తలంబ్రాలు చిత్రంలోని ''ఇది పాట కానేకాదు'' పాటకు పేరడి
Sun 17 Jan 01:04:07.422916 2021
రచన : రాజశ్రీ పల్లవి : నేను మాల్య కానేకాదు ఏ లోను జల్ది రాదు నేను మాల్య కానేకాదు ఏ లోను జల్ది రాదు నీరవ్ మోదీ, అనిలు అంబాని ఎదిగిన దేశమిది ఆ......ఆ....ఆ....ఆ....ఆ... నేను మాల్య కానేకాదు ఏ లోను జల్ది రాదు నేను మాల్య కానేకాదు ఏ లోను జల్ది రాదు
చరణం : డబ్బుకోసమై తిరుగాడి నేనొక బ్యాంకు చేరినాను వారిని లోనుకోరినాను దానికి లక్షాతొంబై నియమాలున్నవని వారు చెప్పినారు లోనుకు షఉ్యరిటడిగినారు ఆ తరువాతే తెలిసింది అసలుకన్నా మిత్తెక్కువనీ నేను బకురై పోతిననీ నా సాలరీ కిస్తీకోత ఈ అప్పుకు ఆధారం నే కట్టే ప్రతిపైసా మాఇంటికి పెనుభారం ఆ...ఆ....ఆ....ఆ...ఆ... నేను మాల్య కానేకాదు ఏ లోను జల్ది రాదు నేను మాల్య కానేకాదు ఏ లోను జల్ది రాదు
చరణం : ఇంకా కూడా బ్యాంకుల్ని ముంచే వంచకులున్నారు అపర కుబేరులున్నారు వారి సేవలో ప్రభువులు కూడా పనిచేస్తున్నారు దొంగలకు సద్దులు కడుతున్నారు ధనికా పేదా తారతమ్యం పోయెదెప్పటికీ సమసేదెప్పటికీ ఆ స్వార్థముండుదాకా అవినీతి పారిపోదు ఈ దొంగలుడుగుదాకా ఏ ప్రగతి ఉండబోదు
నేను మాల్య కానేకాదు ఏ లోను జల్ది రాదు నేను మాల్య కానేకాదు ఏ లోను జల్ది రాదు నీరవ్ మోదీ, అనిలు అంబాని ఎదిగిన దేశమిది ఆ......ఆ....ఆ....ఆ....ఆ... నేను మాల్య కానేకాదు ఏ లోను జల్ది రాదు నేను మాల్య కానేకాదు ఏ లోను జల్ది రాదు