Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

అనేక పార్శ్వాల ప్రతిబింబం- అద్వంద్వం

Sun 10 Jan 01:35:18.023702 2021

శూన్యం నుంచి సంపూర్ణ ఏకతలోకి సమాజాన్ని తీసుకెళ్లాలనే తపన ఈ కవిది. ద్వంద్వాన్ని గమనిస్తే నేను, నేను కానిది అనే స్వార్థంతో కూడిన రెండంశాలు కనిపిస్తాయి. ''అంతా సమానమే'', ''అంతా ఒక్కటే'' అనే సమానార్థక దష్టికోణం ఏదైతే ఉందో అదే అద్వైతం, అదే అద్వంద్వం. భక్తి ఉద్యమ నేపథ్యపు విప్లవాత్మక మార్పు అద్వైతం.ఆధునికతను సంతరించుకున్న కవితా పంక్తుల విప్లవ చురకగా ఈ ''అద్వంద్వం'' సాహిత్య తెరపైకి వచ్చింది. ఈ పుస్తకాన్ని రచించిన కవి శ్రీరామ్‌. పుట్టింది తెనాలి. పెరిగింది విజయవాడ. వీరు వచనం రాయటంలో కూడా తనదైన ముద్ర వేసుకున్నారు.
అస్తిత్వ ఛాయలు, అభినివేశత, ఆధునికత, ఆత్మగౌరవం స్వేచ్ఛా కాంక్ష, బతుకు వెతలు, విప్లవవాదం, సామాజికన్యాయం, మత సామరస్యం, స్త్రీవాద దక్పథం, నిరసన తత్వం, మానవతా పరిమళాలు ఈ అంశాలతో కూడి జాతీయం నుండి అంతర్జాతీయ సమస్యల వరకు కవి స్పందించారు.
వెంటాడే వాక్యాల్లోకి..
1. ''బిరడా వేసిన గాజుసీసాలోంచి
తూనీగల్ని,సీతాకోక చిలుకల్ని
రెక్కలు తెగ్గోసుకొని స్వేచ్ఛగా ఎగరమంటుంది'' (రెక్కలు తెగిన దారి)
స్వేచ్ఛ అంటే బలప్రయోగం కాదు.అభిప్రాయాల ప్రకటన, హక్కుల ప్రకటన, ఎవరిని ఇబ్బందులకు గురిచేయనిది, హానీ చేయనిదే స్వేచ్ఛ. అలాంటి స్వేచ్ఛాపూరిత వాతావరణం నుండి పిల్లలు దూరమవుతున్నారు. ఇష్టంలేని తనాన్ని బలవంతంగా రుద్దటం, పిల్లల మీద భారం వేయడం, మనస్థాపానికి గురై వారు ఆత్మహత్యలు చేసుకోవడం. ఇలాంటి సమస్యలు తలెత్తకూడదని కవి తన మొదటి కవిత ద్వారా సమాజాన్ని హెచ్చరిస్తున్నాడు.
2. పొలం కాళ్లు నగరానికి వచ్చాయి
పొలం పాదాల్ని కళ్ళకద్దుకోవాలనిపిస్తుంది
రంగు వెలిసిన కన్నీటి వానలు కురుస్తూ
పంట పాదముద్రలు
పట్నం కూడలిలో నిలబడ్డాయి (నాసిక్‌ -ముంబై)
కవి అంటేనే సమాజం పట్ల బాధ్యత కలిగిన వాడు. దేశానికి అన్నం పెట్టేవాడు రైతు. ఆ రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది అన్న నానుడి తెలియనిది కాదు. రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర ఉండదు.రైతులు హక్కుల కోసం సమస్యల సాధన కోసం ఎన్నో పోరాటాలు చేశారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో రైతులు ''లాంగ్‌ మార్చ్‌'' నిర్వహించిన సందర్భాన్ని తీసుకొని రైతుల నిరసనను తెలియజేస్తూ ఈ కవి రాసిన కవిత గొప్పగా ప్రతిధ్వనించింది. ఈ కవి కూడా రైతు పక్షాన నిలబడ్డవాడే. అందుకు ఉదాహరణగా ఒకసారి ఈ వాక్యాలు పరిశీలించండి. ఈ కవితలో ''రైతు పాదాలు'' నమస్కరించదగినవన్న విషయాన్ని కవి స్పష్టం చేస్తున్నాడు.
3. ''సాయిబులంతా మసీదు వైపు నడుస్తుంటే
తెల్లారి ఆకాశంలో
పొట్ట వరిచేల పై పై ఎగిరే కొంగల బారు
సందులో నేల మీదకు వచ్చి వచ్చి నడుస్తున్నట్టుంది (దేవుడి సందు)
ఏ మతమైనా మంచినే బోధిస్తుంది. భగవద్గీత,ఖురాన్‌,బైబిల్‌ అయినా మానవత్వంతో జీవించమని చెబుతుంది. ప్రస్తుత సమాజం దీన్ని గమనిస్తే ఆచరిస్తే ఎటువంటి సమస్య ఉండదు. సుగుణాలు కలిగి ఉంటూ ఒకరి విశ్వాసాలను మరొకరు గౌరవిస్తూ అన్నదమ్ముల లాగా జీవించాల్సిన అవసరం నేటి రోజులకు వర్తిస్తుంది.ఈ కవికి ''మతసామరస్య భావన'' నిండుగా ఉంది. సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు ముస్లిం, క్రైస్తవ సోదరులకు సకినాలు పంచడం, రంజాన్‌ పర్వదినంరోజు వారు సేమియా పంచడం, క్రైస్తవ సోదరులు మిఠాయిలు పంచడం, ఇలా ఒకరికొకరు కలిసి జీవించే సామరస్యాన్ని మనం చూస్తుంటాం. శ్రీరామ్‌ ఆ భావాలను చక్కగా ''దేవుడి సందు'' అనే కవితలో పొందుపరిచారు. మతాంతర వివా హాన్ని, కులాంతర వివాహాల్ని సాదరంగా ఆహ్వానిస్తూ సమాజంలో వేళ్ళూనుకున్న వ్యవస్థకు దూరంగా దారులు వేస్తున్నాడు ఈ కవి.
4. ''చనుబాలు చప్పరించిన గుండెల్లో
నీ మూలం పుట్టుమచ్చలు తడిమి చూడు
నువ్వు నేనొక ఆకాశం కాదా?
కరిగి కురిస్తే మనం
మట్టి వాసనలేసిన బతుకు నేల పండుగ కాదా?'' (అమ్మ పేరేంటి?)
''ఇప్పుడో సారన్నా గుళ్లో దేవుణ్ణి తాకితే బావుణ్ణు ఇప్పటికైనా వెట్టి వాడొకడు రాజైతే బావుణ్ణు'' (అట్రాసిటి)
చెల్లని నాణెం లాంటి పేద దేశం ముఖమ్మీద
కనపడని నాల్గోసింహం లా మీసం మెలేరు
సమాన హక్కులడిగి సబ్సిడీలో పనిముట్లు తీస్కో
(పేదరికంపై గెలుపు)
''సమసమాజ స్థాపన'' కోసం కూడా ఈ కవి నడుంబిగించాడు. ఇది అనాదికాలంగా వస్తున్న సమస్యే. ఎక్కువ తక్కువలు, కుల వివక్ష, మత వివక్ష, లింగవివక్ష కొన్ని శతాబ్దాలు దాటినా ఆ బీజాల తాలూకా వాసన ఏ మూలనో నక్కినక్కి కూర్చుంటుందన్న భయం ఇంకా నాలో ఉంది. కవులుగా వీటిపై కలకమెత్తాల్సిన బాధ్యత ఉన్నది. అలా కలమెత్తినకవి శ్రీరామ్‌ మానవీయ విలువలు, అనురా గాలు, స్నేహానికి సంబంధించిన కవితలు కూడా ఇందులో చోటు చేసుకున్నాయి. ఒంటరి స్త్రీలు పిల్లలను సాదలేక పడుతున్న వేదనా భరిత జీవితాన్ని కవి చూపించిన తీరు చాలా బాగుంది.ఇలా మొత్తం 38 కవితల్లో భావ సాంద్రతతో చిక్కగా, ఆధునికతను మేళవించి అద్వంద్వంను మన ముందుకు తెచ్చాడు. దాదాపు కవితలన్నీ చక్కటి శిల్పంతో పాటుగా, అభివ్యక్తిలో కొత్తగా ,కావల్సిన సమయాల్లో అలంకారాలను కవితల్లో చొప్పిస్తూ మంచి కవితా సంపుటిని పాఠకులకు బహుమతిగా ఇచ్చాడు.

- తండ హరీష్‌ గౌడ్‌,
8978439551

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అపరాధ భావం
తుది నిర్ణయం
గురుదక్షిణ
చిన్న పంతులు
మనిషి-వైరుధ్యం
అవృద్ధి..
బడికి పోత
అనసూయమ్మ గారి అరుగు
సారీ... నాన్నా ...
ఋణాను బంధ రూపేణా

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:53 PM

వాట్సాప్ మరో కొత్త నిబంధన..యూజర్స్ బీ అలర్ట్

09:35 PM

మహారాష్ట్రలో కొత్తగా 8,477 కరోనా పాజిటివ్ కేసులు

09:18 PM

పోలీసుల తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

09:13 PM

మహిళా దినోత్సవం సందర్భంగా గుర్రంపై అసెంబ్లీకి వచ్చిన మహిళ ఎమ్మెల్యే

09:06 PM

కోల్‌కతా రైల్వే కార్యాలయాలున్న భవనంలో అగ్నిప్రమాదం

08:39 PM

ఏపీలో ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం..

08:36 PM

హైదరాబాద్ ఫీవర్‌ ఆసుపత్రిలో ఉరేసుకొని రోగి ఆత్మహత్య

08:14 PM

87 సంవత్సరాల వ్యక్తికి అత్యంత అరుదైన గుండె శస్త్రచికిత్స

08:01 PM

అల్లోల దివ్యారెడ్డికి ‘పవర్ ఉమెన్’ అవార్డు..

07:42 PM

మంటలు చెలరేగితే నన్ను కాపాడారు..టీడీపీ కార్యకర్త

07:35 PM

టీవీవీ దినకరన్‌తో ఎంఐఎం పొత్తు..మూడు స్థానాల్లో పోటీ

07:21 PM

75 ఏండ్ల స్వాతంత్య్రం..సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం

07:06 PM

రామాయపట్నం పోర్టుకు ఆర్థిక సాయం చేయలేం : కేంద్ర ప్రభుత్వం

06:57 PM

వడదెబ్బతో వ్యక్తి మృతి

06:37 PM

హైదరాబాద్ పబ్ లో సింగర్ సిద్ శ్రీరామ్ కు అవమానం..

మరిన్ని వార్తలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.