Sat 07 May 19:14:16.726898 2016
Authorization
సారీ... క్షమించండి
వేగంగా పరుగెడుతున్న రవి ఒకాయన కాలు తొక్కేసాడు''
''క్షమించండి... చూసుకోలేదు'' అన్నాడు.
''ఆగవయ్యా... ఆగు... కళ్లుమూసుకుపోయి కాలు తొక్కిందిగాక క్షమించండి అంటావా? ముందు మర్యాదగా సారీ చెప్పు'' అన్నాడా వ్యక్తి.
భయం
విశ్వ : నాకు చీమలని చూస్తే భయమేస్తున్నది డాక్టర్..!
డాక్టర్ : అవునా.. అలా ఎప్పటి నుంచి అనిపిస్తోంది..!
విశ్వ : నాకు షుగర్ వుందని పరీక్షల్లో తేలినప్పటి నుంచి..!
టీచర్ కావాలంటే...
టీచర్: సోము.. నువ్వు పెద్ద అయిన తర్వాత ఏం కావాలని కోరుకుంటావు.?
సోము: నేను కూడా మీలాగే మంచి టీచర్ కావాలని ఉంది సార్.
టీచర్ : అయితే, టీచర్ కావాలంటే ఏం చేయాలి?
సోము: ఏముంది సార్... టీ లోకి చారు పోస్తే టీచరు అవుతారు కదా. అంతే.
నాయనమ్మ సాక్షిగా
ప్రతిమ : నన్నుపెళ్ళి చేసుకుంటానని ప్రమాణం చేయి ప్రదీప్.
ప్రదీప్ : మా నాయనమ్మ సాక్షిగా నిన్నుపెళ్ళి చేసుకుంటాను.
ప్రతిమ : ఎవరైనా తల్లిదండ్రులు సాక్షిగా ప్రమాణం చేస్తారు కానీ నువ్వు నాయనమ్మ సాక్షిగా ప్రమాణం చేస్తున్నావేం?
ప్రదీప్ : వాళ్ళింకా బతికే ఉన్నారుగా మరి. అందుకే.
పిసినారి
సుందర్ : అందరూ నన్ను పిసినారి అంటుంటారుగా, ఇప్పుడు చూసు మా ఆవిడ నా కంటే పిసినారని తేలింది.
సురేష్ : ఎందుకలా అంటున్నావు. ఏ విషయంలో తెలిసింది నీకీ విషయం.
సుందర్ : మాకు ఇద్దరు పిల్లలు కావాలని ముందర నుంచి అనుకుంటున్నాం. వాళ్లిద్దరినీ ఒకే కాన్పులో కనేసి నాకు ఆస్పత్రి ఖర్చులు మిగిల్చింది..!
పొదుపు
బ్యాంకులో క్లర్క్ : అదేంటి సార్ ! బ్యాంక్‌కి వచ్చి ఉత్తరం రాస్తున్నారు. ఏదైనా అర్జెంటా?
పిసినారి పాపయ్య : అబ్బే! ఇక్కడయితే రీఫిల్ ఖర్చు మిగులుతుందని..!
నిర్ణయం
సుందరి : ఎలాంటి భర్తని ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నావు..?
సరిత : భర్తని కాదు. పెళ్ళికాని కుర్రాడిని వివాహం చేసుకుందామను కుంటున్నాను..!
దొంగ - పోలీస్
దొంగ : మర్యాదగా అరవకుండా డబ్బులిచ్చెరు.
శరత్ : అరిస్తే ఏం చేస్తావ్?
దొంగ : దొంగా దొంగాని అరిస్తే పోలీసులొస్తారు... వారికి నువ్వే మామూళ్ళు ఇచ్చుకోవాల్సి వస్తుంది..!
మళ్ళీ రమ్మంటే ఎలా?
జడ్జి : ఆ డాక్టర్‌ని నువ్వు చంపడానికి కారణమేమిటి?
హంతకుడు : నేను అసలే నెల రోజుల నుంచి ఆ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని ఎంతో డబ్బు తగలేసి ఇంటికొస్తుంటే ''వెళ్ళిరండి''! అన్నాడు. అందుకే...
ఫీజు
మాస్టారు : పిల్లలూ! ఏకలవ్యుని జీవితం ద్వారా మీరు ఏం తెలుసుకున్నారు?
పిల్లలు : ఆ రోజుల్లో కూడా కరస్పాండెన్స్ కోర్సులున్నాయని, వాటికి వేలకి 'వేలు' ఫీజులు కట్టి చదివేవారని అర్ధమయింది సార్.