Sat 14 Nov 15:57:20.98044 2015
Authorization
నన్ను అరెస్ట్ చేయండి!
వంశీ : నా భార్యను రెండో అంతస్తు నుంచి తోసేశాను. నన్ను జైల్లో పెట్టండి''...
పోలీస్ ఆఫీసర్: ఆమె చనిపోయిందా
వంశీ : లేదు. అందుకనే జైల్లో పెట్టమంటున్నాను
వెయిటింగ్ రూమెందుకు?
రామలింగం : ప్రతి రైలూ లేటుగా వస్తే ఈ పనికిమాలిన టైం టేబుల్ ఇక్కడెందుకు?
రైల్వే అధికారి : ప్రతి రైలూ కరెక్టు టైంకు వస్తే నీకు విశ్రాంతి తీసుకుంటున్న ఈ వెయింటింగ్ రూంలు ఎందుకు?
సీసీటీవీలు పనిచేస్తున్నాయా?
సిటీలో పోలీసులు ప్రజల రక్షణ కోసం ప్రముఖ కూడళ్లు, రహదారులు, సిటీ సెంటర్లలో సీసీటీవీలు పెట్టించారు. 24 గంటలు కంట్రోల్ రూమ్‌లో సిటీలో ఏం జరుగుతుందోనని పోలీసులు ఒక కంట కనిపెడుతుంటారు.
దీనినే అదునుగా తీసుకున్న ఒక సర్దార్.. పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి ఇలా అడుగుతాడు...
సర్దార్ : హెలో.. సార్ నాకు మీ సహాయం కావాలి. అందుకే ఫోన్ చేశాను.
కంట్రోల్ రూమ్ : ఆ చెప్పండి... మీకు ఎటువంటి సహాయం చేయగలం? మేమున్నది కూడా మీకు సహాయం చేయడానికే కదా!
సర్దార్ : అలా అయితే సరే... నాకొక చిన్న సందేహం.. మీ సీసీటీవీ కెమెరాలు నిజంగానే పనిచేస్తున్నాయా..?
కంట్రోల్ రూమ్ : అవునండి.. చాలా బాగా పనిచేస్తున్నాయి.
సర్దార్ : ఓహో.. అలా అయితే ఆ కెమెరాల నుంచి 5వ నెంబర్ రోడ్డు కనిపిస్తుందా?
కంట్రోల్ రూమ్ : ఆ కనిపిస్తోందండి.
సర్దార్ : 5వ నెంబర్ రోడ్డు వెనకాల వున్న కాలనీ కూడా కనిపిస్తోందా..?
కంట్రోల్ రూమ్ : అవునయ్యా కనిపిస్తోంది. ఇంతకి అక్కడ ఏమైందో చెప్పి చావు!
సర్దార్ : హీహీహీహీ.. అదేం లేదు సార్.. ఆ కాలనీలో వుండే రాజేష్ దుకాణం తెరిచి వుందో లేదో అడిగి తెలుసుకుందామని ఫోన్ చేశా..!
కేవలం 6 వారాలు
ఒకరోజు శంకర్ తన భార్యతో కలిసి బయటకు వెళ్తున్నాడు. దారిలో అతని స్నేహితుడ్ని పోలీసులు తీసుకెళ్ళే దృశ్యం కనిపించి అక్కడి వెళ్ళి ఇలా అడుగుతాడు...
శంకర్ : ఏమైంది? పోలీసులు నిన్ను ఎందుకు పట్టుకున్నారు?
స్నేహితుడు: నేను నా భార్యను చంపేశాను. అందుకే పోలీసులు పట్టుకున్నారు.
శంకర్ : ఏ శిక్ష విధించారు?
స్నేహితుడు: 6 వారాలు....
శంకర్: ఏంటి..? కేవలం 6 వారాలేనా..! ఈ మాట నాకు ముందే ఎందుకు చెప్పలేదు? (అంటూ ఫ్రెండ్ తో చెప్పి... ముందు, వెనకా చూసుకోకుండా దగ్గరలోనే వున్న పోలీసు నుంచి గన్ తీసుకుని తన భార్యను కూడా కాల్చి చంపేశాడు)
స్నేహితుడు: నీ...! ఎంతపని చేశావురా గాడిద.. వెధవ.. సన్యాసి.. తెలివితక్కువ దద్దమ్మా.. చెప్పేది పూర్తిగా వినకుండానే తొందరపడ్డావెందుకు? 6 వారాల తరువాత నాకు ఉరిశిక్ష విధిస్తారు.
టీవీ యాంకర్
కాంతం : మీ అమ్మాయి ఈ మధ్య అలా జుట్టు విరబోసుకుని తిరుగుతుందెందుకు?
శాంతం : అది టీవీ యాంకర్‌గా ట్రై చేస్తోందిలే వదినా..
వాషింగ్ మెషీన్
రాము: నా భార్యకి వాషింగ్ మిషన్ కావాలట.
సోము: అదష్టవంతుడివి. నేనే మా ఇంటిలో వాషింగ్ మిషన్‌ని.
సినిమా రోలు
వివేక్ : మొన్న రిలీజైన కొత్త సినిమాలో ఒకరోల్ వేశానన్నావు. ఫస్ట్‌డే - ఫస్ట్ షో చాలా జాగ్రత్తగా చూశాను. ఎక్కడా కనిపించలేదే?
సురేష్ : పిచ్చోడా! ఆ సినిమాలో హీరోయిన్ పెళ్లి సీన్‌లో పేరంటాళ్లు దంచిన పసుపు రోలు సెట్లో వేసిందెవరనుకున్నావు, నేనే!