారు. పక్క గదిలో కూడా ఎవరో కూర్చునే ఉంటారు కదా? మరి మరో యాభై యేళ్ల తర్వాత కూడా ఈ గదిలో ఎవరో ఒకరు కూర్చునే ఉంటారు. ఏ గదిలో కూడా ఎవరో ఒకరు కూర్చుంటారు. అయినా... మనుషులు చచ్చిపోవడమేమిటి? అసలు ఎందుకు పుడతారూ? వంటి ఆలోచనలతో మనసంతా కకావికలవుతుంది. భయం పుడుతుంది. అలాంటిది ఇప్పుడు ఆ భయం పోగొట్టుకోవడానికి అలా వేరే సెక్షన్లలోకి వెళ్లి స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడుతుంటాను.
కొన్ని రోజుల వ్యవధితో నువ్వు కనపడగానే ''రాలేదేం ఇన్ని రోజులు''- అని తెలిసి కూడా అడుగుతాను.
''కొంచెం ఆరోగ్యం చెడింది.. ఈ మధ్య'' అని అంటావు.
''మరి ఇప్పుడెలా ఉంది?''
''ఆ.. ఫరవాలేదు. థాంక్స్‌''- అంటావు. నువ్వు నీ గదిలోకి వెళ్ళిపోతావు. నేను నా గదిలోకి వచ్చేస్తాను. నీ పనిలో నువ్వు మునిగి పోతావు. నా పనిలో నేను...
ఓ సారి నేను చాలా రోజులు సెలవు పెట్టాను-
''మేడమ్‌ గారు రావడం లేదా?'' నువ్వు నా అటెండర్‌ని అడిగావు.
''ఆరోగ్యం బాగులేదంట సార్‌! అందుకని..'' అన్నాడతను.
''ప్చ్‌. అవునా పాపం !'' అంటూ నువ్వు నీ గదిలోకి వెళ్ళి పొయావు. పోస్ట్‌లో వచ్చిన ఉత్తరాలు ఇవ్వడానికి నా ఇంటి కొచ్చిన నా అటెండర్‌ ఆ విషయం వివరంగా చెప్పాడు. రెండు రోజుల తర్వాత జ్వరం తగ్గి, కొంచెం ఫరవాలేదనిపించినపుడు నేను ఆఫీసుకొచ్చాను. నేను వచ్చిన సంగతి బహుశా నీకు తెలిసి ఉండదు. అందరి మీద చిరాకు పడడం, కింది ఉద్యోగస్తులను తిట్టడం, రాసిన కాగితాలు చించేయడం, కలుద్దామని వచ్చిన వాళ్ళకు అపాయింట్‌మెంట్‌ ఇవ్వకుండా తర్వాత కలుద్దామని వెనక్కి పంపేయడం నాకు తెలుస్తూనే ఉంది.
కాంటీన్‌లో కాఫీ తాగి రావడానికి కాబోలు నువ్వు గది బయటికి వచ్చావు. అకస్మాత్తుగా, అనూహ్యంగా నేను అప్పుడే కనిపించాను.
''రావడం లేదేం ఇన్ని రోజులు'' అన్నావు నన్ను చూసి.
''ఆరోగ్యం బావుండక!'' అన్నాను, నీరసంగా నవ్వుతూ.
''ఓహౌ. ఇప్పుడెలా ఉంది మరీ?''
''ఫరవాలేదు. బాగానే ఉంది. థాంక్స్‌''- అంటూ నేను నా గదిలోకి వచ్చాను.
ఈ గది అటు వెళ్ళలేదు. ఆ గది ఇటు రాలేదు. వాటికి నిర్దేశించిన పరిమితులున్నాయి. ఇద్దరి మధ్య ఓ పెద్ద అడ్డుగోడ ఉంది. ఓ గది నీది. ఓ గది నాది.
ఒక్కోసారి నాకు అనిపిస్తుంది. రెండు గదులు పక్కపక్కన ఉండడం కూడా సామాన్యమైన విషయమేమీ కాదు గదా?.. అని !
ఈ మధ్య మరీమరీ అనిపిస్తోంది. మా మధ్య ఉన్నది కేవలం ఒక అడ్డుగోడే కదా?
రచయిత్రి గురించి ...
భారతీయ పాఠకుల హదయాలలో చిరస్థాయిగా నిలచిన పంజాబీ రచయిత్రి దతీప్‌ కౌర్‌ తివానా. నవ్వు చివర విషాదం, ఆనందం అంచున దుర్భర శోకం, విషాద వ్యంగ్య వైభవం.. ఆమె రచనలకు గల లక్షణాలు. పంజాబ్‌ విశ్వవిద్యాలయంలో పంజాబీ ప్రొఫెసర్‌గా పని చేసిన ఈమె, కథ, నవలా రచయిత్రిగా పాఠకులకు అత్యంత ప్రీతిపాత్రులయ్యారు. శైలిపరంగా ఎంతో పరిణతి సాధించిన ఈమె రచనలన్నీ, ముహళల జీవితానికి సంబంధించినవే. స్త్రీ-పురుషుల మధ్య ఆకర్షణ, బాంధవ్యాలు, సంఘర్షణల చుట్టూ తిరిగేవే!! అతి సున్నితమైన అంశాల్ని చాకచక్యంగా, మనో వైజ్ఞానిక పరంగా నిర్వహించడం ఆమె ప్రత్యేకత! కథలో చెపుతున్న విషయాలే కాకుండా, చెప్పని ఎన్నో అంశాలని పాఠకుల కళ్ల ముందుంచడం ఈ రచయిత్రి రచనల్లోని విశిష్టత.

- పంజాబీ మూలం : దతప్‌ కౌర్‌ తివానా
తెలుగు : డాక్టర్‌ దేవరాజు మహారాజు


టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఊరుకోవే...
కరుణించిన కిరణం
పల్లెటూరు టూరు
తాగే నీళ్ళు
రాజు గారి సందేహం
టు.. కొమర్రాజుగుట్ట దొరల బంగ్లా..
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
కార్తీక్‌
నేను తిన నీకు బెట్ట
పోచమ్మ చెరువు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
10:07 PM

హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి

09:55 PM

సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..

09:38 PM

మైలవరంలో కరోనా వాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత

09:13 PM

తెలంగాణ మందు బాబులకి శుభవార్త..

08:59 PM

అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల

08:46 PM

ఏపీలో 56 పాజిటివ్ కేసులు

08:10 PM

తెలంగాణ సీఐ సృజన్‌రెడ్డికి రాష్ట్రపతి అవార్డు

07:47 PM

వాహనం బోల్తా.. 12 మందికి గాయాలు

07:31 PM

టిక్ టాక్ స్టార్ రఫీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్

07:14 PM

రేపు ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో సెమినార్

07:08 PM

మైనర్‌పై బ్యాంక్‌ మేనేజర్‌ లైంగికదాడి

06:49 PM

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు రైతుల పాదయాత్ర

06:09 PM

100, 10, 5 నోట్ల ర‌ద్దు‌పై స్పందించిన‌ ఆర్బీఐ

06:08 PM

రైతుల నుండి బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలి..

05:57 PM

కరోనా టీకాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : కేంద్రం

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.