Sun 27 Dec 06:49:58.020579 2020 నాటి అన్నదాత !నేడు అహర్నిశలు శ్రమించినా ఫలితం దక్కని విధి వంచిత కర్షకూడు..కష్టాలే తన ఇంటి చిరునామాగా మారినా.!పరోపకారంతో తోటివారిని ఆదరించేమంచి మనసున్న శ్రమజీవే రైతన్న...!ప్రకతి కరుణించిచేతికి అందివచ్చిన పంటను చూస్తూ..దళారుల దగాకోరు తనంకు విలవిల్లాడుతు.. నిస్సహాయంగా ధాన్యం వైపు దీనంగా చూస్తూ..నీ విలువ గుర్తించలేని వారికి నిన్ను అందిస్తున్నా!మన్నించమ్మా!అని వేడుకునే నిస్వార్థ పరుడే..రైతన్న.!గుప్పెడు గింజలు దాచుకోలేక..అన్నార్తుల ఆకలిని తీర్చాలని తలచే మానవ మూర్తి రైతన్నే..!శ్రమనే పెట్టుబడిగా పెట్టి..విధి ఆడే వింత చదరంగంలో.సర్వం కోల్పోతున్నా! పోరాడుతునే ఉంటాడు.ఒక్కరి ఆకలైనా తీర్చి గెలవాలంటూ..!మట్టిలో మాణిక్యమే కాదు అతనుమట్టిలోనే కలిసి పోతున్న మేలిమి రత్నమతడు.బీడు భూములను సిరులు గడ్డగా మలచిఅదే నేలపై ఆదమరిచి నిద్రించేపసి బాలుడతను.- రాము కోలా, 9849001201 టాగ్లు : మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి