Sat 21 Nov 23:15:26.048734 2020
Authorization
పాఠశాల ఆవరణ అంతా చాలా సందడిగా ఉంది. విద్యార్థిని విద్యార్థులు చక్కగా ముస్తాబై వారి అమ్మలతో కలసి పాఠశాలకు చేరుకుంటున్నారు.
మాతదినోత్సవం సందర్బంగా ఈరోజు పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థుల అమ్మలందరిని ఆహ్వానించారు.
అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న రఘు, వాళ్ళ అమ్మతో కలసి పాఠశాలకు చేరుకున్నాడు.
పాఠశాలలో ఏవైనా సమావేశాలు జరిగితే రఘుకు పట్టరాని సంతోషం, ఎందుకంటే రఘుకు అల్లరి చేయటమంటే బలే సరదా !
క్లాస్‌రూముల్లో పరుగులు తీస్తూ పడుతూ లేస్తూ, విసుగు, విరామం లేకుండా ఎంత అల్లరైనా చేయొచ్చు. ఇలాంటప్పుడు తనని ఎవరూ పట్టించుకోరు అని రఘు ఆలోచన. ఈ రోజు కూడా రఘు తన ఫ్రెండ్స్‌తో కలసి పాఠశాల ఆవరణలో పరుగులు తీస్తున్నాడు. ఇంతలో సభ ప్రారంభమవుతుందని ప్రకటన విని రఘు నెమ్మదిగా అమ్మ వద్దకు చేరాడు. వేదికపై అతిధులందరు ఆసీనులైనారు. ముందుగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ సమావేశానికి హాజరైన అమ్మలందరికి మాతదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.
అనంతరం అతిధులు మాట్లాడుతూ నేడు సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల గురించి వాటిని ఎలా అధిగమించాలో చెప్పారు. ముఖ్యంగా పిల్లల భవిష్యత్ ను తీర్చిదిద్దాల్చిన బాధ్యత తల్లులదేనని, పిల్లలకు ప్రేమను పంచుతూ వారి విద్యాభివద్ధికి కషి చేయాలని అమ్మ గొప్పతనాన్ని కొనియాడుతూ, ముఖ్య అతిధిగా హాజరైన మండల విద్యాశాఖాధికారిణి గారు తల్లులను ఉద్దేశించి ప్రసంగించారు.
అనంతరం వివిధ అంశాలలో ప్రధములుగా నిలిచిన విద్యార్థుల పేర్లను ప్రకటించారు, అందులో తన పేరు కూడా ఉండటంతో రఘు ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. నా పేరు పొరపాటున పిలిచారా? రఘుకు ఏమి అర్థం కావటం లేదు.
పిల్లలను ఒక్కొక్కరిగా వేదిక పైకి పిలిచి ముందుగా వారి అమ్మలకు సన్మానం చేస్తున్నారు. సభ చప్పట్లతో మారుమ్రోగుతూంది.
ఇంతలో రఘు వంతు రానేవచ్చింది. అందరి చప్పట్ల మధ్య అమ్మతో పాటు వేదిక పైకి వెళ్ళాడు రఘు. అమ్మను శాలువాతో సన్మానించారు. తర్వాత ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ, ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేక బహుమతులు ఇస్తున్నాము. అందులో మొదటి బహుమతి రఘు సాధించాడు. అనగానే సభలో మరల చప్పట్లు.
నేను ఎందులో పాల్గొనలేదు గదా! రఘు మనసులోఒకటే ఆలోచన.
ఈ బహుమతి రఘుకు ఇచ్చే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. రఘు చాలా తెలివైన, చురుకయిన విద్యార్థి. తనకున్న తెలివి తేటలకు అల్లరి పై కాకుండా చదువు మీద గాని ఏ ఇతర రంగాలపై దష్టి పెట్టినట్లయితే రఘు తప్పకుండ రాణిస్తాడు. కానీ అల్లరి మీద తప్ప ఏ ఇతర కార్యక్రమాలపై శ్రద్ద చూపటం లేదు. రఘు ఇక నుండి అయినా బాగా చదవాలని మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకోవాలని, తనలో మార్పును కోరుతూ ఈ ''అల్లరి'' బహుమతి అందజేస్తున్నాము. రఘు సిగ్గు పడుతూనే బహుమతి అందుకున్నాడు.
కార్యక్రమం ముగిసింది.
మౌనంగా అమ్మతో కలసి ఇంటికి చేరుకున్నారు. నఎ మేడమ్ చెప్పిన మాటలు రఘు మనసులో పదే పదే గుర్తుకు వస్తున్నాయి. మొదటి నుండి అమ్మ చెప్పిన మాటలు విని వుండాల్చింది, ఇక నుండి అయినా అమ్మ మాట వినాలి. బాగా చదివి అమ్మ, నాన్నలకు మంచి పేరు తేవాలి. పియానో వాయించటం అంటే నాకు చాలా ఇష్టం. రేపటినుండి ఆ క్లాస్ కు వెళ్ళాలి. నాకు ఇష్టమైన రంగంలో అందరిని మెప్పించాలి అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాడు రఘు.
కొద్ది రోజుల్లోనే రఘులో చాలా మార్పు వచ్చింది. అల్లరి తగ్గింది. చక్కగా స్కూలుకు వెళ్తున్నాడు. రోజు సాయింత్రం పియానో క్లాసులకు వెళ్తున్నాడు. త్వరలో జరుగబోయే రాష్ట్ర స్థాయి బాలోత్సవ్ కార్యక్రమంలో పాఠశాల తరుపున పియానో వాయిద్య పోటీలకు ఎన్నికయినాడు.
రఘు పియానో చక్కగా వాయించిరాష్ట్ర స్థాయి బాలోత్సవ్ పోటీల్లో చక్కని ప్రతిభ కనపర్చి అందరి మన్ననలు అందుకొని పాఠశాలకు మంచి పేరు తెచ్చాడు. రఘు లో వచ్చిన మార్పుకు పాఠశాల నఎ మేడమ్, ఉపాధ్యాయ బందం, మరియు అమ్మ నాన్నలు ఎంతో సంతోషించారు.
నీతి : పిల్లలన్నాక అల్లరి చేయటం సహజం. పెద్దలు వారి తప్పులను సున్నితంగా తెలియజేసి, మంచి మాటలు చెపితే పిల్లల్లో తప్పని సరిగా మార్పు వస్తుంది.
- తిరుపతి కృష్ణవేణి