Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే

Sat 02 Jan 23:12:30.592308 2021

సావిత్రి బాయి ఫూలే ఆధునిక భారతదేశ తొలి మహిళా పాఠశాలలో తోలి మహిళా ఉపాధ్యాయురాలు. తొలి ప్రధానోపాధ్యాయురాలు. మహిళలందరు సమానత్వాన్ని కలిగి గౌరవంగా జీవించాలని ఆశింది. అందుకు చదువే సరైన సాధనం అని గుర్తించి ఆనాటి బ్రహ్మణీయ మనువాద సమాజంలోని పితస్వామ్య కట్టుబాట్లను ఎదిరించి మహిళలకు, అస్పశ్యులకు చదువును అందిందించి. మానవత్వం, స్వేచ్ఛ, సమానత్వం, సమన్యాయాలే లక్ష్యాలుగా చేసుకుని తన జీవితాంతం వరకు మహిళలు, అంతరానివాళ్ళు, రైతులు, పిల్లల శ్రేయస్సు కోసం కృషి చేశారు.
ఎగుడు దిగుడుగా నిర్మితమైన భారతదేశ సమాజంలో ప్రజలు అనేక కులాలుగా, సమూహాలుగా విడిపోయారు. కొందరు పుట్టుకతో అత్యన్నత గౌరవ మర్యాదలు, సంపద అన్ని అవకాశాలు అనుభవస్తే, మరికొందు కనీస హక్కులకు కూడా నోచుకోకుండా కటిక పేదరికం, అంటరానితనంతో దుర్భర జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఇలాంటి అసమాన సమాజంలో మహిళలు అత్యంత బాదితులు, అత్యంత హేయమైన కుల, పితస్వామ్య సమాజంలో అనేక అవమానాలకు, అత్యాచారాలకు గురవుతూ కనీస మానవహక్కులకు నోచుకోకుండా బానిసలుగా బతుకుతున్న మహిళా లోకానికి బాసటగా వారి జీవితాల్లో వేకువ పొద్దుయి పొడిచింది క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే. ఆనాటి కరుడుగట్టిన సనాతన బ్రాహ్మణవాద సమాజంలో బహుజనులకు చదువొక ఫలించని కళ అయితే స్త్రీలకు అది పగటి కల. అలాంటి గడ్డు పరిస్థితులలో అస్పశ్యులు, బాలికల జీవితాలను విద్యాదీపంతో వెలిగించిన విజ్నాన జ్యోతి సావిత్రిబాయి.
జనవరి 3, 1831న మహరాష్ట్రలోని కవాడి గ్రామంలో... ఖండోజీ, లక్ష్మీ దంపతులకు మొదటి సంతానంగా జన్మించింది సావిత్రిబాయి. తన 9వ ఏట 1840లో 13 ఏళ్ళ మహత్మ జ్యోతిరావు ఫులేతో వివాహం జరిగింది. అప్పటికే బ్రిటీషు మిషనరీలో ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న జ్యోతిరావు ఫూలే తన భార్యకు చదువు అవసరతను గుర్తించి, ఆమెకు చదవడం, రాయడం నేర్పించాడు. స్వతహగా తెలివైన చురుకైన సావిత్రిబాయి త్వరగానే చదవడం రాయడం నేర్చుకంది. ఆ తర్వాత జ్యోతిరావు ఫులే స్నేహితుల సహకారంతో నార్మన్‌ పాఠశాలలో చేరి విద్యను పూర్తి చేసుకుంది. అనంతరం ఉపాధ్యాయ శిక్షణ కూడా పూర్తి చేసుకుంది. సావిత్రికి చదువు పట్ల గల ప్రేమ, ఏకాగ్రత నేడు వివాహం తర్వాత చదువలేక పోతున్నాం అని బాధపడే ఎంతో మంది మహిళలకు ఆదర్శం.
ఉత్తమ ఉపాధ్యాయురాలు
భారతదేశం లో మహర్షి కార్వే తొలి మహిళా విశ్వవిద్యాలయం స్థాపించక మునుపే తన 17వ ఏట నే జనవరి 1, 1848లో మొదటి బాలిక పాఠశాలను ఏర్పాటు చేసి అఖండ భారతదేశంలో మొదటి ఉపాధ్యాయురాలు ప్రధానో పాధ్యాయురాలు అయింది. ఆనాటి సమాజంలో సనాతన బ్రాహ్మణవాద ఆచారాల ప్రకారం అస్త్రశ్యులకు, స్త్రీలకు విద్యను అందివ్వడం ధర్మ విరుద్ధం. బాలికలు పాఠశాలకు రావడాన్ని తిరుగుబాటు చర్యగా భావించే వారు. సావిత్రిబాయి ఇంటి నుంచి పాఠశాలకు వచ్చే దారిలో జనాలు చాలా అవహేళన చేసేవారు. రాళ్లతో పెండతో , బురదలో కొట్టేవారు. అయినా ఆమె బెదిరిపోలేదు. తనవెంట మరో చీర తెచ్చుకునేది. పాఠశాలకు వెళ్ళగానే బురద, పెండ, దుమ్ముతో పాడైన చీర మార్చుకుని పిల్లలకు చదువుచెప్పేది. అట్లాంటి సనాతన కట్టుబాట్లను ఎదిరించి ఎన్ని ఆటంకాలు, అవమానాలు బెదిరింపులు ఎదురైనా పట్టువదలక అస్పశ్యులకు బాలికలకు విద్యనందించిన చదువుల తల్లి సావిత్రి బాయి. ప్రతి మనిషికి కావలసిన తిండి, నీరు, బట్టలు, నివాసం వంటి కనీస అవసరాలను సమకూర్చుకునేందుకు విద్య ఒక ఆవశ్యక వనరు అని బలంగా నమ్మింది. కనుకనే కింది కులాల వారికి , మహిళలకు చదువు ఎంత ముఖ్యమో నొక్కి చెప్పింది. చెప్పడమే కాదు 18 పాఠశాలలు స్థాపించి విద్యావాప్తికి విశేషంగా కషిచేసింది. ఈ రోజు లక్షలాది మంది దళితులు, మహిళలు స్వేచ్చ... స్వాతంత్రాలతో ఒక ఉన్నతమైన జీవితాన్ని పొందుకుంటూ ఆత్మగౌరవంతో తమ కళలను, సుసంపన్నం చేసుకుంటున్నారంటే అందుకు కారణం సావిత్రి బాయిఫూలే. తొలితరం స్త్రీవాదులు ముక్తాసాల్వే, తారబాయి షిండే సావిత్రి బాయి విద్యార్థులు. ముక్తాసాల్వే తనకు బహుమతి ప్రధానం చెయ్యడానికి వచ్చిన ఆనాటి కలెక్టర్‌ ను మెప్పించి పాఠశాల అభివద్ధి కి నిధులు ఇచ్చేలా చేసింది. సావిత్రి బాయి తన విద్యార్థుల ను అంత బాగా ప్రోత్సహించేది.
ఉపాధ్యాయురాలిగా సావిత్రి బాయి చేపట్టిన కార్యక్రమాలు ఈనాటికి ఆచరణీయం. నేటి ప్రభుత్వాలు, ఆధునిక విద్యావేత్తలు గొప్ప గొప్ప సంక్షేమ పథకాలు, సరికొత్త విద్యా కార్యక్రమాలుగా చెప్పుకుంటున్న మధ్యాహ్న భోజనం పథకం, అందరికీ విద్య, తల్లిదండ్రుల సమావేశాలు (sme)లు, సంక్షేమ హస్టళ్లు (బోర్డింగ్‌ స్కూల్లు) వంటి వాటిని సావిత్రి బాయి 170 ఏళ్లకు పూర్వమే విజయవంతంగా అమలు చేసింది. అంటరాని వాడల్లో, గుడిసె గుడిసెకు తిరిగి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించే ఈనాటి ''బడిబాట'' కార్యక్రమాన్ని ఆనాడే చేపింది. డ్రాపవుట్‌ సంఖ్యను తగ్గించడం కోసం బడికి రాని విద్యార్థుల కుటుంబాల ను దర్శించేది. విద్యార్థుల గైర్చజరికి కారణాలు తెలుసుకునేది. తన విద్యార్థుల కుటుంబ పరిస్థితులు కనిపెట్టుకుని అవసరాలు తీర్చేది. ఒక వేళ వారు అనారోగ్యానికి గురుయితే ఆసుపత్రికి చూనించేది. పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు పాఠశాలల్లో మద్యాహ్న భోజనం నిర్వహించేది. ఆ పాఠశాలలు హస్టల్లుగా కూడా వ్యవహరించేవి. చదువులో ఆటల్లో ప్రతిభ కనబరిచే పిల్లలకు తినిబంధారాలను బహుమతిగా ఇచ్చేది. ఇలా సాధ్యమైన రీతిలో పిల్లల ఆకలి తీర్చి వారిని చదువైపు మల్లించేది. పిల్లల్ని చినిగిన బట్టల్లో చోయిస్తే సోత ఖర్చులతో బట్టలు కొనిపెట్టేది. మహిళలు చినిగిన చీరలు కట్టుకుంటే చోఇదలేక ఇంట్రిమ్చి తనివి తెచ్చి ఇచ్చేది. ఇవన్నీ చోఇసి జ్యోతిరావు పూలే అప్పుడప్పుడు ''ఒక్కడి సంపాదనతో ఇవన్నీ ఎలా చేయగలం సావిత్రి.. నువ్వు కొంచెం ఇవన్నీ తగ్గించు'' అంటే మనం బతకడానికి ఉంటే చాలంది. పోయేటప్పుడు ఏదీ తీసుకెళ్ళాం కదా అనేది. ఇక అంతే ఆయన కూడా నవ్వి ఊరుకునేది. ఈ విధంగా విద్యావ్యాప్తి ద్వారా అంటరాని జీవితాల్లో వెలుగు పూలు వికసింపచేసింది సావిత్రి బాయి ఈ నాటి ఉపాధ్యాయులకు మార్గదర్శి అయింది.
''తొలితరం స్త్రీవాది''
సమాజంలోని పాతకాలపు పాశవిక భావాజాలంపై తీవ్ర పోరాటం చేసింది సావిత్రి బాయి. అందుకు ఆమెకు అందుబాటులో ఉన్న ఏ అవకాశం వదులుకోలేదు. మంగలి వారిని చైతన్య పరిచి బ్రాహ్మణ విధవరాండ్లకు గుండు కొట్టించి చీకటి గదుల్లో బంధించే అనాచారానికి వ్యతిరేకంగా ఉద్యమించింది. వితంతు పునర్వివాహలు జరిపించింది. వరకట్నాన్ని నిషేధించి సామాజిక వివాహాలు జరిపించింది. బాల్య వివాహాలు నిషేధించింది. బ్రాహ్మణ పూజారులు లేకుండా వివాహాలు జరిపించింది. అంతేకాక వివాహ సమయంలో పెండ్లికొడుకు చేత తన భార్యకు స్త్రీలకు చదువును, సమాన హక్కులను కల్పిస్తానని ప్రమాణం చేయించింది. తన పాఠశాలల్లో చదివే ఆడపిల్లలు, మగ పిల్లలలకు ప్రీ మ్యారిటల్‌ కౌన్సిలింగ్‌ ఇచ్చేది. ఆ పిల్లలు ఆధునిక భావాలతో ఉన్నత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేవారు. దేశంలో మొట్టమొదటిసారి మహిళా హక్కుల సంస్థను 1852లో మహిళా సేవా మండలి పేరుతో ఏర్పాటు చేసింది. ఈ సంస్థలో కులాలకతీతంగా మహిళలకు స్థానం కల్పించింది..
స్త్రీల అస్తిత్వాన్ని ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్న బ్రూణ హత్యలకు వ్యతిరేకంగా నేడు ప్రపంచదేశాల మహిళలు ఉద్యమిస్తున్నారు. కాని దశాబ్దన్నర క్రితమే సావిత్రి బాయి ఈ సమస్య గుర్తించి బాధిత మహిళలకు అండంగా నిలబడింది. సనాతన బ్రాహ్మణ కుటుంబాలలో బాల్య, యవ్వన వితంతువుల పై జరిగే లైంగిక దోపిడీల వల్ల అనేక మంది గర్భం దాల్చేవారు. జరిగిన అవమానాలు భరించలేక గర్భస్రావాలకు, ఆత్మహత్యలకు పాల్పడేవారు. అలాంటి వారిని చూసి చలించిన సావిత్రిబాయి ''బాల్యహత్య ప్రతిబంధక్‌ గహ'' ను స్థాపించి ఆశ్రయం కల్పించింది. అలాంటి ఒక వితంతువు కాశీబాయిని కాపాడి ఆమె కుమారున్ని దత్తత తీసుకొని యశ్వంతరావుగా నామకరణం చేసి పెంచుకుంది. అతడు పెరిగి పెద్దవాడయి డాక్టరయిన తర్వాత మాలి కుల ప్రముఖుని కూతురితో కులాంతర వివాహం జరిపింది.
సావిత్రిబాయి ఉదార మాతప్రేమ నేటి పిల్లలులేని దంపతులకు దత్తత స్వీకరణ ద్వారా తల్లిదండ్రులు అయ్యేందుకు మార్గం చూపించింది. తద్వార అనాధలు లేని సమాజాన్ని ఆమె ఆకాంక్షించింది.
అంటరానితనంలో మగ్గే అసశ్యులకోసం తన ఇంట్లోనే బావిని తవ్వించి తాగునీటిని అందించిన ప్రేమామయి సావిత్రిబాయి. తీవ్ర కరువు బారినపడి తిండిగింజలు దొరకలేని పరిస్థితులలో వివిధ వర్గాల నుండి ఆహారాన్ని సేకరించి 52 ఆహర కేంద్రాల ద్వారా వేలాది మంది ఆపన్ను లను ఆదుకున్న అన్నపూర్ణ ఆమే. తర్వాత ఈ ఆహర కేంద్రాలు హాస్టల్లుగా పనిచేసాయి. పక్కవాడు అలమటిస్తున్న చలించలేని, మానవత్వం లేని మనుషులున్న నేటి సమాజం ఆనాడు సావిత్రి బాయి చేసిన నిస్వార్థ సేవలనుండి చలనం తెచ్చుకోవాలి.
సావిత్రిబాయిని చాలమంది మహాత్మ జ్యోతిరావు ఫూలే భార్యగానే గుర్తిస్తారు. కాని సావిత్రిబాయి భర్తను ఆరాధిస్తునే, ఆయన అడుగుజాడల్లో నడుస్తూనే స్వతంత్య్ర వ్యక్తిత్వం కలిగిన మహిళ. తన ఆశయాలను కొనసాగిస్తూనే భర్తకు అన్ని వేళలా అండగా ఉంటూ ఆయన ఆశయాలను ముందుకు నడిపిస్తూ నిజమైన భారత స్త్రీ ధర్మన్ని నెరవేర్చిన మహిళ. భర్త మరణానంతరం ఆయన ఆశయాలను అన్ని తానై కొనసాగించింది. సత్యశోధక్‌ సమాజ్‌కు తొలి విరాళం ఇచ్చిన మొదటి వ్యక్తి. ఈ దంపతులు ఒకరి ఒకరు తోడై దాంపత్య ప్రేమకు నిర్వచనంగా నిలిచారు. నేటి యువతి, యువకులు తమ వివాహ బంధాన్ని ఈ దంపతుల్లా సుసంపన్నం చేసుకోవాలి.
సావిత్రీ బాయి తొలి తరం రచయిత్రి, కవయిత్రి. ఈమె రచించిన కవితల సంపుటి ''కావ్యపూల్‌'', ''బవన్న కాశి, సంబోధి రత్నాకరం'' జ్యోతిబాకు రాసిన లేఖలు చదివితే విద్యపట్ల, సమాజం పట్ల ఆమె నిబద్ధకు అస్పశ్యుల పట్ల ఆమె పేరుకు, ఆమె విజ్నానికి అద్దంపడతాయి. జ్యోతిబా ఫూలే రాసిన అనేక వ్యాస సంకలనాలను ప్రచురించి సంపాదకురాలిగా కూడా తన ప్రతిభను చాటుకంది.
అంటరాని వారికి, బాలికల కోసం పాఠశాలలు నడపడం, విదవరాండ్రకు గుండుకోట్టే ఆచారాన్ని వ్యతిరేకించడం, వితంతు గర్బిణిలకు ఆశ్రయం ఇవ్వడం, వితంతు పునర్వివాహలు, కులాంతర వివాహాలు నిర్వహించడం, దత్తత స్వీకరించడం, కరువు కాటకాల్లో పేదలకు అన్నం పెట్టి ఆదుకోవడం వంటి కార్యక్రమాలే కాకుండా భర్త మరణించినప్పుడు సనాతన ఆచారాలకు విరుద్ధంగా ఆయన చితికి నిప్పు పెట్టి నిజమైన అభ్యుదయ భావాలు కలిగిన సంస్కరణ వాదిగా సావిత్రి బాయి చరిత్రలో స్థిరస్థాయిగా నిలిచిపోయింది. చివరకు మహరాష్ట్రలో ప్లేగు వ్యాధి ప్రబలినపుడు తన కొడుకుతో కలిసి పేదలకు వైద్య సహాయం అందించిన దయామయి చివరకు అదే ప్లేగు వ్యాధి కారణంగా మరణించింది.
ఇలా తన ప్రేమ, లక్ష్యసాధనపట్ల తనకున్న నిబద్ధత వల్ల తన ప్రజల హదయాలను గెలుచుకుంది. తన మనవతా హదయంతో దళితుల, మహిళల జీవితాల్లో వెలుగులు నింపి తరతరాల అంధకారానికి ముగింపు పలికింది. మహిళా సాధికారత కోసం ఒక క్రూసేడర్‌ లా పనిచేసిన సావిత్రి బాయి తరతరాలుగా మనువాదపు దాస్యంలో మగ్గిపోతున్న మహిళలు, అణగారిన వర్గాలకు మెస్సయ్య. ఆనాడు సావిత్రిభాయి పోరాడిన దురాచారాలు నేటికి కొత్త, కొత్త రూపాల్లో కొనసాగుతున్నాయి. మహిళలే దాడులు, అత్యాచారాలు, అంటరానితనం, కులవివక్ష పేదరికం పెరిగిపోతోంది. సమాజంలోని అంతరాలు రోజుకు రోజుకి పెరుగుతోంది. నాణ్యమైన చదువు పేదలకు అందకుండా ఖరీదైన వస్తువుగా మారింది. అయినా కొంతలో కొంత ఊరతగా డా. R.S ప్రవీణ్‌ కుమార్‌ సార్‌, గురుకులాల కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి సావిత్రిబాయి ఫులేని ఆదర్శంగా తీసుకొని గురుకులాలను తీర్చి దిద్దుతున్నారు. వేలాది మంది స్వేరో పిల్లలు ఉన్నత చదువుతో తమ భవిష్యత్‌ను నిర్మించుకుంటున్నారు. స్వేరో అమ్మాయిలు ఆత్మ విశ్వాసం, ఆత్మ గౌరవంతో ఆకాశమే హద్దుగా అద్భుతాలు సష్టిస్తున్నారు. సావిత్రిబాయి ఫులే ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాడానికి స్వేరో ఉపాధ్యాయులు ''ట్రూ టీచర్స్‌ కోయలేషన్‌'' గా ఏర్పడి దళిత బహుజన పిల్లలు, ఆడపిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుకు కషి చేస్తున్నారు. ఇప్పుడు సమాజంలో ఎదురవుతున్న చాలా సమస్యలకు పరిష్కారం అందరికీ నాణ్యమైన విద్యను అందించడమే. కాబట్టి యువత అమ్మ సావిత్రిబాయి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని సరైన కార్యాచరణతో ముందడుగు వేయాలి. ఇదే ఆమెకు మనమివ్వగలిగే ఘనమైన నివాలి.
(జనవరి 3, 2021న 190వ జయంతిని పురస్కరించుకుని)

- పులి కవిత, 965232900
రచయిత్రి, సావిత్రి బాయి ఫూలే అధ్యయన వేదిక.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

సైన్సుదే భవిష్యత్తు!
సృజనకు విత్తు స్వంత భాష
పేమ్ర పేమ్రను పేమ్రిస్తుంది..
ఆదివాసీ దర్పం నాగోబా జాతర
హొయలొలికిన భారతీయ చితక్రళ
పాత పంటల సంరక్షణే లక్ష్యంగా...
ఆ మూడు చట్టాలలో అస‌లేముంది?
సినీ సంగీత సామ్రాజ్యంలో గాన గంధర్వుడు యేసుదాస్‌
2020లో ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా !
ఎన్ని క్రిస్ట్‌మస్‌ లో..!

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
04:33 PM

శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' టైటిల్ పోస్టర్ రిలీజ్

04:31 PM

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్

04:24 PM

మరో యువకుడి చెంప చెళ్లుమనిపించిన బాలకృష్ణ.. వీడియో వైరల్

04:13 PM

భారత్ ఘన విజయం..టెస్టు సిరీస్ కైవసం

04:08 PM

గోల్నాకలో విషాదం.. భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

04:02 PM

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం..

03:55 PM

ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 2021 ప్రారంభం

03:45 PM

బీడీ కార్మికుల ధర్నా

03:27 PM

బాలుడిని మింగెసిన మొసలి.. పొట్ట కోసి బయటకు తీశారు (వీడియో)

02:58 PM

కవి లక్ష్మీనారాయణ భట్ట కన్నుమూత

02:44 PM

విజయానికి 4 వికెట్ల దూరంలో భారత్..

02:10 PM

కేటీఆర్ పీఏనంటూ మోసాలు..మాజీ రంజీ క్రికెటర్ అరెస్ట్

01:56 PM

ఈ నెల 11 నుంచి జూబ్లీహిల్స్‌ వెంకన్న బ్రహ్మోత్సవాలు

01:36 PM

శ‌ర్వానంద్ కొత్త చిత్రం టైటిల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

01:21 PM

ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ డెస్క్‌‌ను ప్రారంభించిన సజ్జనార్

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.