Sat 17 Sep 14:32:47.467419 2016
Authorization
రెండు విషయాలు
కొడుకు : నాన్నగారూ నేను డాక్టర్నయ్యాను.. నాకేదైనా సలహా ఇవ్వండి...
తండ్రి : తప్పకుండా.. డాక్టర్ అయ్యావుగా రెండు విషయాలు మాత్రం గుర్తుంచుకో. ప్రిస్కిప్షన్ అర్థం కాకుండా రాయి. బిల్లు మాత్రం అర్థం అయ్యేలా రాయి..!
కారణమదే!
సుమతి : నిన్నటి పాలల్లో నీళ్ళెందుకు రోజుటి కంటే ఎక్కువ కలిపావు?
పాలవాడు : ఎక్కువ నీళ్ళు కలిపానని ఎలా తెలుసమ్మా?
సుమతి : రోజూ రాత్రిపూట మా వాడు రెండుసార్లు పక్క తడిపేవాడు.. నిన్న ఐదు సార్లు తడిపాడు మరి!
అందుకే బాధ
సుందరి : నన్ను ప్రేమిస్తున్న సుందర్‌కి తీరని ద్రోహం చేస్తున్నానేమోననిపిస్తున్నది..!
రమ : అదేంటి? సుందర్‌తో పెళ్ళి జరగటం లేదా?
సుందరి : అదేం కాదు.. సుందర్‌తోనే నా పెళ్ళి నిశ్చయం అయ్యింది..!
ఇలాంటి అబద్ధమా
రాఘవ : వెయ్యి అబద్ధాలాడైనా ఓ పెళ్ళి చేయమన్నారు. కానీ పెళ్ళిళ్ళ పేరయ్య ఇలాంటి అబద్ధం చెప్తాడనుకోలేదు..!
రాజు : ఇంతకీ ఏం అబద్ధం చెప్పాడేంటి?
రాఘవ : అబ్బాయి ఏరో ప్లేనులో కండెక్టర్‌గా పనిచేస్తున్నాడని చెప్పాడు.
మంచి గిఫ్ట్
రఘు : మీ మ్యారేజి యానివర్సరీకి మీ భార్యకు ఏం కొనివ్వబోతున్నారు?
రాజేష్ : విడాకులు తీసుకుందామనుకుంటున్నాను..!
ఎంత కష్టమో...
జడ్జి : ఇలా దొంగతనాలు చేసి బతికే కంటే కష్టపడి బతకొచ్చుగా..?'' అడిగాడు
ముద్దాయి : అంటే.. నేను దొంగతనాలు చేయడానికి కష్టపడట్లేదనా మీ ఉద్దేశం జడ్జిగారూ.. దొంగతనం చేసేందుకు గోడలెక్కి, కన్నం వేసి... ఇంట్లో వాళ్ళు చూడకుండా ఇదంతా చేయాలంటే ఎంత కష్టమో మీకేం తెలుసు.
ఉపయోగపడే భాగాలు
టీచర్ : మానవ శరీరంలో అన్నిటికంటే ఎక్కువగా ఉపయోగించే భాగాలు ఏమిటి?
విద్యార్థి : మగవాళ్ళ మెదడు, ఆడవాళ్ళ నాలుక.
అందరిలాగా కాదు
తండ్రి : ఒరేరు.. చింటూ.. ఈ రోజు స్కూల్లో ఏం నేర్చుకున్నావురా?
కొడుకు : అందరి తల్లిదండ్రులు పాకెట్ మనీ ఇస్తారు గానీ.. నువ్వు ఇవ్వవని తెలుసుకున్నా నాన్న..!
ఎప్పుడు చెప్పాలంటే...
వినోద్ : ఒరే.. రాజేష్..! మీ ఆవిడ ఆరంతస్థుల భవనం మీద నుంచి దూకి చస్తానంటుంది రా..!
రాజేష్ : ఆ విషయం ఇప్పుడిటా చెప్పేది..? పూర్తిగా దూకేశాక చెప్పాలి గాని.
మళ్ళీ నువ్వేనా
భార్య : మీరు అస్తమానూ నన్నేం సాధించక్కరలేదు. నాలాంటి భార్య మీకు అసలు దొరకనే దొరకదు.
భర్త : మళ్ళీ నీలాంటి భార్యను పెళ్ళి చేసుకునే మూర్ఖుడెవడుంటాడులే.!
అయ్యో చిన్ని తండ్రి!
చిన్ని : చిన్నీ! ఈ రోజు స్కూల్?కి రాదండీ.
టీచర్ : ఇంతకీ ఎవరు మాట్లేడేది.
చిన్ని : నేనూ...! మా అమ్మను మాట్లాడుతున్నాను.
యథారాజా...
అటెండర్ : సార్...! నిన్న మధ్యాహ్నం మన గుమాస్తా సుబ్బారావు పనిమానేసి టేబుల్ మీద పడుకుని నిదురపోయాడండీ....!
మేనేజర్ : మరి వెంటనే నాకెందుకు చెప్పలేదు...?
అటెండర్ : చెబుదామనే వచ్చానుసార్....! ఆ సమయానికి మీరూ నిదురపోతున్నారు.
కోపం వస్తే అంతే...
సుందర్ : నా మీద కోపం వస్తే ఆ కోపాన్నిమా ఆవిడ బట్టలుతకడంలో చూపిస్తుంది..!
రాజు : అదెలా?
సుందర్ : కోపం లేకపోతే నేను బట్టలు విప్పాక ఉతుకుతుంది. కోపంగా ఉంటే బట్టలు విప్పకముందే ఉతుకుతుంది..!
పోలిక
టీచర్ : పిల్లలూ బడి దేవాలయం లాంటిది తెలుసా?
విద్యార్థి : మరి ప్రసాదం ఏది సార్!
అర్థం
టీచర్ : హరీ! ఉపకారం అంటే ఏమిటి?
విద్యార్థి : ఉప్పు కారం కలిపితే తయారయ్యే పదార్ధం ఉపకారం సార్!
క్లియర్‌గా చెప్పాలి
సుమన్ : రాధ వెంట పడితే పళ్ళు రాలగొడతానని చెప్పిందిగా, మళ్లీ ఎందుకు వెంటపడుతున్నావ్‌రా?
సిద్ధార్థ : పై పళ్ళో.. కింది పళ్ళో... సరిగ్గా చెప్పలేదు కాబట్టి వెంటబడుతున్నానంతే
ఇలా అర్థమయ్యిందా?
భర్త : కష్టసుఖాలను ఇద్దం సరిసమానంగా పంచుకుంటూ మన సంసార జీవితాన్ని సుఖంగా సాగించాలి..!
భార్య : అలాగేనండి.. మీరు కష్టాలు నేను సుఖాలు పంచుకుని హాయిగా జీవిద్దాం.. సరేనా..!
అచ్చ తెలుగు
పెద్దాయన : బాబూ! ఈ ఊళ్ళో పొగబండి నిలయం ఎక్కడో చెబుతావా?
రాము : పొగబండి నిలయమా...?
పెద్దాయన : అదేంబాబూ అర్థం కాలేదా? రైల్వేస్టేషన్.
రాము : రైల్వేస్టేషనా....? అలాగని ముందే తెలుగులో చెప్పొచ్చుగా.
ఎవర్ని నమ్మాలి?
భార్య : మీ మగాళ్లు ఏ మాటనైనా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు.. మిమ్మల్ని నమ్మకూడదు బాబూ...!
భర్త : మీ ఆడవాళ్లు మాత్రం రెండు చెవులతో విని నోటినుంచి వదిలేస్తారు కదా.. మిమ్మల్ని మాత్రం నమ్మొచ్చా..?!
జీవితం ఇవ్వాలంటే
జడ్జి : ఆ అమ్మాయి తల్లిదండ్రులను ఎందుకు చంపావు..?
రాంబాబు : ఓ అనాధకు జీవితాన్నివ్వాలనే అలా చేశాను తప్ప నాకు మరో ఉద్దేశం లేదు సార్..!
జీవితాంతం ప్రేమంటే
మనోజ్ : జీవితాంతం ప్రేమించాలని చెప్పిన నువ్వు, ఇప్పుడు నన్నింత మోసం చేస్తావని అనుకోలేదు సుమా..!
సుమ : మోసమా.. నేనేం చేశాను?
మనోజ్ : నీ మాటమీద గౌరవంతో నాలుగేళ్లనుంచి ప్రేమిస్తున్న నన్ను... పెళ్ళి చేసుకుందాం అని అడుగుతున్నావు.. ఇది మోసం కాదా...?!
ఒకే మాట
సుబ్బారావు : మన పెళ్ళి అయ్యి పదేళ్ళు అవుతున్నా ఒకదానిపైనైనా ఒకేమాట మీద ఉన్నామా?
సుందరి : అదో మళ్ళీ... మన పెళ్ళయ్యి పదేళ్ళు కాదు పదకొండు సంవత్సరాలు అవుతోంది.
మాట విన్నది
ఆనందరావు : మొట్టమొదటిసారిగా నా భార్య నేను చెప్పిన మాట వెంటనే విన్నదోరు..!'' ఆనందంగా చెప్పాడు
సుందరరావు : ఏం చెప్పావ్..?
ఆనందరావు : మొన్న మా ఇల్లు నిప్పంటుకుంటే... ఇంట్లోంచి బయటికి వచ్చేయమన్నాను, అంతే.. చెప్పి చెప్పగానే వచ్చేసింది..!
ఉద్యోగం ఎవరికి?
విష్ణు :ఎందుకురా దిగులుగా ఉన్నావ్?
కష్ణ : మా నాన్నగారు ఉద్యోగం కోసం బాగా వెతుకుతున్నారు
రిటైర్ అయ్యాక కూడా ఖాళీగా ఉండకూడదన్న ఆయన మనస్తత్వం మెచ్చుకోవాలి గానీ దిగులెందుకు?
కష్ణ :
విష్ణు : ఉద్యోగం వెతకడం ఆయన కోసం కాదురా..! నా కోసం.
కవిత కాదు కపిత
టీచర్ : చింటూ చక్కని కవితొకటి చెప్పు.
చింటూ : అమ్మ కొడితే తెల్లబల్లి... నాన్న కొడితే నల్లబల్లి... నేను కొడితే బాహుబలి...
టీచర్ : నేను కొడితే నీ నడుము బలి.. కూర్చోవోరు బడుద్ధారు.
జ్యోతిష్యం ప్రకారమే
జ్యోతిష్యుడు : డబ్బులివ్వకుండా అలా వెళ్లిపోతున్నావేంటి?
సుబ్బారావు : ఈ సంవత్సరంలో నేను ఎలుకకి కూడా భిక్షం పెట్టనని మీరే కదా చెప్పారు..!
సంగీతం కాదు
గిరి : ఆయనో మంచి గాయకుడు. రాగాలు బాగా తీస్తాడు. ఎప్పుడైనా విన్నావా..?
హరి : అబ్బా... అంత బాగా రాగం తీస్తాడా... ఏం రాగం మోహనమా, కళ్యాణీనా...!
గిరి : కూనిరాగం బాగా తీస్తాడు.
పరామర్శ ఎందుకంటే
శివ : ఏమిట్రా నిమిష-నిమిషానికీ వచ్చి బాగున్నావా అని అడుగుతున్నావు?
రాము : మన దేశంలో సగటున నిమిషానికొకడు పోతున్నాడట! అందుకే.
వ్యాపారం కోసం
రామారావు : ఏంటి బావా! ఈ మధ్య నీవు ఇంట్లోనే బోరింగ్ పంపు వేయించుకున్నావటగా.
సుబ్బారావు : అవును బావా! పాలవ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాం
భలే తెలివి
యాజమాని : ఈ ఊరులోకెళ్లా తెలివైన బిజినెస్ మాగేట్ పేరు చేబితే నీకీ ఉద్యోగం ఇస్తాను.
ఇంటర్వ్యూ అభ్యర్థి : అలాగే సార్. మీ పేరేమిటో కాస్త చెబుతారా?
పాఠం ప్రభావం
చింటూ : నాకు చీమలని చూస్తే భయమేస్తున్నది డాక్టర్..!
డాక్టర్ : అవునా.. అలా ఎప్పటి నుంచి అనిపిస్తోంది?
చింటూ : చీమలు కష్టజీవులు, వాటిని చూసి ఎంతో నేర్చుకోవాలి అని స్కూల్లో టీచర్ పాఠం చెప్పినప్పటి నుండి!