Sat 03 Dec 15:42:52.500147 2016
Authorization
విరుద్ధ భావాల్ని
వివిధ ఆలోచనా తరంగాల్ని
నిరోధించే సంకుచితత్వానికి
విరామం ప్రకటిద్దాం
పూదోటలో
విభిన్న ఆకారాల్తో
చెట్ల కొమ్ములూ ఆకులూ
ఎన్నో రంగుల సువాసనల పుప్పొళ్ళతో
భిన్న రుచుల ఫలరాజాల్ని అందిస్తాయి
భిన్న అభిరుచుల్తో విహరించే పర్యాటకులు
ఆ సోయగాల్ని సొగసుల్ని ఆస్వాదిస్తారు
మన సమాజంలో సైతం
అలాగే అర్థవంతమైన చర్చకు
తలుపులు తెరుద్దాం
అందర్నీ మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం
భావప్రకటన స్వేచ్ఛ
హద్దు మీరనంత కాలం అనుమతించాల్సిందే
గుడ్డి ఛాందస తిరోగమనవాదం
ఇక తోకముడిచి జారుకోవాల్సిందే...
మన చుట్టూరా ఇరుగుపొరుగూ
జీవన వైవిధ్యం అంతటా
భిన్నత్వపు రుచుల్ని ఏరికోరి
ఆరగించడంలోనే వొదిగి ఉంది!
- డా||దామెర రాములు, 09866422494