Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • నేడు కాళేశ్వరంను సందర్శించనున్న ఆర్థిక సంఘం
  • జయరాం హత్యకేసులో మరో పోలీసు అధికారిపై వేటు
  • రష్యాలో కుప్పకూలిన యూనివర్సిటీ భవనం
  • ఉస్మానియా ఆస్పత్రిని పునర్నిర్మించాలని హైకోర్టులో పిల్‌
  • జయరాం కేసులో కొనసాగుతున్న విచారణ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
లింగ లింగ లింగో... | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కవర్ స్టోరీ
  • ➲
  • స్టోరి

లింగ లింగ లింగో...

Sat 11 Feb 15:54:59.007751 2017

యాదవ వంశీకుల ఆరాధ్య దైవం లింగమంతుల స్వామి. ఆయన కొలువుదీరిన గుట్టనే గొల్లగట్టు అని వ్యవహరిస్తున్నారు. ప్రతి రెండేండ్లకు ఇక్కడ జరిగే జాతరకు గొల్లగట్టు జాతర, దురాజ్‌పల్లి జాతర, లింగమంతుల జాతరని రకరకాలుగా పిలుస్తారు. వరంగల్‌ జిల్లాలోని సమ్మక-సారక్క జాతర తర్వాత అతి పెద్ద జాతర దురాజ్‌పల్లి జాతరే. హైదరాబాద్‌-విజయవాడ 65వ జాతీయ రహదారి వెంబడి సూర్యాపేట జిల్లా కేంద్రానికి 6 కిలో మీటర్ల దూరంలో చివ్వెంల మండలంలోని దురాజ్‌పల్లి గుట్టపై లింగమంతుల స్వామి, చౌడమ్మ, ఎలమంచమ్మ దేవాలయాలున్నాయి. ప్రతి రెండేడ్లకోమారు జరిగే ఈ జాతరకు ఐదారు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. గజ్జల లాగు, కాళ్లకు గజ్జలు ధరించి లింగ లింగ లింగా.. ఓ లింగా.. అంటూ, డోలు వాయిస్తూ, లయబద్ధంగా చిందులు వేస్తూ వచ్చే భక్తులను చూస్తే తనువంతా ఉద్రేకంతో ఊగిపోతుంది. ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జాతర విశేషాలు ఈవారం కవర్‌ స్టోరీగా..
విభిన్న సంస్కృతుల సమ్మేళనానికి లింగమంతుల (పెద్దగట్ట) జాతర నిదర్శనంగా నిలుస్తుంది. జాతర పుట్టుక గురించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. దురాజ్‌పల్లి సమీపంలోని కేసారం గ్రామానికి చెందిన గొర్ల లింగమరెడ్డి నరసింహారెడ్డి అనే అసామికి లింగమంతులు కలలో కనిపించి దురాజ్‌పల్లి గుట్టవద్ద బావిలో తవ్వితే తన విగ్రహం బయటపడుతుందని, ఆ విగ్రహాన్ని వెలికితీసి పూజలు జరిపి తమకు మేకపోతులు బలి ఇవ్వాల్సిందిగా కోరాడని పూర్వీకులు చెబుతారు. ప్రతి రెండేడ్లకోసారి జాతర చేసి మేకలు, గొర్రెల్ని బలివ్వమని కోరినందున లింగమరెడ్డి మరుసటి రోజు బావిని తవ్వించగా విగ్రహం బయటపడింది. అప్పటి నుంచి జాతర జరుపుతూ వస్తున్నారు. అట్లాగే మరో కథ ప్రచారంలో ఉంది. యాదవ కులంలో జన్మించిన లింగమంతులు గుర్రంపై మేకలు, గొర్రెల్ని కాసేవాడని, త్రిశూలాన్ని ఆయుధంగా ధరించి మేకల్ని తినేందుకు వచ్చే అడవి జంతువుల బారి నుంచి వాటిని కాపాడేవారని చెబుతారు. ఒక రోజు దురాజ్‌పల్లి వద్ద అడవి జంతువులను వేటాడేందుకు వెళ్లి ఆ గుట్టమీదనే అదృశ్యమైనాడని, అక్కడే నేటి గర్భగుడి ఉందని ప్రచారం. లింగమంతుల స్వామి అంటే పరమేశ్వరుడని కనుక అక్కడ జంతువులను బలివ్వకుండా అక్కడే వెలసిన చౌడమ్మ, ఎలమంచమ్మ అనే దేవతలకు జంతుబలిని నైవేద్యంగా సమర్పిస్తారని చెబుతారు. యాదవులు సాధారణంగా శ్రీ కృష్ణుణ్ణి పూజిస్తారు. ఇక్కడ శివుణ్ణి కూడా ఆరాధ్యదైవంగా భావిస్తున్నందున ఆ కోణంలోను పరిశోధనలు జరుగుతున్నాయి.
యాదవ వంశీకుల విశ్వాసం ఇలా
లింగమంతుల జాతర సుమారు 150 ఏళ్లుగా జరుగుతున్నట్లు చెబుతారు. మున్నవారు. మెంతబోయినవారి వంశీకులుగా చెప్పబడుతున్న ప్రస్తుత ఆలయ పూజారి మున్న కృష్ణయ్య, మున్న లింగయ్య, తండు రామచంద్రయ్య, లింగమంతులస్వామి, చౌడమ్మల గురించి తమ పూర్వీకులు చెప్పిన సంగతుల్ని పేర్కొన్నారు. ఉండ్రుగొండ పెద్దగుట్టలో ఉన్న శివాలయంలోని లింగమంతుల స్వామికి పూజ చేయడానికి ఓ గర్భిణీ గంపనెత్తుకుని కొండపైకి వెళ్లింది. నిండు చూలాలు కావడంతో పైకి ఎక్కలేక జారి కింద పడి తీవ్ర రక్తస్రావం జరిగి మృతి చెందిందంట. ఆమె భర్త తన భార్య మరణాన్ని తట్టుకోలేక ''ఇలవేల్పుగా కొలుస్తున్న దేవుడు మాకేం చేశాడు. పూజలు, పునస్కారాలు చేసినా ఏం ఫలితం దక్కింది. పూజలు చేసేందుకు వెళ్లిన భార్య చనిపోయింది. మేం ఇంకెందుకు దేవుళ్లను కొలవాలి..'' అంటూ ఆవేదనకు గురై శివాలయంలో ఉన్న లింగమంతులు, మాణిక్యమ్మ, ఆకుమంచమ్మల విగ్రహాలను పెద్దగుట్ట పక్కన ఉన్న బావిలో పడేశాడంట. కొన్ని రోజుల తర్వాత బావుల్లో పూడిక తీసేందుకు వడ్డెరలు అక్కడికి వెళ్లారు. పనిలోకి దిగిన వడ్డెరలు గడ్డపారతో గట్టిగా పొడవడంతో లింగమంతుల విగ్రహం తలకు గుచ్చుకుని రక్తం విరజిమ్మిందంట. బావి అంత రక్త మండలంగా మారింది. దీంతో బావిలో ఏదో మహిమ ఉందని భయపడిన వడ్డెరలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కొన్నాళ్ల తర్వాత మున్న, మెంతెనబోయిన (యాదవ వంశీకులు) గొర్లవారు (రెడ్ల వంశీకులు) గొర్లజీవాలను మేపుకుంటూ ఎండలకు అలసిపోయి పెద్దగుట్ట పక్కన ఉన్న ఓ చెట్టు కింద నిద్రిస్తూ ఉంటారు. అందులోని ఓ వ్యక్తికి కల వస్తుంది. ఆ కలలో 'మేము బావిలో ఉన్నాం, మమ్ముల్ని తీసి పాల చర్లయ్య గుట్ట (దురాజ్‌పల్లిగుట్ట) పైన పెట్టి కొలవమని దేవుడు ప్రత్యక్షమై చెప్పిండంట. అతను తన కల గురించి తోటి వాళ్లకు చెప్పడంతో వాళ్లంతా వెళ్లి బావిలో చూశారు. దేవుళ్ల విగ్రహాలు నీళ్లల్లో తేలి ఆడుతుండడం గమనించి వాళ్ల వద్ద ఉన్న గొంగలి చాచి విగ్రహాలను బయటికి తీసి పాలచర్లయ్య గుట్ట (దురాజ్‌పల్లి గుట్ట)పైకి తెచ్చి పెట్టారు. తర్వాత రాళ్లతో గుడి మాదిరిగా కట్టారు. బండల్ని పెట్టి గోపురం కట్టారు. గొర్రెల పెంపకందార్లు కావడంతో గొర్రెపాలు పిండి, బియ్యంతో నైవేద్యం వండి పెట్టి దేవళ్లకు పూజలు చేశారు. కాల క్రమంగా గుట్టపైన వెలసిన దేవుళ్లకు చౌడమ్మ, లింగమంతులస్వామికి వేర్వేరు విగ్రహాలు పెట్టి గుళ్లను పక్క పక్కన నిర్మించి జాతర చేస్తున్నట్లు పేర్కొన్నారు.
జన జాతర తీరు
దిష్టిపూజ, జంతుబలి, చంద్రపటం, నెలవారం.. జాతరలో చెప్పుకోదగిన ముఖ్య ఘట్టాలు. జనవరిలో వచ్చే అమావాస్య (సోమవారం) రోజున జాతర తలపెడతారు. దిష్టిపూజ ఘట్టంతో జాతర ఆరంభమవుతుంది. సరిగ్గా 15 రోజుల తర్వాత.. ఐదు రోజుల పాటు జాతర ఉధృతంగా సాగుతుంది.
దిష్టిపూజ కార్యక్రమం
పెద్దగట్టు జాతర యాదవ వంశీకుల ఆచారాల ప్రకారం నిర్వహిస్తూ వస్తున్నారు. జాతర పుట్టు పూర్వోత్తరాల గురించి యాదవ పూర్వీకులు చెప్పిన వివరాల ప్రకారం... మున్న, మెంతబోయిన, గొల్లవార గోత్రాలకు చెందిన వారు ఈ జాతర చేస్తూ వస్తున్నారు. ఈ మూడు గోత్రాల వాళ్లు కలిసి దిష్టిపూజ క్రతువు పూర్తి చేస్తారు. దిష్టిపూజ రోజున మూడు గోత్రాల వాళ్లు కలిసి గుడి వద్ద రెండు బోనాలు పెడతారు. ఐదు తవ్వల బియ్యంలో పసుపు వేసి బోనం వండుతారు. గుడిలో ఉన్న విగ్రహాలకు స్నానాలు చేయించి శుభ్రం చేస్తారు. అనంతరం స్వచ్ఛమైన నెయ్యితో విగ్రహాలను శుద్ది చేసి దేవతలను పసుపు, కుంకుమలతో అలంకరిస్తారు. వండిన బోనాలను పెట్టిన తర్వాత పడిలో కొంత భాగాన్ని తీసి పాలు, నెయ్యి, పెరుగు పోసి పిసుకుతారు. దానిలో గుంట చేసి నెయ్యి పోసి రెండు ముద్దలుగా చేస్తారు.
మున్నవారు (రాజు) లింగమంతులస్వామి కాడ పూజలు చేస్తారు. మెంతెనబోయినవారు (పూజర్లు) చౌడమ్మ వద్ద పూజలు చేస్తారు. తర్వాత గొర్లవారికి పెరుగు ముద్ద; మున్నవారు, మెంతెనబోయినవారికి జ్యోతి ముద్దల్ని ఇస్తారు. ఆ ముద్దల్ని ప్రసాదంగా పంచుకుని తింటారు. చౌడమ్మకు గొర్రెపోతును బలిస్తారు. బోనం పడిలో రక్తం ముద్దలు కలిపి గుడి చుట్టూ తిరిగి బలి చల్లుకుంటారు. బలి క్రతువు పూర్తవ్వగానే మూడు గోత్రాలకు చెందిన వాళ్లు లింగమంతులస్వామి, చౌడమ్మ గుళ్ల వెనకవైపున మౌనంగా కూర్చుకుంటారు. ఆ సమయంలో పెద్దగుట్ట (ఉండ్రుగొండ) నుంచి పారచర్లయ్య గుట్ట (దురాజ్‌పల్లి)పైకి లింగమంతుల స్వామి గజ్జెలలాగు తొడుక్కుని గణగణ శబ్దంతో వస్తాడట. అలా వస్తున్నట్లు శబ్దం వినిపించగానే భక్తులు ఓ లింగా..! ఓ లింగా..! అంటూ దేవున్ని తలుస్తారు. అలా దేవుడి రాక శబ్దం వినిపించిన భక్తులు రాబోయే కాలంలో జరిగే ఘటనల్ని ముందే సోది చెప్పేవారని, అది తూచా తప్పక జరిగేదని పూర్వీకుల విశ్వాసం.
ప్రధాన జారత
దిష్టిపూజ కార్యక్రమం ముగిసిన తర్వాత 15 రోజులకు.. సోమవారం తిరుమలగిరికి చెందిన మున్నవారి బద్దెగొర్రె, కేసారంకు చెందిన మెంతెనబోయినవారి వదరగొర్రె, గొర్లవారి తొలిగొర్రెల్ని బలిస్తారు. ఒకే సారి మూడు గొర్రెల్ని తీసుకెళ్లి పోతరాజు ఎదుట బలి ఇస్తారు. బద్దెగొర్రెను కోసి అవయవాలను తీసి బియ్యం కలిపి అక్కడే వండుతారు. ఉడికిన అన్నంలో పెరుగు, నెయ్యి పోసి దాన్ని కోనేరు పక్కన బండమీద పోస్తారు. జాగిలాలుగా మెంతెనబోయిన వారు మోకాళ్ల మీద వంగి భౌ భౌ అంటూ ఆ ప్రసాదాన్ని తినేందుకు ప్రయత్నిస్తారు. మున్నవారు జాగిలాల మెడకు కండువకప్పి అపేందుకు ప్రయత్నిస్తారు.
మంగళవారం చంద్రపటం వేస్తారు. గుడి ముందు భాగాన తెల్లగుడ్డ పరుస్తారు. దానిపై బియ్యంతో రాసి పోస్తారు. పచ్చ, తెలుపు పిండితో పటం వేసి నాలుగు మూలల పోలు ముంతలు పెడతారు. యాదవుల దేవుళ్లకు పండుగలు చేసే బైకాండ్లు అనిపిలిచే పూజారులు ఉంటారు. వీరు కూడా యాదవులే. వీరు లింగమంతుల స్వామి, చౌడమ్మ కథలు కూడా చెబుతారు. మున్నవారికి కంకణాలు కట్టడం, మెంతెనబోయిన వారికి బొట్టుపెట్టడం సాంప్రదాయంగా బావిస్తారు. పటం ఎత్తి ఆ పిండిని గుడి పక్కన ఉన్న పుట్టలో పోస్తారు. బుధవారం నెవారం చేస్తారు. చిన్న భోజనం వండి దేవుడికి నైవేద్యం పెడతారు. రాజు, పూజర్లుగా పిలువబడే వాళ్లకు బైకాండ్లు బొట్టుపెట్టి కంకణాలు కడతారు. మళ్లీ దేవుడి గురించి కథలు చెబుతారు. చివరిగా గొర్రెపొటేల్‌ను నెలవారం రోజున పోతరాజుకు బలి ఇవ్వడంతో జాతర ముగుస్తుంది.
దేవరపెట్టె
యాదవుల దేవుళ్ల జాతరలో దేవరపెట్టే ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుందని చెబుతుంటారు. పెద్దగట్టు జాతరకు దేవరపెట్టెను తీసుకొచ్చే సాంప్రదాయముంది. 'దేవరపెట్టె'లో గంగమ్మ, చౌడమ్మ, కొమరమ్మ, లింగమంతులు, సింహాద్రీ, పెద్దిరాజు, పోలురాజు, ఐతన్న, హుమన్న యాదవరాజులు, దేవుళ్ల విగ్రహాలుంటాయి. చెక్కలతో చేసిన ఆ విగ్రహాలతో పాటు యాదవ రాజులకు సేనలుగా ఉన్న జెట్టీలు, జాగిలాలు బొమ్మలు కూడా ఉంటాయి. ఈ విగ్రహాలను పెట్టే పెద్దగట్టు జాతర చేస్తారు. దేవరపెట్టెను పూర్వం వరంగల్‌ జిల్లా పోలెపల్లి, చిట్టాయిపాలెం, నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండలంలోని వెంపటి నుంచి తీసుకొచ్చేది. మూడు చోట్ల నుంచి దురాజ్‌పల్లి జాతరకు దేవరపెట్టెలు వచ్చేది. ఆ తర్వాత బైకాండ్లు ఊర్లను తెగల కింద పంచుకోవడంతో వరంగల్‌ జిల్లాలోని చిట్టాయిపాలెం బైకాండ్లకు దురాజ్‌పల్లి జాతర వచ్చింది. అప్పటి నుంచి దేవరపెట్టెను చిట్టాయిపాలెం నుంచి తీసుకువస్తున్నారు. దిష్టిపూజకు ఒక రోజు ముందు చిట్టాయిపాలెం నుంచి దేవరపెట్టెను కేసారం తీసుకొస్తారు. ఆ ఊరిలోని మెంతెనబోయిన వారి దేవర ఇంట్లో (ప్రస్తుతం మండపం) పెట్టి పూజ రోజున గుట్టపైకి చప్పుళ్లతో తీసుకొస్తారు. దిష్టిపూజ పూర్తవ్వగానే మళ్లీ కేసారం తీసుకెళ్తారు. జాతర ముందు రోజు ఆదివారం రాత్రి ఒంటి గంట సమయంలో పెద్దగట్టుకు తీసుకొస్తారు. జాతర ముగిసిన తర్వాత చిట్టాయిపాలెం తీసుకెళ్తారు.
ఆనవాయితీగా జంతు బలి
లింగమంతుల జాతర సందర్భంగా సుమారు 50 వేల మేకలు, గొర్రెల్ని బలి ఇస్తారు. ఆపదలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడి కోరిన కోర్కెల్ని తీర్చినందుకు కృతజ్ఞతా సూచకంగా భక్తులు ఈ జంతుబలిని నిరాటంకంగా చేస్తూ వస్తున్నారు. పసుపు, కుంకుమ, పూలదండలతో అలంకరించిన మేక, గొర్రెపోతులను గుడి చుట్టూ ప్రదక్షణ చేసి బలిస్తారు. జాతర పూర్తి చేసుకుని వెళ్లిన మరుక్షణమే మళ్లీ వచ్చే జాతర కొరకు దేవుని పేరు మీద గొర్రెలు, మేకలను వదులుతారు. ఈ జాతరకు వచ్చి బలి అర్పిస్తే తమ కోరికలు తీరుతాయని గట్టి నమ్మకం. అందుకే లక్షల మంది భక్తులు హాజరై వేల సంఖ్యలో జంతుబలి చేస్తారు. జాతరకు వచ్చే ప్రతి ఎడ్లబండిలో, జీపులో, ట్రాక్టర్‌లో, లారీలో దేవునికి బలిచ్చే మేక కాని గొర్రెకాని ఉంటుంది. జాతరకు వచ్చే భక్తులు తమ స్నేహితులు, బంధువులతో కలిసి వస్తున్నందున ఒక్కో కుటుంబం రెండు మూడు యాటల్ని కూడా బలి ఇస్తారు.
కోరిన కోర్కెలు తీరుతయ్యని...
యాదవులు తమ సాంప్రదాయసిద్దమైన దుస్తులు ధరించి త్రిశూలం, ఈటెలు, బరిసెలు, కాళ్లకు గజ్జెలు ధరించి చప్పుళ్లతో చిందులు, తప్పట్లతో శివాల్లూగుతూ లింగా ఓ లింగా.. అంటూ గుట్ట వద్దకు చేరుకుంటారు. బియ్యం, చక్కెర, నెయ్యి, పాలు, సుగంధద్రవ్యాలుతో కొత్త కుండలో తయారు చేసిన నైవేద్యాన్ని, బోనాలను అలంకరించి గుండం, దీపం వెలిగిస్తారు. బోనం ఎత్తినవారిపై కొప్పెర గొడుగు ఏర్పాటు చేసి గుడి శిఖరంపై చల్లి ధూపదీప నైవేద్యాలు అందిస్తారు. లింగమంతులస్వామికి మొక్కుబడులు చెల్లించేందుకు పిల్లల నుంచి వృద్దుల వరకు మహిళలు సైతం తల నీలాలు సమర్పిస్తారు. సంతానం లేని స్త్రీలు ఆలయం పక్కనే ఉన్న కొలనులో స్నానం చేసి తడి బట్టలతో గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సంతానం కల్గుతుందని నమ్మకం. ఆలయం పక్కనే ఉన్న నారింజ చెట్టు, చౌడమ్మగుడికి ఉత్తరాన ఉన్న నాగరాజు పుట్టకు కూడా భక్తులు పూజలు చేస్తారు. పసిబిడ్డ మొదలు కురువృద్ధుల వరకు తలనీలాలు సమర్పించుకుంటారు. మూడు కత్తెర వెంట్రుకల్ని రూపాయి నాణెంతో జోడించి నాగదేవత పుట్టపై పెట్టి మొక్కులు చెల్లిస్తారు. తమ కోర్కెలు తీరితే బడికుండ త్రిశూలం, గంట తెస్తానని మొక్కుకుంటారు. సంతానం కోసం ఎదురు చూసేవారు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడే మహిళలు దేవుని నామం స్మరిస్తూ కొలనులో స్నానం చేసి తడి బట్టలతో గుడి చుట్టూ పానసారం చేస్తూ పొర్లు దండాలు పెడితే సంతానం కలుగుతుందని నమ్ముతారు. యాదవులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఈ జాతరకు వచ్చి తమ కోర్కెలు విన్నవించుకుంటారు. రెండేండ్ల తర్వాత జరిగే మలి జాతరలో తమ మొక్కులను కోర్కెలు తీరినందుకు గాను చెల్లిస్తారు. అక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు తిరుగు ప్రయాణంలో టేకుమట్ల బ్రిడ్జి సమీపంలోని గంగమ్మదేవి వద్ద పూజలు చేస్తుంటారు.
జాతర మన సంస్కృతికి ప్రతీక. సమిష్టి జీవనానికి పట్టుగొమ్మ. తాత్కాలికంగానైనా కష్టాలను మరచి ఒక చోట చేరి ఆనందంగా గడపడానికి సామాన్యులకు వచ్చే ఓ చక్కని అవకాశం. ఆ అవకాశాన్ని ప్రభుత్వాలు తమ బొక్కసాలను నింపుకోవడానికి వ్యాపారీకరిస్తున్నాయి. గ్రామ దేవతలను బ్రాహ్మణీకరించి, అనేక పేర్లతో ప్రత్యేక పూజలు ప్రవేశపెడుతున్నాయి. ఇప్పటికే శ్రీశైల చెంచు మల్లన్నను సక్సెస్‌ఫుల్‌గా వైదిక దేవతల్లో కలిపివేసి ఆదాయాన్ని పెంచింది ప్రభుత్వం. ఆకారమే లేని వనదేవతలు సమ్మక్క-సారలమ్మల విగ్రహాలను బంగారంతో తయారు చేయించి, రెండేండ్లకు ఒకసారి జరిగే మేడారం జాతరను ప్రతి ఏడాది చేయించి ఖజానా నింపుకునే ప్రయత్నాల్లో ఉంది ప్రభుత్వం. తెలంగాణలో అతిపెద్ద జాతర్లలో రెండోదైన గొల్లగట్టు జాతరను పక్కతోవకు మళ్లించకుండాచూడాల్సిన బాధ్యత మన జానపదులదే!
జాతర రోజుల్లో తప్పితే...
ఐదారు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది భక్తులు వచ్చిపోయే లింగమంతుల జాతర అంబరాన్నంటే సంబరంగా నిర్వహిస్తారు. రెండేళ్లకోసారి జరిగే జాతర సందర్భంగా తప్పితే మిగతా రోజుల్లో దేవతలకు ధూపదీప నైవేద్యం పెట్టేందుకు దిక్కులేని పరిస్థితి. జాతరకు లక్షలాది రూపాయల ఆదాయం వచ్చినా, ప్రభుత్వం కోట్లు కేటాయించినట్లు చెబుతున్నా సరే నిత్యం గుడిలో దీపం వెలిగించి నైవేద్యం పెట్టి పూజలు చేసేందుకు నిధుల్లేని దయనీయ పరిస్థితి. గర్భగుడిలో శుభ్రం చేసి దీపం వెలిగించేందుకు నూనె, వత్తులు, కుంకుమ, పసుపు, కొబ్బరికాయలు, పూలు, అగర్‌బత్తీల వంటి వస్తువులు భక్తులు సమర్పించుకుంటే తప్ప వాటిని కొనేందుకు డబ్బుల్లేని పరిస్థితి. ఆలయ ఆదాయంలోంచి ఈ ఖర్చుల కోసం కేటాయించే పరిస్థితి లేదు. జాతరకు కొబ్బరికాయలు, తలనీలాలు, లడ్డు, పులిహోర టెండర్లకు సుమారు రూ.35 లక్షల ఆదాయం వస్తుంది. హుండీ ఆదాయం రూ.12 లక్షల వరకు వస్తుంది. అయినా జాతర ముగిసిందంటే దేవుడి ఆలనపాలన చూసే పరిస్థితి ఉండదు.
దేవాలయాల ముస్తాబు
ఫిబ్రవరి 12 నుంచి 16 వరకు జాతర సాగనుంది. లింగమంతుల జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర్ర, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన సుమారు 30 నుంచి 35 లక్షల మంది భక్తులు వస్తారు. దురాజ్‌పల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కలెక్టర్‌ సురేేంద్రమోహన్‌ నేతృత్వంలో దేవాలయాలను ముస్తాబు చేస్తున్నారు. విద్యుత్‌, మంచినీటి వసతుల్ని సమకూరుస్తున్నారు. శాశ్వత మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. భక్తులు స్నానాలు చేసేందుకు షవర్స్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. చలువ మండపాలు, విద్యుత్‌ అలంకరణ, రోడ్ల పనులు జరుగుతున్నాయి. దేవాలయాలు, ప్రధాన ద్వారాలకు రంగులేస్తున్నారు. 65 జాతీయ రహదారి పక్కన జాతర జరుగుతున్నందున ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తకుండా వాహనాల్ని మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఏర్పాటు చేశారు. లక్షలాది మంది భక్తులు వస్తున్నందున బందోబస్తు కోసం పోలీసు బలగాలు చేరుకున్నాయి.
వేతనాలకు నోచని పూజారులు
నిత్య పూజలు చేయడానికి దేవాలయాల్లో నలుగురు పూజారులు పనిచేస్తున్నారు. వారికి వేతనాలిచ్చే నాథుడులేరు. భక్తితో వంశాచారం కోసం అక్కడే పడి ఉంటూ గుడి తలుపు తెరచి శుభ్రం చేసి దీపారాధన చేస్తున్నారు. మున్నవారి వంశీకులైన మున్న కృష్ణయ్య, మున్న లింగయ్య, తండు రామచంద్రంతో పాటు మరో పూజారి ప్రతి రోజూ దురాజ్‌పల్లి గుట్టపైకి వచ్చి పూజలు చేస్తారు. పొద్దస్తం అక్కడే ఉండి భక్తులు దైవదర్శనానికి వస్తే పూజలు చేసి హారతులిస్తారు. భక్తులు ఇచ్చే కానుకలు తప్పితే నెలవారి వేతనాలేమీ ఇవ్వట్లేదని వారు వాపోయారు.
వివిధ రూపాల్లో లింగమంతుల విగ్రహాలు
లింగమంతుల స్వామి దేవాలయంలో ప్రతిష్టించిన విగ్రహాలు శిలానైపుణ్యానికి అద్దం పడతాయి. గర్భగుడిలో 'ముద్దలింగం' లింగమంతులు పుట్టిననప్పటి రూపాన్ని తెలియజేస్తుంది. 'ఉగ్రరూపం' లింగమంతులు యాదవరాజుగా యుద్ధం చేసిన సమయంలో గద, శూలంతో ఉన్న విగ్రహముంది. 'శాంతిరూపం' యుద్దం ముగిశాక ప్రజలంతా శాంతిగా ఉండాలని ప్రబోధిస్తున్న రూపంతో విగ్రహముంది. ఈ మూడు విగ్రహాలతో పాటు మాణిక్యమ్మ, ఆకులమ్మలు శివలింగాల్ని ఎత్తుకున్న రూపంతో విగ్రహాలు ప్రతిష్టించారు.
రచయిత సెల్‌ : 9490099359
- మేకల కృష్ణయ్య

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

తమ చ‌రిత్ర‌ను తాము లిఖిస్తూ
పోదాం పద జాతర!
సంతానం కోసం..
పుచ్చు‌కోవ‌టంలోనే కాదు ఇచ్చు‌కోవ‌టంలోనూ
యాత్ర
ఆదిమ ఆచార‌ స్ర‌వంతి సంక్రాంతి
జక్కన్నపేట రాతిచిత్రాలు
యువ లోకం
ప్రవాసీ
అరుదైన సాహితీమూర్తి సి.వి.

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:12 AM

నేడు కాళేశ్వరంను సందర్శించనున్న ఆర్థిక సంఘం

09:11 AM

జయరాం హత్యకేసులో మరో పోలీసు అధికారిపై వేటు

08:36 AM

రష్యాలో కుప్పకూలిన యూనివర్సిటీ భవనం

08:30 AM

ఉస్మానియా ఆస్పత్రిని పునర్నిర్మించాలని హైకోర్టులో పిల్‌

08:25 AM

జయరాం కేసులో కొనసాగుతున్న విచారణ

08:22 AM

మాలావత్ పూర్ణ అరుదైన ఘనత

08:19 AM

ఇంకా కశ్మీర్‌లోనే పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి.!

08:12 AM

పాక్‌ నుంచి దిగుమతులపై 200 శాతం సుంకం

08:10 AM

నేడు ఓయూలో ఫెస్టివల్ ఆఫ్ ఇన్నర్ పీస్

07:57 AM

18న జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా

07:53 AM

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 72 మందిపై కేసులు నమోదు

07:52 AM

నూతన జిల్లాల్లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

07:49 AM

అమ‌రుల కుటుంబాల‌కి అమితాబ్ ఆర్ధిక సాయం

07:42 AM

ట్రోఫీని పుల్వామా అమరులకు విరాళంగా ఇచ్చిన విదర్భ జట్టు

07:33 AM

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

మరిన్ని వార్తలు
04:40 PM

దళిత విద్యార్థులతో టాయిలెట్ల క్లీనింగ్

02:21 AM

మేక్‌ ఇన్‌ తెలంగాణ

02:10 AM

యాదాద్రి జాగా సంగతేంటి

02:05 AM

పెట్రోల్‌ బంకుల కోసం తగ్గుతున్న గిరాకీ!

02:03 AM

భూబిల్లుకు నిరసనగా రైతు ఆత్మహత్యలు

01:57 AM

ఇక పక్కా రాజకీయమే..

03:56 AM

ఫ్లడ్‌లైట్ల వెలుగులో... అక్రమ నిర్మాణాలు

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.