వేటగాడు!విల్లు ఎక్కు పెట్టాడు క్రౌంచ పక్షి!నేలకూలింది రాజ్యలక్ష్మి! కీర్తి శేషురాలు దేవీప్రియ!విగతజీవి!
అతడొక మహాకవి! పల్లెటూరు పెంచింది! పట్టణం పోషించింది!
అతడు ఒంటరి కాడు! కవితా దారిలో బాటసారి! గాలికి రమ్యమైన రంగులద్దగలడు!
ఇం...కొకప్పుడు పాటల పరికిణీలకు కుచ్చిళ్ళు కుట్టగలడు!
అతడు ఒక వాహిక! పూర్వకవులకు... ఉత్తర కలాలకు! రన్నింగ్ కామెంటరీలు చెప్పగలడు!
కవి కవ్వమవ్వాలంటాడు! మజ్జిగచిలికి వెన్నవెలికి తీయాలంటాడు! పారిపోయే దుప్పిని పట్టుకోవాలంటాడు! పైకి లంఘించే చిరుతను బాణంతో కొట్టి పడేయాలంటాడు!
అతడు... సమాజ సమస్యల సంఘటిత ధిక్కార స్వర పేటిక! విస్మ్రతవర్గాలజి విలువైన గొంతుక!! (ప్రముఖ కవి దేవీప్రియ గారు సాహితీ ప్రస్థానం చాలించిన విషాద సందర్భంగా, స్మతిలో నివాళులర్పిస్తూ...)