Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఎన్ని క్రిస్ట్‌మస్‌ లో..! | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

ఎన్ని క్రిస్ట్‌మస్‌ లో..!

Sun 20 Dec 00:19:27.127761 2020

క్రిస్టమస్‌... క్రైస్తవులకు ఆరాధ్యుడైన యేసుక్రీస్తు జన్మదినంగా పరిగణించబడుతున్న రోజు. పేరుకు క్రైస్తవుల పర్వదినమే అయినా ప్రపంచవ్యాప్తంగా సర్వ మానవాళీ ఉత్సాహంగా పాటించే రోజు. మతాలకతీతంగా అందరూ ఆనందంగా పాల్గొనే పండగగా క్రిస్టమస్‌ పేరొందింది. పరస్పరం అభినందించుకోవడం, బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం, క్రైస్తవుల ఇళ్లను సందర్శించి మరీ శుభాకాంక్షలు తెలుపుకోవడం... ఒక సోదరభావం వెల్లివిరిసే పండగ క్రిస్టమస్‌. పైగా శీతాకాలంలో రావడం వల్ల మంచి అనుకూల వాతావరణం కూడా మంచి అనుభూతులకు ఆలవాలంగా ఉంటుంది. భౌగోళిక ప్రాంతాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు అన్వయించుకుంటూ కూడా ప్రపంచ వ్యాప్తంగా ఒకే రకంగా జరుపుకునే పండగ ఇది. ఈ క్రిస్టమస్‌ సాంప్రదాయాల వైవిధ్యాల కలబోతే ఈ వారం కవర్‌స్టోరీ..

ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్‌ 25ను క్రీస్తు జన్మదినంగా క్రిస్టమస్‌ పేరుతో వేడుక జరుపుకోవడం మనకి తెలుసు. క్రీస్తు జననానికి సంబంధించిన ఘట్టాలను ఆవిష్కరిస్తూ బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం, కథలు వినడం పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఓ మెర్రీ టైమే. మతపరమైన విశిష్టత కాసేపు పక్కన పెడితే క్రిస్టమస్‌ అంటే ఇవ్వడం, కుటుంబ, బంధు, మిత్రుల కలయిక, అందమైన అలంకరణలు, ఆహ్లాదమైన సంగీతం, ఆనందమైన ఆహారం. ఈ క్రమంలో ఇంటి ముందు కాంతులీనే నక్షత్రం, ఇంటి లోపల అలంకరించిన క్రిస్టమస్‌ చెట్టు, ఘుమఘుమలాడే క్రిస్టమస్‌ కేక్‌ మామూలే. ఈ మధ్యలో 'శాంటా క్లాస్‌' అనే ఒక క్రిస్టమస్‌ తాత. దుప్పులు పూనిన మంచు రథం ఎక్కి ఆకాశ మార్గాన ప్రయాణిస్తూ, ఇళ్ళ పొగ గొట్టాల గుండా లోపలి జారి, అక్కడి క్రిస్టమస్‌ చెట్టుకి వేలాడదీసిన సాక్స్‌ (మేజోళ్ళ)లో కోరుకున్న బహుమతులు పెట్టి వెళ్లి పోతాడని ఒకప్పటి నమ్మకం. ఎరుపు దుస్తులు వేసుకుని తెల్లగడ్డం పెట్టుకున్న శాంటా క్లాస్లు ఇప్పుడు షాపింగ్‌ మాల్స్‌ దగ్గర కూర్చుని పిల్లలకు చాక్లెట్లు అవీ ఇస్తూ సంతోష పరుస్తుంటారు. ఇప్పుడిప్పుడే మన దేశంలోనూ చాలా చోట్ల దర్శనం ఇస్తున్నారు.
ఈ పండగలో భాగంగా ఒక రెండు వారాల ముందు నుండే బృందాలుగా ఇంటింటికీ వెళ్లి పాటలు (కేరల్స్‌) పాడటం కూడా ఒక సందడే. విశేషమేమంటే, ఈ పండగకు 'మా ఇంటికి రండీ' అని పిలవక్కరలేదు. క్రైస్తవులు తమ మిత్రుల ఇళ్ళకు వెళ్లి, కేక్‌ ఇచ్చి, వారు ఇచ్చిన కేక్‌ తిని, బహుమతులు ఇచ్చి పుచ్చుకుని, శభాకాంక్షలు తెలిపి రావడం ఒక అందమైన మైత్రీ బంధ వ్యక్తీకరణ. అందరినీ ప్రేమించడం, అందరితోనూ ఆనందంగా ఉండటం వేడుకల్లో కనిపిస్తుంది. అమెరికాలో అయితే నవంబర్‌ మూడవ గురువారం ప్రాంతంలో వచ్చే కతజ్ఞతా దినం (థ్యాంక్స్‌ గివింగ్‌ డే) తరువాత మొదలయ్యే క్రిస్టమస్‌ వేడుకలు అట్టహాసంగా కొత్త సంవత్సరం వరకూ కొనసాగుతాయి.
సుద్దులు నేర్పి...
ఫ్రాన్స్‌లో క్రిస్టమస్‌ వేడుకలు సెయింట్‌ నికోలస్‌ దినంగా భావించే డిసెంబర్‌ 6 నుంచి ప్రారంభమౌతాయి. మొత్తం నగరాలన్నీ శోభాయమానంగా దీపాలతో అలంకరిస్తారు. పిల్లలకు స్వీట్లు, బహుమతులు అందిస్తారు. పిల్లలు తమ బూట్లను పాలిష్‌ చేసి మరీ తమ ఇంట్లోని చిమ్నీల దగ్గర ఉంచుతారు. ఇలాగైనా శుచీ శుభ్రత పిల్లలకు ముందు నుంచే అలవడతాయనేమో. పిల్లల సరదా మాత్రం వేరు. క్రిస్టమస్‌ తాత వాటి నిండా స్వీట్లు నింపుతాడని వారి నమ్మకం. క్రిస్టమస్‌ రోజు కుటుంబాలన్నీ ఒకచోట చేరి విందు చేసుకుంటాయి, బహుమతులు ఇచ్చి పుచ్చుకుంటాయి.
తప్పుకు బొగ్గు ముక్క
ఇటలీలో శాంటా క్లాస్‌ బదులు 'లా బెఫానా' అనే మంచి మంత్రగత్తె పిల్లలకి బహుమతులు పంచి పెడుతుందని నమ్మకం. ఆమె పొడవాటి చీపురు కర్రపై వస్తుందని చెడ్డ పనులు చేసిన పిల్లలకు బొగ్గు మాత్రమే ఇస్తుందని నమ్మకం. చిన్నారుల్ని గాడిలో పెట్టేందుకు ఇదో మంచి సందర్భం కావడం మంచిదే కదా. మరో మాట.. ఈ సంబరమంతా ఇటలీలో జనవరి 6వ తేదీన జరుగుతుంది.
ఇచ్చిపుచ్చుకుంటేనే బావుంటుంది
నెదర్లాం (శాంటాక్లాస్‌ని సిమ్లర్‌క్లాస్‌ అంటారు. ఆతను వారికి ఎక్కడో ఉత్తరధవంపై కాక స్పెయిన్లో నివసిస్తాడని, అక్కడి నుంచి మర పడవలో, బ్లాక్‌ పీటర్‌ అనే సహాయకుడిని తీసుకుని వస్తాడని ప్రజలు భావిస్తారు. వారి సంస్కతిలోని కొన్ని లోపాలు, చారిత్రకంగా అందివచ్చిన భావజాలాల వల్ల బ్లాక్‌ పీటర్‌ బానిసపాత్ర వచ్చినా ప్రస్తుతం మాత్రం క్రిస్టమస్‌ వేడుకల్లో అంతా సంతోషమే కనిపిస్తోంది. తమకు గిఫ్ట్‌లిచ్చే పాత్రల పుట్టుపూర్వోత్తరాల కన్నా కూడా ఇచ్చిపుచ్చుకోవడంలోని ఆనందాన్నే ఎక్కువ వెతుక్కుంటున్నారు.
ప్రత్యేక పానీయంతో...
జర్మనీలో కూడా క్రిస్టమస్‌ వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. ఎక్కడ బడితే అక్కడ ప్రత్యేకంగా దుకాణాలు తెరుస్తారు. వాటిలో క్రిస్టమస్‌కి సంబంధించిన వస్తువులు అమ్ముతారు. ఈ సీజన్లో ప్రత్యేకంగా గ్లూవైన్‌ అనే పానీయం అందుబాటులోకి తెస్తారు. దట్టంగా మంచు పట్టి వున్న సమయంలో ఈ పానీయం తాగి సంబరం చేసుకుంటారు. ఈ పానీయం కేవలం క్రిస్టమస్‌ రోజుల్లో మాత్రమే తయారు చేస్తారు.
రోజు కాదు నెలంతా...
లండన్లో క్రిస్టమస్క ఒక నెల రోజుల ముందే వేడుకలు మొదలవుతాయి, జనవరి మొదటి తారీఖు వరకూ కొనసాగుతాయి. ఆ రోజులలో నగరమంతా విద్యుద్దీపాలతో వెలిగిపోతుంది. త్వరగా చీకటి పడటంతో వేడుకలు తెల్లవారు ఝాము వరకూ జరుగుతాయి. దాదాపు ప్రతి కూడలిలోనూ క్రిస్టమస్‌ చెట్లు ఆకర్షణీయంగా అలంకరించబడి అలరారుతుంటాయి.
మన దేశంలో ఎన్నో...!
భారత దేశంలోను తాహతు మేరకు క్రిస్టమస్‌ వేడుకలు జరుపుకుంటారు. ఈశాన్య రాష్ట్రాలలో క్రైస్తవులు అధికం. అందుకే అక్కడ ఈ పండగ హడా వుడి ఎక్కువ. చర్చిలకు, ఇళ్లకు కొత్తగా రంగులు వేసి, దీపాలతో అలంకరించడం ఇక్కడి అలవాటు. చర్చిలలో పండగకు కొద్ది రోజుల ముందు నుండే 'ఆడ్వెంట్‌ సీజన్‌' పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్రిస్టమస్‌కి సరిగ్గా ఒక నెల ముందు 'సపోస్డ్‌ క్రిస్టమస్‌' లేదా 'సెమీ క్రీస్టమస్‌' పేరుతో ముందస్తు వేడుకలు జరుపుతారు. క్రీస్తు జననం ఇతివత్తంగా నాటికలు, పాటలతో కోలాహలం ఉంటుంది. ఆ తరువాత చర్చి సభ్యులు బృందాలుగా విడిపోయి ఒక్కో ప్రాంతంలోని కుటుంబాల ఇళ్ళకు వెళ్లి క్రిస్టమస్‌ పాటలు (కారల్స్‌) పాడతారు.
కొన్ని చర్చిలలో క్రిస్టమస్‌ ఈవ్‌ (క్రిస్టమస్‌ ముందు రోజు సాయంత్రం) ప్రత్యేక వేడుకలు వుంటాయి. కొన్ని చోట్ల రాత్రి ప్రార్ధనలు వుంటాయి. యధావిధిగా క్రిస్టమస్‌ రోజు ప్రార్థనలూ వుంటాయి. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోవడం సందడిగా వుంటుంది. క్రైస్తవేతరులు తమ క్రైస్తవ స్నేహితుల ఇళ్ళకు వెళ్లి మరీ వారిని అభినందించడం విశేషం.
ఇతర పండగల లాగే కొత్త బట్టలు వగైరా మామూలే. చాలా మంది ఇళ్ళకు స్టార్‌ లైట్లను అలంకరిస్తారు. ఇంటి లోపల క్రిస్టమస్‌ చెట్టు కూడా అలంకరిస్తారు. ఇప్పుడు చాలా వరకూ కత్రిమ క్రిస్టమస్‌ చెట్లను అలంకరించుకుంటారు. గానీ, కొన్ని ప్రదేశాలలో స్థానికంగా లభించే అరటి, మామిడి చెట్లను అలంకరిస్తారు. కొందరు మామిడి ఆకుల తోరణాలు కూడా కడతారు. కొందరు విద్యుత్‌ దీపాలు పెడితే కొంతమంది దీపావళిలాగా ప్రమిదలతో అలంకరించుకుంటారు. సాధారణంగా క్రిస్టమస్‌ చెట్టు, ఇంటి ముందు క్రిస్టమస్‌ నక్షత్రం వంటి అలంకరణలు మరో వారం వరకూ, అంటే కొత్త సంవత్సరం ఆరంభం వరకూ ఉంచుతారు.
దేవాలయాలకి వెళ్ళడం, కొత్త దుస్తులు ధరించడం చుట్టపక్కాలు వచ్చి శుభాకాంక్షలు తెలపడం, కేక్‌, ఇతర పిండి వంటలు ఇరుగు పొరుగు వారికి పంచడం వంటి సంబరాలతో క్రిస్టమస్‌ రోజు కోలాహలంగా వుంటుంది. పండగ రోజుకి నెల ముందు నుండే కొన్ని బందాలు ఇంటింటికీ రాత్రి వేళల్లో వెళ్లి క్రిస్టమస్‌ గీతాలను పాడటం (కారల్స్‌), ఆ ఇంటి వారు వాళ్లని సాదరంగా ఆహ్వానించి ఆదరించడం ఒక వేడుక. ఇక అన్ని పండగల లాగే, క్రిస్టమస్‌ పండగ రోజు రాత్రి స్నేహితులతో, చుట్టాలతో విందు భోజనం సాధారణంగా జరిగేదే. మొత్తానికి ఒక నెల పాటు క్రైస్తవులకూ, క్రైస్తవేతరులకూ కూడా క్రిస్టమస్‌ సందడి వుంటుంది.
క్రిస్టమస్‌ చెట్టు
క్రీస్తు జన్మించక ముందు నుండే పచ్చని మొక్కలు ప్రజల జీవనంలో భాగంగా ఉండేవి. క్రిస్మస్‌ సమయంలో క్రిస్టమస్‌ చెట్టుని అందంగా అలంకరించి ఉంచడం ఆనవాయితీగా వస్తోంది. ఇప్పుడైతే అనేక రకాల కత్రిమ క్రిస్టమస్‌ చెట్లు అందుబాటులో వున్నాయి గానీ, తొలుత, నిత్యం పచ్చగా వుండే పైన్‌ చెట్లను మాత్రమే అలంకరించే వాళ్ళు. యూరప్‌, ప్రాచీన ఐగుపులు, చైనీయులు, హెబ్రీయులు పచ్చని చెట్లను అలంకరించి, వాటిని పూజించే వాళ్ళు. దుష్ట శక్తులను నిరోధించే శక్తి పచ్చని చెట్లకు వుందని వాళ్ళు విశ్వసించే వాళ్ళు. వాళ్ళు క్రైస్తవులుగా మారిన తరువాత కూడా క్రిస్టమస్‌ పండగ సంబరాలలో అదే అలవాటుని కొనసాగించారు.
అసలు క్రిస్టమస్‌ చెట్టు ఇంట్లో పెట్టుకోవడం అనేది జర్మన్ల నుండి పుట్టింది. మధ్యయుగంలో జర్మన్లు డిసెంబర్‌ ఇరవై నాలుగవ తేదీన ఈడెన్‌ తోటలో ఆడం, ఈవ్‌కి గుర్తుగా ఫర్‌ చెట్టుకి ఆపిల్‌ పండ్లని కట్టేవారు. ఆ చెట్టుని వాళ్ళు పారడైస్‌ చెట్టుగా పిలుచుకునే వాళ్ళు. ఆ తరువాత క్రమేపీ క్రిస్టమస్‌ చెట్టు ఆచారం బ్రిటన్‌లోకి పాకింది. అక్కడ ఆ చెట్టుకి రకరకాల కొవ్వొత్తులు, మిఠాయిలు, ఇతర వస్తువులతో అలంకరించడం ఆరంభమయ్యింది.
అయితే అందరూ పచ్చని చెట్లనే క్రిస్టమస్‌ చెట్లుగా వాడరు. జార్జియాలో చిచిలాకీ అనే చెట్టుని రూపొందిస్తారు. చెట్ల కొమ్మలను చెక్కి, ఆ వచ్చిన చెక్క పొట్టుతో ఒక ఫర్‌ చెట్టులాగా తయారు చేస్తారు. విశేషం ఏమిటంటే, జార్జియన్లు క్రిస్టమస్‌ను జనవరి ఏడున జరుపుకుంటారు!
క్రిస్టమస్‌ చెట్టు ఆచారం కెనడాలో 1781లో ప్రవేశించింది. ఆ తరువాతి శతాబ్దంలో ఆ ఆచారం అమెరికాలోకి అడుగుపెట్టింది.
సాధారణంగా ఇళ్ళలో అలంకరించుకునే క్రిస్మస్‌ చెట్లు ఇరవయ్యో శతాబ్దంతో పాటు ఇళ్ళ బయటకు ప్రవేశించాయి. అమెరికాలో అనేక బహిరంగ ప్రదేశాలలో, కూడళ్ళలో భారీ క్రిస్మస్‌ చెట్లను అమర్చడం మొదలు పెట్టారు. 1923 నుండి అమెరికా శ్వేత భవనం దక్షిణ పచ్చికలో వారి జాతీయ క్రిస్మస్‌ చెట్టు అమర్చడం ఆరంభమయ్యింది. ప్రతి ఏడాది, ఆ చెట్టుకున్న దీపాలను వెలిగించడం ద్వారా అమెరికాలో క్రిస్టమస్‌ వేడుకలు ఆరంభమౌతాయి.
ఒకప్పుడు క్రిస్మస్‌ చెట్లు పూర్తిగా అడవుల నుండే సేకరించే వారు. ఇప్పుడు క్రిస్మస్‌ కోసం ఏకంగా లక్షల ఎకరాలలో ఫర్‌, పైన్‌ చెట్లను అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా, యుకేలలో సాగుచేస్తున్నారు. ప్రతి ఏడూ అమెరికాలో 330 నుండి 360 లక్షల క్రిస్మస్‌ చెట్లు ఉత్పత్తి అవుతున్నాయి. యూరప్‌లో అంతకు రెట్టింపు ఉత్పత్తి జరుగుతోంది. దాదపు పాతిక రకాల ఫర్‌, పైన్‌ చెట్ల జాతులను డిసెంబర్‌ కొరకు సాగుచేస్తారు. విత్తనం నుండి సుమారు ఏడు అడుగుల ఎత్తు పెరగడానికి ఒక్కో చెట్టు ఎనిమిది నుండి పుష్కరం (పన్నెండు ఏళ్ళ) సమయం తీసుకుంటుంది!
కత్రిమ క్రిస్మస్‌ చెట్లు ఇప్పుడైతే ఎక్కువగా చైనా నుండి దిగుమతి అవుతున్నా, ముందుగా రూపొందింది మాత్రం క్రిస్మస్‌ చెట్టు ఆచారం మొదలైన జర్మనీలోనే. అడవుల నరికివేతకు అడ్డు చెప్పే క్రమంలో, పందొమ్మిదో శతాబ్దంలో, జర్మనీలో ఈకలకి పచ్చ రంగు వేసి చెట్లలా చేసేవాళ్ళు. ప్రస్తుతం PVC తో, ఇంకా ఇతర పదార్థాలతో తయారు చేస్తున్నారు. తొలి క్రిస్మస్‌ చెట్టు అమ్మకాలు అమెరికాలో 1850 ప్రారంభమయ్యాయి. అమెరికాలో రాక్‌ ఫెల్లర్‌ సెంటర్‌లో క్రిస్మస్‌ చెట్టు పెట్టడం 1988 నుండి ఆనవాయితీగా వస్తోంది.
ఏ పండగైనా ఎవరి పండగైనా పాటలు తప్పనిసరి. క్రిస్మస్‌ అందుకు భిన్నం కాదు. ఆ సమయంలో పాటలు పాడుకోవడం క్రీస్తు పుట్టుక మునుపే ప్రారంభమయ్యింది. కొన్ని వేల ఏళ్ళ క్రితమే యూరప్లో శీతాకాలంలో డిసెంబర్‌ 22 ప్రాంతంలో రైతులందరూ గుండ్రంగా తిరుగుతూ పాడుకునేవారు. కారల్‌ అంటేనే నాట్యం చేస్తూ పాడుకునేది అని అర్థం.
క్రిస్టమస్‌ కారల్స్‌
క్రీస్తు శకం 129లో మొట్ట మొదటి కారల్‌, 'ఏంజెల్‌ హిమ్‌'ని ఒక రోమన్‌ బిషప్‌ క్రిస్మస్‌ రోజున పాడాలని ఆదేశించాడు. 'హార్క్‌! ది హేరా ఎంజెల్స్‌ సింగ్‌' అనే పాట 1739 కంటే ముందు రాసిందని అంటారు. బాగా ప్రాచుర్యం పొందిన 'సైలెంట్‌ నైట్‌ పాటని జోసెఫ్‌ మోర్‌ అనే జర్మన్‌ రాసాడు, జేవియర్‌ గరూబర్గ్‌ సంగీతం కూర్చాడు. దాన్ని డిసెంబర్‌ 24, 1818న ఆస్ట్రియాలో మొదటిసారి ఆలపిం చారు. ఇప్పటికి ఆ పాట 44 భాషలలో తర్జుమా చేయబడింది. ప్రస్తుతం పాడుతున్న కారలు చాలా వరకూ 1843-1883 మధ్య ప్రాంతంలో రాసినవి.
శాంటా క్లాస్‌
క్రిస్మస్‌ ముడిపడి వున్న మరో అంశం శాంటాక్లాస్‌. ఎరుపు, తెలుపు దుస్తులతో, పొడవాటి తెల్లని గడ్డం, తలపై యెర్ర టోపీ, భుజాన పెద్ద సంచి, అందులో అనేక బహుమతులు... ఈ ఆహార్యంతో ఉండే శాంటా క్లాస్‌లా ఇప్పుడు మన దేశంలో కూడా క్రిస్మస్‌ సమయంలో చాలామంది కనిపిస్తుంటారు. క్రిస్మస్‌ తాతగా ప్రసిద్ది చెందిన శాంటాక్లాస్‌ రూపురేఖలు, హావ భావాలు కైమెంట్‌ మూర్‌ అనే కవి 1823లో రాసిన పద్యం 'ఎ విజిట్‌ ఫ్రం శాంటా క్లాస్‌'లో వివరించాడు. ''లావుగా, బొద్దుగా, ఆనందంగా వుండీ'', ఎగిరే అడవి దుప్పులు లాగే వాహనం పై తిరుగుతూ, ఇళ్ళ పొగ గొట్టాల గుండా దిగి, పిల్లలు వేలాడ దీసిన మేజోళ్ళలో బహుమతులు పెట్టి వెళ్ళిపోతాడు.
క్రిస్టమస్‌ పేరు ముందు నుండి ఉందా?
క్రిస్టమస్‌ అనే మాట క్రీస్తు-మాస్‌ అనే ఒక ఆచారం నుండి వచ్చింది. యేసు తమ కొరకు మరణించి, పునరుద్దానుడయ్యాడని క్రైస్తవులు విశ్వసిస్తారు. అందుకు గుర్తుగా అందరూ కలిసి ద్రాక్షా రసం, రొట్టె తీసుకుంటారు. ఆ కార్యక్రమాన్ని సమభోక్తం (కమ్మ్యూనియన్‌) అనే పేరుతో నిర్వహిస్తారు. సమభోక్తం సూర్యాస్తమయం తరువాత, సూర్యోదయం ముందు తీసుకోవచ్చు. అందువల్ల దానిని అర్ధరాత్రి తీసుకునే వాళ్ళు. క్రైస్తుమాస్‌ క్రమంగా క్రిస్టమస్‌గా మారింది.
క్రిస్టమస్‌ అనాలా, ఎమస్‌ అనాలా?
1100వ సంవత్సర ప్రాంతంలో క్రిస్టియానిటీ అనే పదాన్ని క్సియానిటీ అని పలికేవారు. ఆ పదం ఆంగ్ల అక్షరం ఎక్స్‌ మొదలౌతుంది. గ్రీక్‌ భాషలో ఎక్స్‌ అనే అక్షరాన్ని కై అని పలుకుతారు. దాంతో గ్రీకు భాషలో క్రైస్తు పదంలో మొదటి అక్షరం ఎక్స్‌ ఉండేది. 1551లో క్రిస్టమస్‌ని ఎక్స్‌ టేమాస్‌ అనే వారు. క్రమేపీ అదే ఎక్సగా రూపాంతరం చెందింది.
విస్తరించిదిలా...
ఇప్పుడు ప్రతి చోటా కత్రిమ క్రిస్టమస్‌ చెట్టు అలంకరించి కనిపించడం మామూలైపోయింది. ఇలా క్రిస్టమస్‌కి ఒక చెట్టుని అలంకరించడం పదహారవ శతాబ్దంలో జర్మనీలో ప్రారంభమైంది. ఫర్‌ చెట్టుకి యాపిల్‌ పండ్లు, కొవ్వొత్తులు, రంగు కాగితాలు అలంకరిచేవాళ్ళు. ఈ సాంప్రదాయాన్ని ఇంగ్లాండ్‌కి విక్టోరియా రాణి భర్త, ఆల్బర్ట్‌ తన స్వస్థలం జర్మనీ నుంచి తీసుకువచ్చాడు. పంతొమ్మిదవ శతాబ్దపు చివరలో ఈ చెట్టు సాంప్రదాయం అమెరికాకి చేరింది.
వింత సంప్రదాయాలు
స్లోవాకియాలో క్రిస్మస్‌ రోజున ఒక విచిత్ర సాంప్రదాయం అమలు చేస్తారు. పెళ్లి కాని వాళ్ళు (పెళ్లి కావలసిన వాళ్ళు) ఆ రోజున గుమ్మానికి వీపు పెట్టి చెప్పును విసురుతారు. ఆ చెప్పుు గుమ్మం వైపు తిరిగి పడితే త్వరలో పెళ్లి జరుగుతుందని నమ్ముతారు.
పాశ్చాత్య దేశాలలో క్రిస్మస్‌ రోజు సాంప్రదాయంగా టర్కీ అనే పక్షిని తింటారు. కానీ జపాన్లో చికెన్‌ ఎక్కువగా తింటారు. ఆ రోజు మామూలు కంటే పది రెట్లు ఎక్కువగా ఓ బ్రాండ్‌ ఫ్రైడ్‌ చికెన్‌ అమ్ముడవుతుంది. అలాగే, అంతటా ప్లం కేక్‌ సాంప్రదాయంగా వుంటే, జపాన్‌లో స్పాంజ్‌ కేక్‌ ఎక్కువ. క్రిస్మస్‌ రోజు తరువాత అమ్మకం కాని కేక్‌లని ఇంక ఎవ్వరూ కొనరు, తినరు. పారవేయవలసిందే!
ఫిన్లాండ్‌లో క్రిస్మస్‌ ముందు రోజు సాయంత్రం (క్రిస్మస్‌ ఈవ్‌) స్మశానాలకి వెళ్లి, వారి ఆత్మీయులను తలచుకుంటూ వారి సమాధులపై కొవ్వొత్తులు వెలిగిస్తారు. అలాగే, వంటకాలన్నీ బల్ల పైనే వుంచి, ఇంటి వారు నేలపై పడుకుంటారు. ఆ రోజు గతించిన తమ వారు వచ్చి భోజనం చేసి, పడుకుని వెళ్లేందుకు వీలుగా అలా చేస్తారు.
స్వీడన్‌లో గావ్లే పట్టణ వీధుల్లో భారీ మేక బొమ్మను నిలబెడతారు. క్రిస్మస్‌ ఈవ్‌ అర్ధరాత్రి ఆ మేకను కాల్చి వేస్తారు. ఈ సాంప్రదాయం 1966లో మొదలయింది. అయితే, విశేషమేమిటంటే, పట్టణ అధికారులు ఆ మేక బొమ్మను కాల్చాలని అనుకోరు. దుడుకు యువకులు ప్రతి సారీ దాన్ని కాల్చడం, వారిని శిక్షించడం కూడా మామూలే.
మామూలుగా అయితే క్రిస్మస్‌ ట్రీ కి అందమైన దీపాలు, గంటలు, బొమ్మలు వేలాడ దీస్తారు. కానీ ఉక్రెయిన్లో ఆ చెట్టుకు సాలె పురుగు గూళ్ళను వేలాడదీస్తారు. స్థానిక కథ ప్రకారం... ఒక నిరుపేద కుటుంబానికి క్రిస్మస్‌ చెట్టుని అలంకరించే స్తోమత లేదు. ఆ చెట్టుకి అప్పటికే సాలె గూళ్ళు అల్లుకుని వున్నాయి. క్రిస్మస్‌ రోజు తొలి సూర్య కిరణం తగలగానే ఆ సాలె పోగులే బంగారం, వెండి పోగులుగా కనిపించి సంతోషాన్ని కలిగిస్తాయి.
ఇథియోపియాలో క్రిస్మస్‌ని జనవరి ఏడున జరుపుకుంటారు. ఇలా ఒక్కో చోట ఒక్కో విధంగా క్రిస్టమస్‌ సంబురాలు, విధివిధానాలుంటాయి. ప్రతి పండగ ఉద్దేశం కుటుంబాల్లో, సమాజంలో సంతోషాల్ని నింపాలి, ఇరుగు-పొరుగు మధ్య సత్సంబంధాలు నెలకొనాలి. సాటి వారిపై ప్రేమ, కరుణ పెరగాలనే. క్రీస్తమలో ఇది స్పష్టంగా తెలుస్తుంది.
బాక్సింగ్‌ డే
క్రిస్టమస్‌ తరువాతి రోజుని 'బాక్సీంగ్‌ డే! పిలుస్తారు. దీనినే సెంట్‌ స్టీఫెన్‌డే అని కూడా అంటారు. ఈ స్టీఫెన్‌ క్రీ.శ.34లో రాళ్ళతో కొట్టి చంపబడ్డాడు. ఆ గుర్తుగా చందాలు సేకరించిన డబ్బాలు బార్లు పేదలకు చర్చిల దగ్గర ఇచ్చేవాళ్ళు. కొంత మంది చరిత్రకారుల ప్రకారం, క్రిస్మస్‌ రోజు ఇంట్లో పనిచేసి వెళ్ళిపోయే సేవకులకు యజమానులు బహుమతుల డబ్బాలు ఇచ్చేవారని, ఆ విధంగా బాక్సింగ్‌ డే ఉనికిలోకి వచ్చిందని అంటారు.
క్రిస్టమస్‌ కేక్‌
క్రిస్టమస్‌ అనగానే గుర్తుకొచ్చే మరో అంశం కేక్‌. అన్ని పండగలలో చేసుకునే తీపి పదార్థం లాగే పూర్వకాలం పారిడ్జ్‌ అనే పాయసం వంటి తీపి వంటకం క్రిస్మస్‌ సమయంలో చేసుకునే వాళ్ళు. పదహారవ శతాబ్దంలో పారిడ్జ్‌లో వాడే ఓట్ల బదులు గోధుమ పిండి, వెన్న, గుడ్లు కలిపి ప్లమ్‌ కేక్‌ తయారు చేసారు. క్రమ క్రమంగా దానిలో ఎండిన ద్రాక్ష, జీడిపప్పు, బాదం, వంటి దినుసులు జోడించడం మొదలైంది. అలా అలా క్రిస్టమస్‌ కేక్‌ ఆవిర్భవించింది.
ఇప్పుడు హోటల్‌లలో క్రిస్మస్‌కి కొన్ని నెలల ముందు నుండీ కేక్‌ తయారీ మొదలౌతుంది.
పిండి, ఇతర దినుసులు కలపడం అనే కార్యక్రమాన్ని కేక్‌ మిక్సింగ్‌ అనే పేరుతో జరుపుకుంటారు. ఇలా చేయడం పదిహేడవ శతాబ్దం నుండి వస్తున్న ఆచారం. ఆ కాలంలో విరివిగా లభించే పండ్లు ఫలాలతో చేసిన కేక్‌ మళ్ళీ వచ్చే ఏడాది వరకూ నిలవ ఉండేదట, మరో సంవత్సరం కూడా మంచి ఫలాలను ఇస్తుందని విశ్వాసం.
ఎండిన ద్రాక్షతో పాటు, చెర్రీలు, ఖర్జూరాలు, పిస్తా, బాదం, జీడి, నిమ్మ, నారింజ తొక్కలు, పంచదార పాకం, తేనే, చివరగా విస్కీ గానీ బ్రాందీ గానీ కలిపి, అప్పుడప్పుడూ కలుపుతూ క్రిస్మస్‌కి రెండు మూడు రోజుల ముందు వరకూ ఉంచుతారు.
ఆ తరువాత కేక్‌ని బేక్‌ చేయడం చేస్తారు. కొన్ని ప్రాంతాలలో తయారైన కేక్‌ని బోర్లా వేసి, కొద్దికొద్దిగా విస్కీని ప్రతివారం దానిపై పోస్తారు. ఇదంతా పూరైన తరువాత అతి రుచికరమైన క్రిస్మస్‌ కేక్‌ తయారౌతుంది.
డిసెంబర్‌ 25నే ఎందుకు?
వాస్తవానికి డిసెంబర్‌ 25నే యేసుక్రీస్తు జన్మించాడు అనటానికి చారిత్రక ఆధారాలు లేవంటారు. ఆ మాటకొస్తే అసలు ఆ రోజునే యేసు జన్మించాడని ఎవరికీ తెలీదు. బైబిల్‌ లో కూడా ఆ తేదీ ప్రస్తావన లేదు. బహుశ క్రీస్తు పుట్టుక క్రీస్తు శకం ఒకటవ సంవత్సరంలో కాక కాస్త ముందుగానే అంటే క్రీస్తు పూర్వం 2-7వ సంవత్సరాల మధ్య జరిగి ఉండవచ్చని కొందరి అంచనా. మన కాలమానంలో క్రీస్తు శకం '0' సంవత్సరం లేదు, నేరుగా క్రీ. పూ. 1 నుండి క్రీ. శ.1కి వెళుతుంది.
మొట్టమొదటి క్రిస్టమస్‌ క్రీ.శ. 336వ సంవత్సరంలో, మొట్టమొదటి క్రైస్తవ రోమన్‌ చక్రవర్తి కాన్స్టాంటిన్‌ ఆధ్వర్యంలో జరిగింది అనడానికి నిదర్శనాలు వున్నాయి. కొన్నేళ్ల తరువాత, క్రీ.శ. 350లో మొదటి పోప్‌ జూలియస్‌ అప్పటి రోమ్‌ బిషన్‌గా ఉండేవాడు. డిసెంబర్‌ 25న జరుపుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది ఆయనే.
అసలు క్రీస్తు పుట్టిన రెండు వందల ఏళ్ళ తరువాతే మొట్టమొదటిసారి డిసెంబర్‌ 25 ప్రస్తావన కనిపిస్తుంది. అదీ, అప్పటి రోమన్ల 'సాటర్నేలియా' అనే ఒక కోత పండగకు దీటుగా తొలి క్రిస్టమస్‌ పండుగ జరుపుకున్నారని చెబుతారు. క్రైస్తవం రోమా సామ్రాజ్యంలో అధికారిక జాతీయ మతంగా ఎదిగిన తరువాత, క్రీస్తు శకం 529 ప్రాంతంలో, జస్టినియన్‌ చక్రవర్తి క్రిస్టమస్‌ని సెలవు దినంగా ప్రకటించాడు అని ఒక వివరణ వుంది. మన దక్షిణ భారతంలో పంట కోతకు వచ్చిన సమయంలో పండగ చేసుకునే సాంప్రదాయం వంటిదే ప్రపంచ వ్యాప్తంగా వుంది. అటువంటి ఒక సంతోషకరమైన సందర్భమే క్రిస్టమస్‌కి మూలం అంటారు కొందరు. యూదులకు హనుక్కా అనే పండుగ డిసెంబర్‌ ఇరవై ఐదవ తేదీన ఘనంగా జరుపుకుంటారు. క్రీస్తు కూడా యూదుడే. అందువల్ల కూడా డిసెంబర్‌ 25ని ఎంచుకుని ఉండవచ్చు.
అయితే ఈ సంక్లిష్ట మూలాల జోలికి పోకుండా వుంటే, క్రిస్టమస్‌ అనగానే ఒక ప్రపంచ వ్యాప్త వేడుక అనిపిస్తుంది.

- డా.కాకర్లమూడి విజయ్

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సైన్సుదే భవిష్యత్తు!
సృజనకు విత్తు స్వంత భాష
పేమ్ర పేమ్రను పేమ్రిస్తుంది..
ఆదివాసీ దర్పం నాగోబా జాతర
హొయలొలికిన భారతీయ చితక్రళ
పాత పంటల సంరక్షణే లక్ష్యంగా...
ఆ మూడు చట్టాలలో అస‌లేముంది?
సినీ సంగీత సామ్రాజ్యంలో గాన గంధర్వుడు యేసుదాస్‌
క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే
2020లో ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా !

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
05:01 PM

ఆర్టీసీ బస్సులు ఢీ.. ఐదుగురి మృతి

04:33 PM

శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' టైటిల్ పోస్టర్ రిలీజ్

04:31 PM

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్

04:24 PM

మరో యువకుడి చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ.. వీడియో వైరల్

04:13 PM

భారత్ ఘన విజయం..టెస్టు సిరీస్ కైవసం

04:08 PM

గోల్నాకలో విషాదం.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

04:02 PM

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం..

03:55 PM

ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 ప్రారంభం

03:45 PM

బీడీ కార్మికుల ధర్నా

03:27 PM

బాలుడిని మింగెసిన మొసలి.. పొట్ట కోసి బయటకు తీశారు (వీడియో)

02:58 PM

కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత

02:44 PM

విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్..

02:10 PM

కేటీఆర్ పీఏనంటూ మోసాలు..మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

01:56 PM

ఈ నెల 11 నుంచి జూబ్లీహిల్స్‌ వెంకన్న బ్రహ్మోత్సవాలు

01:36 PM

శ‌ర్వానంద్ కొత్త చిత్రం టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.