Sun 14 Jun 00:01:46.780283 2015
Authorization
అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉంటుంది. అది అన్ని జంతువుల్ని తినేస్తుంది. ఒక రోజు గుర్రాన్ని తినడానికి దాని వెంట సింహం పడుతుంది. గుర్రం పరిగెడుతుంటే ఏనుగు ఎదురయ్యి ఎందుకు పరిగెడుతున్నావని అడిగింది. నన్ను తింటానికి సింహం వెంటపడుతుంటే ప్రాణాల్ని రక్షించుకోడానికి పరిగెత్తుతున్నాను అని చెప్పింది. అప్పుడు ఏనుగు ఈ సింహం బారినుండి ఈ అడవిలో మనందరి ప్రాణాలు రక్షించుకోడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది, నాతో పాటు పరుగెత్తు అని చెప్పింది. ఏనుగు చెప్పినట్టే గుర్రం ఏనుగుతో పాటు వెనక్కి తిరిగి పరిగెత్తింది. రెండూ కలిసి సింహానికి ఎదురుగా వెళాయి. సింహం వీటిని చూసి ఎందుకు పరుగెత్తున్నారు అని అడిగింది. దానికి ఏనుగు తర్వాత చెప్తాను ముందు నువ్వు కూడా త్వరగా పరుగెత్తు, వెనక అడవి దయ్యం వెంటబడుతుంది. దొరికిన దాన్ని దొరికినట్టు తినేస్తోంది అని చెప్పింది. ఈ మూడూ పరిగెత్తీ పరిగెత్తీ ఒక గోడ దగ్గరికి చేరాయి. అప్పుడు ఏనుగు ఈ గోడ దూకి అవతలకి వెళ్తే అక్కడ మనకిక అడవి దయ్యం భయం ఉండదు. అక్కడికి ఈ అడవి దయ్య రాలేదు. అందుకే నువ్వు నిలబడు నేను దూకుతా అని గుర్రానికి, సింహానికి చెప్పింది. కాదు నేనే ముందు దూకుతా నువ్వే నిలబడు అని ఏనుగుతో గుర్రం అంది. ఇలా ఈ రెండూ వాదించుకుంటుంటే... సింహం కాదు నేనే ముందు దూకుతా మీరిద్దరూ నించోండి అని అంది. సరేనని ఏగును, దానిమీద గుర్రం నిలబడ్డాయి. ఈ రెండింటి మీద ఎక్కి సింహం గోడ అవతలకి దూకింది. ఆ గోడవతల పెద్ద బాయి ఉందని తెలియని సింహం ఆ బాయిలో పడి చనిపోయింది. ఆ అడవి జంతువులకు సింహం బాధ తప్పింది.