Sat 19 Nov 15:41:21.130806 2016
Authorization
ఓ సినిమా
ఎటువైపు నీ పయనం
మూకీ నుండి స్కోప్ దాకా ఎదిగినా
కదిలించేవి కానరాట్లే
మాభూమి సినిమా కి
కట్టిన బండెనక బండ్లు
ఊరుమ్మడి బతుకులు
ఊసురోమంటున్నాయి
వ్యాపార సినిమాలో
తీర్పు మార్పు నిమజ్జనమై
ఆ భాషా ఈ బాషా చిత్రాల
కాపీ క్లిప్పింగుల చిత్రాలకే
అవార్డులు రివార్డులు
కథ కథనం కంచికి
సమాజం కుటుంబం
సంస్కృతి విచ్చిన్నం
నోట్ల కట్టలతో
పాత్రధారుల కొనుగోలు
హాళ్ల లీజులు
మంచి సినిమా
తీయాలనుకునే వారికి వణుకు
రంగుల కలల్లో
దాసీ బతుకుల చిత్రణ మరిచిపోతున్నాం
ఇతివృత్తాల ఎంపికలో
ఎన్నదగినవే లేవు
సమాజకోణంలో చూసే వారు
సినీలోకంలో
దుర్భిణీ తో వెతికినా కనబడట్లే
తెల్లమల్లెలు నలిగిపోతున్నాయే గాని
ఎర్రమల్లెలు పూయట్లే
ఛాందస శంఖాలు ఊదుతున్నారే కానీ
విప్లవశంఖాలు పూరించట్లే
నెర్రెలు బారిన నేలలో
ఎర్రమట్టిని చీల్చుకుని
ఎర్రసైన్యం ఉదయించట్లే
ప్రజాబాహుళ్యంలో
చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా ఛిద్రమై
కొందరి చేతుల్లో బందీయై
విలవిలలాడుతోంది
- గిరి ప్రసాద్ చెలమల్లు, 9493388201