Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ప్రేమంటే | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

ప్రేమంటే

Sat 21 Nov 23:01:31.51398 2020

'మన అకౌంట్స్‌ ఆఫీసర్‌ సరస్వతికి అంతర్జాతీయ మహిళా అవార్డ్‌ వచ్చిందట'.'రాదూ మరి, ఎప్పుడు చూసినా వాకింగ్‌, జాగింగ్‌, యోగా, సంగీతం,సాహిత్యం అంటూ తన స్వార్ధం గురించే తిరుగు తుంది కాని పిల్లల గురించి ఎప్పుడయినా పట్టించుకుందా ...'
'పిల్లల పుట్టిన రోజుకు నేను మంచి విలువైన గిఫ్ట్‌ ఇస్తే, తనేమో డబ్బులు హాస్పిటల్‌లో టెస్టులకు ఖర్చు చేసి ఏదో ఇంట్లో తనే తయారు చేసిన ఏదో పుస్తకం ఇచ్చిందట. అమ్మో... నాకయితే ముందు నా పిల్లలే ముఖ్యం'
'ఇంట్లో మనమయితే అందరూ తిన్నాక ఏదైనా మిగిలిందా, ఏదైనా ఖరాబవుతుందా చూసుకుని అదే తింటాం కదా! తను అందరికీ వడ్డించి వారితో పాటు కల్సి అన్ని వేసుకుని శుభ్రంగా భోం చేస్తుందట. ఖరాబయిందో పడేస్తుందట గాని తినదట. ఎక్కడా ఆడతనం, అమ్మతనం ఆవగింజంతయినా లేదు'
'వాళ్ళాయన ఆడంగి పనులన్నీ చేస్తూ చేయూతనే ఇస్తాడాయే. అయినా అవార్డ్‌ ఆమెకు ఇవ్వడమేంటి?'
'ఎందుకివ్వరు.... సమాజ సేవ అంటూ పిల్లల్ని దత్తత తీసుకోవడం, మురికి వాడలు శుభ్రపరచడం, అవయవ దానం, మహిళా సంఘాలంటూ తిరగడం... ఎన్ని లేవు... ఇవి చాలదూ తన పిల్లల కన్నా మంది పిల్లల్ని బాగా చూసుకున్న మహిళగా అందరి మన్ననలు పొందడానికి?' ఎగతాళిగా అంది మంజరి.
'నాకయితే.... మనకేం గుర్తింపు లేకున్నా, మన పిల్లల సంతప్తి ముందు ఏ అవార్డ్‌ అయినా దిగదుడుపే ?'
'నిన్ననే అవార్డ్‌ మంత్రి చేతుల మీదుగా తీసుకుందని ఈ వేళ సాయంత్రం మన ఆఫీసులో ఆమెకు సన్మాన కార్యక్రమం. అందులో అందరి ముందు ఆమెను పరిచయం చేసే బాధ్యత నాకే ఇచ్చారుగా అప్పుడు ఆమెను పొగుడుతున్నట్లే చేసి అందరి ముందు అసలు విషయం బయట పెడతాను' మంజరి అంది అక్కసుగా. అది ఆఫీసులోని మహిళల గది. అందులోని వాళ్ళంతా రకరకాలుగా ఆమెకు గ్రీటింగ్స్‌ చెప్పిన వాళ్ళే.
 
సాయంత్రం బ్రాంచ్‌ మేనేజర్‌, పై ఆఫీసు నుండి విచ్చేసిన అధికారి, సరస్వతి కుటుంబ సభ్యులు, పత్రికా విలేఖరుల మధ్య అభినందనసభ ఏర్పాటు చేయబడింది. జ్యోతి ప్రజ్వలన తర్వాత ఎజెండా ప్రకారం వేదిక పైనున్న కుర్చీల్లో ఆసీనులైన పై ఆఫీసు అధికారి, క్లబ్‌ సెక్రెటరీ, బ్రాంచ్‌ మేనేజర్‌ల సందేశం అన్నీ అయ్యాయి. అందరూ ఆమెకు అవార్డ్‌ వచ్చినందులకు అభినందించి, ఆకాశానికి ఎత్తేసారు. ముఖ్య అతిధి అయిన జిల్లా మహిళా కలెక్టర్‌ తదితరులందరూ కల్సి సరస్వతిని ఘనంగా సన్మానించారు. మంజరి లేచింది.
'అందరికీ నమస్కారం. అందరి అభినందనలు అందుకున్న సరస్వతి మా సహా ఉద్యోగిని అయినందుకు మేము గర్వపడుతున్నాం. అయితే తను సమాజ సేవ, వ్యక్తిగత ఆరోగ్యం అంటూ అందరు అమ్మలలా పిల్లల కన్నా, కుటుంబం కన్నా తన స్వార్థానికే ఎక్కువ శ్రద్ధ, సమయం కేటాయిస్తారని ఒక విమర్శ. సభాముఖంగా అయితే అందరూ తన మనసులోని మాట వింటారని మాత్రమే అడుగుతున్నా. ఈ జవాబుతో పాటు తన ప్రతిస్పందన కూడా తెలియజేస్తారని ఆ శిస్తున్నాను..' సెగ రగిల్చి మంజరి కూచుంది. గుసగుసల మధ్య సరస్వతి లేచింది.
'సభా సరస్వతికి మనసా శిరసా ప్రణామాలు. ఈ అవార్డ్‌ ఇచ్చి నా బాధ్యత మరింత పెంచిన ప్రభుత్వానికి, నన్నాదరించిన మీ అందరికీ నా శిరసాభి వందనాలు. నా ప్రియ నేస్తం చెప్పినట్లు సమాజ సేవకే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తాను. 'కారం లేని కూర, ఆకారం లేని ఇల్లు, ప్రాకారం లేని కోట, ఓంకారం లేని మంత్రం, చిత్తశుద్ధి లేని పూజ, పరోపకారం లేని జీవితం నిరర్ధకం అంటారు. అందుకే అన్నింటికన్నా సమాజ సేవకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాను. ఇక వ్యక్తిగత స్వార్థం ఎక్కువ అన్నారు. అదీ నిజమే. కారణం నాకు నా పిల్లలపై, కుటుంబంపై ఉన్న అవ్యాజమైన అనురాగం. నా ప్రియ నేస్తం 'జయ' అహర్నిశలు పిల్లల గురించి ఆరాటపడుతూ తన ఆరోగ్యం నిర్లక్ష్యం చేసింది. ఎంతగా అంటే, అన్ని పరీక్షలు చేయించుకోవడానికి ఒక రెండు వేలు పెట్టి హాస్పిటల్‌కి వెళ్ళమన్నా ఆ డబ్బులతో పిల్లలకు ఒక డ్రెస్‌ వస్తుంది. నా గురించి నేను అంత డబ్బు పెట్టుకోవడం అవసరమా అనేది. కాని దురదష్టం ఒకసారి అనారోగ్యానికి గురయిన ఆమెను బలవంతాన హాస్పిటల్‌కి, నేను తీసుకెళితే డాక్టర్‌ ఆమెకు కాన్సర్‌ అని, ఆలస్యం అయినందున నయం కాలేనంతగా ముదిరిందని చెప్పారు. ప్రతీ ఏడుగురు మహిళల్లో ఒకరికి క్యాన్సర్‌ ఉంది అంటే ఎంత భయంకరంగా వ్యాపించిందో ఆలోచించండి. రెండు నెలలలో తను చనిపోయింది. ఆమె పిల్లలు చాలా చిన్న వాళ్ళు. వారికి ఆమె అండ చాలా అవసరం. నిజంగా పిల్లలపైన ప్రేమ ఉండడం అంటే ఏమిటి? బతికుంటే వారికి ఎన్నో కొత్త డ్రెస్సులు, బహుమతులు ఎన్నో కొనివ్వోచ్చు. ప్రేమ పంచివ్వవచ్చు. కన్నవాళ్ళు ఆరోగ్యంగా కడవరకు ఎవరితో సేవ చేయించు కోకుండా, వారికి తమ అనుభవంతో సహాయం చేయడమే, వారికి మనమిచ్చే, వెలలేని నిజమైన బహుమతి అని నాకు అర్థమయ్యింది. అలా సమాజం లో నాకు అనేక వేల 'జయ'లు కనిపించారు. ఆరోగ్యమైన ఆహారపుటలవాట్లతో, వ్యాయామంతో అనారోగ్యాన్ని తరిమివేయవచ్చు. తల్లి లేని వారికే తల్లి లోటు బాగా తెలుస్తుంది. కారణం నేనూ అలా తల్లి లేని బిడ్డనే. అందుకే ఇంకే బిడ్డ, తల్లిని ఇలా అనారోగ్యంతో కోల్పోవద్దు అనిపించి ఆ దిశగా నేను నడుస్తూ, అందర్నీ చైతన్యవంతం చేస్తున్నాను. ఇందులో నా భర్త, పిల్లల సహకారం ఇతోధికంగా ఉంది. ఇంకెవరేమనుకున్నా నాకే బాధ లేదు. సభాముఖంగా నా వినతి ఏమిటంటే దయచేసి మీ పిల్లలపై ప్రేమే ఉంటే, తల్లితండ్రులూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అర్థం లేని త్యాగం పేరుతో తొందరగా వారికి దూరం కాకండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలతో ....' రెండు చేతులు జోడించిన ఆమెపై చప్పట్ల దుప్పట్లు అనంతంగా ఆగకుండా కురిసాయి.

- నామని సుజనాదేవి,
7799305575

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఊరుకోవే...
కరుణించిన కిరణం
పల్లెటూరు టూరు
తాగే నీళ్ళు
రాజు గారి సందేహం
టు.. కొమర్రాజుగుట్ట దొరల బంగ్లా..
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం
కార్తీక్‌
నేను తిన నీకు బెట్ట
పోచమ్మ చెరువు

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
10:07 PM

హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి

09:55 PM

సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..

09:38 PM

మైలవరంలో కరోనా వాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత

09:13 PM

తెలంగాణ మందు బాబులకి శుభవార్త..

08:59 PM

అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల

08:46 PM

ఏపీలో 56 పాజిటివ్ కేసులు

08:10 PM

తెలంగాణ సీఐ సృజన్‌రెడ్డికి రాష్ట్రపతి అవార్డు

07:47 PM

వాహనం బోల్తా.. 12 మందికి గాయాలు

07:31 PM

టిక్ టాక్ స్టార్ రఫీ ఆత్మహత్య కేసులో ట్విస్ట్

07:14 PM

రేపు ఎస్ఎఫ్ఐ ఆద్వర్యంలో సెమినార్

07:08 PM

మైనర్‌పై బ్యాంక్‌ మేనేజర్‌ లైంగికదాడి

06:49 PM

ఫిబ్రవరి 1న పార్లమెంట్‌కు రైతుల పాదయాత్ర

06:09 PM

100, 10, 5 నోట్ల ర‌ద్దు‌పై స్పందించిన‌ ఆర్బీఐ

06:08 PM

రైతుల నుండి బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలి..

05:57 PM

కరోనా టీకాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : కేంద్రం

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.