Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి..
  • కేపీహెచ్‌బీలో మహిళ అనుమానాస్పద మృతి
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... ఉగ్రవాదులకు మసూద్ అజర్ ఆదేశాలు!
  • ఈ యాప్ వాడితే మీ డబ్బులు మటాష్: ఆర్బీఐ హెచ్చరిక
  • సరిహద్దుల్లో 140 ఐఏఎఫ్ విమానాలు...
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
వాళ్ళి‌ద్ద‌రూ అంతే.. - రంగ‌నాయ‌క‌మ్మ | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • సీరియల్
  • ➲
  • స్టోరి

వాళ్ళి‌ద్ద‌రూ అంతే.. - రంగ‌నాయ‌క‌మ్మ

Sat 04 Mar 15:54:59.511989 2017

(గతవారం)
లక్ష్మి దగ్గర ఆమె చిన్నక్క తీసుకెళ్ళిన 20 వేల రూపాలయలను, చిన్నక్క భర్త బ్యాంకు వడ్డీతో సహా తీసుకొచ్చి తిరిగి ఇచ్చేస్తాడు. దానితో పాటు గతంలో అత్తగారు ఇచ్చిన ఉంగరం కూడా ఇచ్చి తన ఆత్మగౌరవాన్ని ప్రదర్శిస్తాడు. లక్ష్మి, భర్త రాముతో తను మరో రెండేళ్లు పెళ్ళి చేసుకోకుండా ఆగితే బాగా ఆస్తివున్న లాయరో, డాక్టరో వచ్చేవాడని తన అమ్మ, పెద్దక్క అన్నారని చెప్తే, కొయ్యబారిపోతాడు రాము. అక్క సులోచనని తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చేయమని అడుగుతాడు రాము. అక్కాతమ్ముళ్ళు తమ్ముడు మనో గురించి మాట్లాడుకుంటారు.
''ఇదేవిటి, ఇంత పిచ్చిగా మాట్లాడుతున్నావు? అసలు, కులాల్లో ఏం వుంటుంది? అందరి ఆలోచనలూ ఒకటే. ఏవన్నా తేడా వుంటే, తిండిలోనే కదా? కొందరు మాంసాలు తింటారు కొందరి ఆహారం అలా వుండదు. ఆ తిండి కూడా కొందరికి బాగా అందుతుంది. కొందరికి అలా అందదు. అలాంటి తేడాలే కదా? ఆు, ఒకే కులం సంసారాల్లో సుఖంగా వుంటారంటున్నావు కదా? అయినా ఒకే కులం వాళ్ళల్లో విడాకులు లేవా? ఒకే కులాలైనా, కులాంతరాలైనా, అన్నీ ఒకటే!''
''ఫలానా వాళ్ళే సుఖంగా వుంటారని కాదు. 'సుఖంగా వుంటారేమో' అన్నాను.''
''మా ఆఫీసులో రాధా మేడమ్‌కి, అప్పుడు శ్యామల గురించి చెప్పిందే, వాళ్ళ పెళ్ళి పెద్ద వాళ్ళు కుదిర్చి చేసిందే. కానీ, ఆవిడి సంసారం గురించి వింటే, అన్నీ చెపుతుంది నాకు. నాకే చెపుతుంది. అతను ఒకోసారి చెత్త తిట్లు తిట్టి లెంపకాయలు కూడా వేస్తాడు. అసలు, జ్ఞానం, వివేకం, .... అలాంటి లక్షణాలు అతనికి వుండవు.''
''అయ్యో, ఎందుకు? ఎందుకు? తాగుడా?''
''అబ్బే, అలాంటివి లేవంటుంది. ఆమె 'అందం' సరిపోలేదట! కోతితో పెళ్ళయింది నాకు అంటాడట! ముక్కు కోటీరు దిద్దినట్టుండాలంటాడట. కళ్ళు బారెడేసి వుండాలట! నడుం పిడికిట్లో పట్టాలట! ఛీ ఛీ! ఆ మాటలు మనం చెప్పుకోకూడదు. అతని కంప్లయింటు అదే అంటుంది.''
''మరి, ..... వదిలెయ్యాలనుకుంటుందా?''
''పిల్లలున్నారు ఇద్దరు. తనకి మంచి జీతమే. తనే పెంచుకో గలదు పిల్లల్ని. అయినా, అతని మీద కోపం రాదు. 'నిజమే కదా, నేను అందంగా లేను కదా?' అనుకుంటుంది తను కూడా. 'అది నిజం కాదండీ' అంటాను. 'నిజం అయినా, కాకపోయినా, మీ కళ్ళకి నేను అందగత్తెనే అయినా, నా మొగుడి కళ్ళకి నేను అందగత్తెని కాను కదా?' అంటుంది. 'అలాగే అనుకో' అన్నట్టు వూరుకుంటాను. 'సంస్కృతి' అన్నావే? అందులో ఏం వుంది? ఆడ దానికి 'అందం' కావాలి. కవులు చెప్పే అందం! డబ్బు కావాలి. అది, కవులు చెప్పే సిరి సంపదలు! ఆ చెత్త అభిప్రాయాలు అన్ని కులాల్లోనూ వుంటాయి. అన్ని కులాల సంస్కృతీ ఒకటే! అన్ని కులాల్లోనూ ఆడ వాళ్ళంటే మొగాళ్ళు ఒక్కలాగే చూస్తారు. మంచి సాహిత్యం పరిచయం అయిన వాళ్ళే మంచిగా మారతారు!''
''ఈ మధ్య ఏదైనా కొత్త పుస్తకం చదివావా?'' అని నవ్వాడు రమేష్‌.
''అదేవిటి? ఎంత ఆట లాగ మాట్లాడుతున్నావు!''
''సరదాగా అన్నాలే. నీ దగ్గిర కాస్సేపు కూర్చుంటే ఎంతో బాగుంటుంది నాకు.''
''మొన్న మనో అలాగే అన్నాడు. వాడెప్పుడూ అంత నిరుత్సాహంగా వుండడు. ఆ అమ్మాయి అంత విసిగిస్తోందేమో! ఇద్దరూ ఒకే కులం అయితే, అసలు భయ భక్తులే వుండవేమో! వేరు కులాలైతేనే మంచిది.''
''అక్కా! వెళ్తా!'' అంటూ లేచాడు తమ్ముడు.
ప్రభువు ప్రార్ధనలు తను కూడా కొన్నాళ్ళు ఎలా చేశాడో అక్కతో చెప్పేద్దామా అనుకుంటాడు ప్రతీసారీ! చెప్పలేడు! ''నేను మానేశానుగా? ఆ గొడవ ఇప్పుడెందుకు?'' అని ఆగిపోతాడు.
అక్క అంటే ప్రేమ! కానీ ఒక్క మాట కూడా తెలియనివ్వడు. నిజాన్ని దాచి పెట్టాలంటే, దాని మీద అబద్దాలు కప్పాలి! అక్కకి అబద్దం! అమ్మకి అబద్దం! నిజం చెప్తే వాళ్ళు బాధపడతారు - అనే వంకతో నిజాల దాపరికం!
ననన
రమేషు, అక్క గారింటికి వెళ్ళడం, భార్య గారికి అస్సలు నచ్చదు. అసలు రమేష్‌కి బైటికి పోవడానికి అంత టైము కూడా వుండదు. కాలేజీ నుంచి ఇంటికొస్తే, ఇక కూతురితోనే! శ్యామల స్కూలు నించి ఇంటికి రావడమే ఆలస్యం - రాగానే మళ్ళీ ఏ కొత్త స్థలానికో, కొత్త అపార్టుమెంటుకో, ప్రయాణం! రెండు స్థలాల రిజర్వేషన్లు అయిపోయాక, మామ గార్నీ వాళ్ళనీ పిలవాలంది. రెండు స్థలాల రిజర్వేషన్లు జరిగి నెల దాటింది. మళ్ళీ ఆ మామ లేదు!
రమేష్‌, ఇంట్లో వుంటే, కూతురికి బొమ్మల సంచి బోర్లించి, బొమ్మల్ని చూపిస్తూ వాటి పేర్లు అనిపిస్తాడు.
లకిë వుంటే, ''ఆ పేర్లు ఇంగ్లీషులో చెప్పు!'' అంటుంది. కానీ, రమేష్‌ తెలుగులోనే చెపుతాడు. ఎప్పుడైనా ఇంగ్లీషులో కూడా.
పిల్లకి ''నీళ్ళు'' అంటే తెలీదు. ''వాటర్‌ కావాలా?'' అంటుంది అమ్మమ్మ గారు కూడా.
ఎప్పుడైనా రమేష్‌, ''నీళ్ళు తాగుతావా చిట్టీ?'' అంటే, ''ఐ వాంట్‌ వాటర్‌'' అంటుంది. చిట్టిని కేరమ్‌ బోర్డు దగ్గిర ఆడించడం రమేష్‌కి ఇష్టం. గవ్వలతో చిన్న చిన్న లెక్కలు నేర్పడం ఇష్టం. తను ఇంట్లో వుంటే, పిల్ల నిద్ర పోకుండా వుంటే, పిల్లతోనే జీవితం!
ఒక రోజు రాత్రి చిట్టికి ఒళ్ళు వెచ్చబడింది. అది జ్వరంలాగే అనిపించింది.
లకిë అంది. ''నేను రేపు సెలవు పెట్టడం అస్సలు కుదరదు. నువ్వే పింకీని డాక్టర్‌కి చూపించు'' అంది ఆ రాత్రి.
అప్పుడే బావ గారి ఫోన్‌ రమేష్‌కి. ''నేను ఈ రాత్రే వూరు వెళ్ళాలి. ఆఫీసు పని. రేపొద్దున్న మా వాణ్ణి బండి మీద స్కూలుకి దింపుతావా? సాయంత్రం కూడా తీసుకు రావాలి. నీకు వీలే కదా?'' అని అడిగాడు.
''దానికేముంది? వీలే'' అన్నాడు రమేష్‌. మర్నాడు రమేష్‌కి సెలవే. తనకి బావ గారు అప్పగించిన పని మాట లకిëతో అనలేదు. ఆమెకి ఇష్టం వుండదని కొంత జంకు! ''ఆమెకి ఇష్టం లేకపోతే నాకేంటి? నేను చెయ్యవలసింది నేను చేస్తాను'' అనుకోడు. ఎందుకు గొడవలు? ప్రతీదీ ప్రచారం చెయ్యాలా? - అనుకుంటాడు. తను చాలా ప్లాన్డ్‌గా చేస్తాను - అనుకుంటాడు.
తెల్లారి కూడా చిట్టికి ఒళ్ళు వేడి తగ్గలేదు.
లకిë స్కూలుకి బైల్దేరిన వెంటనే, రమేష్‌ తన బండి మీద అక్క గారింటికి పోయి ఆ పిల్లాణ్ణి స్కూలుకి దింపి వెనక్కి వస్తూ వుంటే, ఇంటి ముందే లకిë, కూతుర్ని ఆటోలో పెట్టుకుని పోతూ కనపడింది. ఆటోని ఆపబోతే ఆగలేదు. తను కూడా ఆటో వెంట పడ్డాడు.
ఎప్పుడూ వెళ్ళే డాక్టర్‌ క్లినిక్‌ దగ్గిరే ఇద్దరూ ఆగారు.
లకిë, పిల్లని ఎత్తుకొని లోపలికి వెళ్ళి పోయింది.
ఇంకా డాక్టర్‌ రానేలేదు. నర్సే పిల్లని చూసింది. డాక్టర్‌ వచ్చేదాక ఆగమంది.
లకిë, పిల్లని పెట్టుకుని దూరంగా కూర్చుంది, మాట్లాడకుండా.
రమేష్‌, దగ్గిరికి వెళ్ళి పక్క కుర్చీలో కూర్చున్నాడు. ''నువ్వెలా వచ్చావు? నీకు వీలే కాదన్నావుగా?'' అన్నాడు.
''వీలే కాదంటే తప్పుతుందా? స్కూలుకి వెళ్ళగానే మమ్మీకి కాల్‌ చేసి అడిగాను. నువ్వు ఎటో పోయావంది. ఎటు వెళ్ళినట్టో తనకీ తెలీదంది. పిల్లకి జ్వరం కాలిపోతోంది అంది. ఇంకేం చేస్తాను? సెలవు పెట్టి వచ్చేశాను. కాకపోతే పిల్లని చంపుకుంటానా?'' అంది రుస రుసలతో.
''అది కాదు శ్యామూ! మా బావ రాత్రి హెల్ప్‌ చెయ్యమని అడిగాడు. ఇక్కడ డాక్టర్‌ ఎలాగా తొందరగా రాడని తెలుసు. వాళ్ళ వసంత్‌ని స్కూలుకి దింపేసి వస్తున్నాను. చిట్టిని పట్టించుకోకుండా నేనెక్కడికి పోతాను?''
''నువ్వు ఎక్కడికి పోతున్నావో మా మమ్మీకి చెప్పి వెళ్ళకపోయావా? చెప్తే ఆ మాటే మమ్మీ నాకు చెప్పేది. నేను వచ్చేదాన్ని కాదుగా?''
''నేను రావాలా అని నాకు ఫోన్‌ చెయ్యక పోయావా?''
''నువ్వు చెప్పకుండా దాచి పెడితే నేనెందుకు పిలవాలి నిన్ను? వాళ్ళ పిల్లాడు ఒక్క రోజు స్కూలు మానకూడదా? లేకపోతే, వాళ్ళ మమ్మీ ఆఫీసు మానుకుని తీసుకు వెళ్ళేది. ఇంట్లో జ్వరం పిల్లని వదిలిపెట్టి నీకెందుకు వాళ్ళ పని? మళ్ళీ సాయంత్రం వెళ్ళి తీసుకు రావొద్దూ? నీ పిల్ల మీద నీకు శ్రద్ధ లేకుండా వాళ్ళ పిల్లాడి మీదా నీకు శ్రద్ధ?''
పేషెంట్లు ఒక్కొక్కరూ చేరుతున్నారు. మాటలు ఎంత నెమ్మదిగా జరుగుతోన్నా అదేదో తగువు లాగే తయారైంది.
రమేష్‌, నోరు మూసుకున్నాడు. బావ గారు రాత్రి అడిగినప్పుడు, ఆ మాట తను శ్యామూతో చెప్పెయ్యవలిసింది. పొద్దున్నే తను బైటికి పోయేటప్పుడైనా అత్త గారితో, ''ఇదుగో, ఒక పని మీద వెళ్తున్నాను. ఇప్పుడే వచ్చి చిట్టిని క్లినిక్‌కి తీసుకు వెళ్తాను'' అని చెప్పవలిసింది. అలా చెప్పి వుంటే, కూతురు స్కూలు నించి ఫోను చేసినప్పుడు తల్లి గారు, ''అతను వచ్చి తీసుకు వెళ్తాడు'' అని చెప్పేదేమో! అయినా, తను బైటికి పోవడం తప్పే. వాళ్ళ పిల్లాడు ఒక రోజు బడిమానితే ఏమయ్యేది? పరీక్ష తప్పేవాడా? మళ్ళీ సాయంత్రం వెళ్ళి తీసుకు రావొద్దూ? ''సారీ శ్యామూ! డాక్టర్‌ తొందరగా రారు కదా అని వెళ్ళా గానీ, అసలు అంతా తప్పే! మా బావ రాత్రి అడిగినప్పుడు, 'నాకు వీలవదు, మా చిట్టిని వదిలి రాలేను' అని చెప్పవలిసింది. చాలా తప్పే'' అంటూ తన తప్పుకి తనే సిగ్గు పడుతూ చెప్పుకున్నాడు.
అంతలో డాక్టరమ్మ వచ్చింది. పిల్లని చూసింది. ''అంత టెంపరేచరేం కాదు. గోరు వెచ్చటి నీటితో స్నానం చేయించండి'' అని చెప్పింది. ''మందులేం వద్దు, ఫర్వాలేదు. బాగా నిద్రపోయే లాగ చూడండి'' అంది.
పిల్లకి జ్వరం కాదు - అని తేలగానే, రమేష్‌ ప్రాణం కుదుటపడింది. ''జ్వరం కాదనే అనిపించింది నాకు. నువ్వు చెప్పావని డాక్టర్‌కి చూపిద్దాంలే అనుకున్నాను'' అన్నాడు.
ముగ్గురూ రమేష్‌ బండి మీదే ఇల్లు చేరారు. బండి మీదే మళ్ళీ గొడవ రేగింది. ఆస్పత్రిలో అడిగినవే మళ్ళీ అడిగింది.
''సారీ శ్యామూ! యూ ఆర్‌ కరెక్ట్‌! ఐ యామ్‌ రాంగ్‌! పది సార్లయినా చెపుతాను'' అన్నాడు.
పెళ్ళాం ఝాడించేస్తొంటే మళ్ళీ నోరెత్త లేదు.
ఇంటికి చేరాక కూడా మాటలు లేవు. ఏదైనా తగువు వచ్చినప్పుడు, తుమ్మ ముళ్ళు లాంటి ఝాడింపులు కొంత ముగిశాక, వెనకటి నెలల్లో లాగ, శ్యాము, రాము భుజాల మీదకి వాలడం ఎక్కువగా జరగడం లేదు. తగ్గుతోంది.
ననన
రాత్రుళ్ళు భోజనాలకు కూర్చుంటే ఏ కూరలో రుచి తక్కువో, ఏ పులుసులో ఉప్పెక్కువో, ఆ మాటలన్నీ మాయం అయిపోయాయి! కూరల ధ్యాస రమేష్‌కి తప్ప, ఆ తల్లీ కూతుళ్ళకి ఉండడం లేదు.
''మమ్మీ! నిన్న బట్టల షాపులో అడిగాను. ఒకాయన నాకు బాగా తెలుసులే. వాళ్ళు అప్పులు తెచ్చుకుంటే, బ్యాంకుల్నించి కాదు, ప్రైవేటుగా తెచ్చుకుంటే, నూటికి ఐదారు రూపాయలు కూడా వడ్డీ ఇస్తారట! అమ్మో, ఎంత భయం వేసిందో!''
''ఐదారా? పదేసి రూపాయలు వడ్డీలు లాగే వాళ్ళు తెలుసు నాకు'' - మమ్మీ!
వడ్డీలంటే ఈ తల్లీ కూతుళ్ళు అస్సలు ఇష్డపడరు - అనిపిస్తుంది రమేష్‌కి! తనైతే దేనికీ మాట్లాడడు. అత్తగారు వండిన కూరల రుచులు పొగుడుతూ తినడంలోనే మునిగిపోతాడు.
''వంకాయి కూర అంత బాగుందా? ఉప్పే లేదు'' అంటుంది లకిë.
''ఉప్పు లేకపోతే మనం కొంచెం కలుపుకోకూడదా?'' అంటాడు.
''తినేప్పుడు కలుపుకుంటే ఏడిసినట్టవుతుంది. మమ్మీ! వండేప్పుడు నువ్వు ఉప్పు చూడవా?''
''ఒక్కోసారి చూడన్లే. ఎప్పుడూ అలవాటు పనేగా?''
''అవును గానీ, మొన్న నాగరత్నం పాతిక వేలు అప్పడిగింది. ఇవ్వలేనని చెప్పేశాను.''
''ఆవిడికి జీతం వస్తుందిగా? అప్పులెందుకూ?'' - తల్లి.
''మొన్న శేషారత్నం చెప్పిందిలే. నాగరత్నం ఏం చేస్తుందో తెలుసా? తక్కువ వడ్డీకి ఇచ్చే మనలాంటి వాళ్ళ దగ్గిర అప్పులు తీసుకుని, తను మళ్ళీ ....''
''అదా? తెలుసులే. అంత భక్తురాలు! ఆ పాడు పని చేస్తుందా?''
కూరల రుచులూ, ఉప్పులూ కారాలూ మాయమై, వడ్డీలెలా వొచ్చి పడ్డాయో రమేష్‌ అసలు గమనించడు. అన్నీ కూరల కబుర్లు జరగుతున్నట్టే అనుకుంటాడు.
''మనం అయితే, వడ్డీల గోల లేకుండా బ్యాంకు వడ్డీలతో సరిపెట్టేసుకుంటాం గానీ, ..... అన్నట్టు రామూ! మీ అక్కా వాళ్ళు డబ్బు తీసుకుని మూడు నెలలు దాటిపోయింది. ఇంకెప్పుడిస్తారు?''
''ఆలస్యం అయితే యేం? ఎంత ఆలస్యం అయితే అంత వడ్డీ వస్తుందిగా?''
''అసలు ప్రతి నెలా వడ్డీ పంపరేం?''
''అదేంటి? అప్పు తీర్చేటప్పుడే వడ్డీ కూడా కలిపి ఇస్తారు.''
''నీ కసలు డబ్బు సంగతులు ఒక్క ముక్క కూడా తెలవదు రామూ! ఏ నెల వడ్డీ ఆ నెల ఇచ్చెయ్యకపోతే, అది అసలులో కలిసిపోదూ? అలాగైతే 'చక్రవడ్డీ' లెక్కన ఇవ్వాలి. వాళ్ళకే ఇబ్బంది. అలా ఎందుకు? ఏ నెల కానెల ఇచ్చెయ్యమని చెప్పు!''
''అదా? అయితే, నువ్వే చెప్పు! మా అక్క నిన్నే అడిగింది అప్పు. ఇవ్వడానికి నువ్వే ఒప్పుకున్నావు. నువ్వు ఇచ్చిరమ్మంటేనే నేను ఇచ్చి వచ్చాను. వడ్డీల మాట నువ్వే చెప్పు!''
''అలాగైతే అసలు అప్పే తీర్చెయ్యమను తొందరగా.''
''అది కూడా నువ్వే చెప్పు!''
''అసలు, నీ మొహం చూసి అప్పు ఇచ్చాను వాళ్ళకి, తెలుసా?''
''నా మొహం వల్ల వడ్డీలు వస్తాయా? వడ్డీల కోసం ఇచ్చావు.''
''ఇదుగో, ఈ కిరి కిరి ఎందుగ్గానీ, డబ్బు ఇచ్చెయ్యమని చెప్పు! ఏదో అవసరం వచ్చిందని చెప్పు! ఎవరికైనా చక్రవడ్డీకే ఇచ్చుకోవచ్చు.''
''ఆ మాట అప్పుడే చెప్పకపోయావా శ్యామూ?''
''ఏమో! మీ అప్పకి తెలుసేమో అనుకున్నాను. చక్రవడ్డీ మాట కొత్తగా చెప్పాలా?''
ఈ తమ్ముడి భార్య తత్వం బొత్తిగా తెలీకే లోచన ఈమెని చనువుగా అప్పు అడిగింది గానీ, తమ్ముడు మూగ గానో - సైగ గానో ''ఆమెని అడగొద్దులే అక్కా'' అని ఒక్క ముక్క చెప్పి వుంటే, ఈమె ఇస్తానని వెంటపడ్డా లోచన తీసుకునేదా? ఈ డబ్బు జోలికి వచ్చేదా?
అక్కకి నిజం చెప్పాలంటే, అసలు తమ్ముడికి నిజం తెలిస్తే కదా? భోజనాల బల్లంతా వడ్డీలు పాకుతోన్నా వాటి నడక అర్ధం కాదు అతనికి. వాళ్ళేదో మాట్లాడుతున్నారు! వాళ్ళకి తెలిసిన కబుర్లేవో చెప్పుకుంటున్నారు! అంతే గ్రహించగలడు ఆ లెక్కల మేధావి!
ననన
ఎప్పటికో అర్ధమైంది. అక్కకేం చెప్పాలి? ఎలా చెప్పాలి? ''అక్కా! నువ్వు ఏ నెల వడ్డీ ఆ నెలకి ఇవ్వలేదు కాబట్టి, దాన్ని కూడా అసల్లో కలిపి వడ్డీ లెక్కలు చూడక్కా! - అని చెప్పాలా? భలే పని అయింది! అక్క అసలు శ్యాముని అడగకుండా వుంటే పోయేది'' అనుకున్నాడు. తను శ్యాము గురించి కొంచెం మొదటే చెప్పి వుంటే పోయేది - అనుకోడు!
రమేష్‌ ఒక గంటంతా ఆలోచించాడు. గుండె నిబ్బరం చేసుకుని అక్కకి ఫోన్‌ చేశాడు. ''అక్కా! శ్యాముని అందరూ అడుగుతారు అప్పులు. అందరూ స్నేహితులే లే. ఎవరికో ఆస్పత్రికి కట్టే అవసరం వుందట. డబ్బు అడిగారట. మీరు ఇచ్చెయ్యడానికి వీలవుతుందా అని అడగమంది. వీలయితేనే సుమా!''
''అలాగే, బావ అసలు బ్యాంక్‌ లోన్‌ కోసమే ప్రయత్నిస్తున్నారు. అది వచ్చేసినట్టే అనుకుంటా. ఇచ్చెయొచ్చు రెండు రోజుల్లో.''
'''అసలు' ఇస్తే చాలు! 'వడ్డీ అక్కరలేద'ని చెప్పమంది.''
''అయ్యో! అలా అనకు! బ్యాంకు వడ్డీ ఇస్తామని మొదట చెప్పాంగా? బ్యాంకులోనే తీసుకుంటే అప్పుడైనా వడ్డీ కట్టమూ? వడ్డీతో కలిపే ఇచ్చేద్దాంలే.''
''అలాగైతే వడ్డీ అక్కర్లేదని నేను చెప్పలేదని నన్ను కోప్పడుతుందక్కా!''
''అలా కాదులే, నేనే తీసుకొచ్చి ఇస్తా!''
''అలా వొద్దు! నేనే వస్తాలే. నువ్వు ఇస్తానంటే నేనే వచ్చి తీసుకుంటా!''
ఫోను పెట్టేసిన తర్వాత, పిల్ల పని కూడా పట్టించుకోకుండా రమేష్‌ చేసిన పని, ఆ అప్పుకి బారువడ్డీయే గాక, చక్రవడ్డీ కూడా ఇవ్వాలంటే ఎంత ఎక్కువగా ఇవ్వవలసి వస్తుందో, ఆ లెక్కలన్నీ కట్టడమే. ఒక కొలీగ్‌ని పిలిచి కూడా తన లెక్కలు సవ్యంగా వున్నాయో లేవో వాకబు చేసుకున్నాడు. ఆ చక్రవడ్డీ బాపతు డబ్బు తన ఎకౌంట్‌లో నించి తీసి అక్క ఇచ్చే బారువడ్డీకి కలిపేస్తే సరిపోతుంది. శ్యాముకి చక్రవడ్డీ అందుతుంది. అంత రహస్యంగా జరపకపోతే, అక్కనే చక్రవడ్డీ ఇమ్మని అడిగితే, తన వాళ్ళ ముందు తను తల ఎత్తుకు తిరగగలడా?
అసలు, ఆ భార్యామణి 'చక్రవడ్డీ' మాట ఎత్తగానే, అతడు ఒక సంచి తీసి ఒక జత బట్టలు అందులో ఎందుకు కూరలేకపోయాడు? - ఆ ఆలోచన రానే రాదు. ఏమో, ఆమె డబ్బు! ఏవేవో కొనుక్కోవాలని ప్రయత్నిస్తోంది. ఆమె ఇష్టం! బారువడ్డీ ఇమ్మనడం తప్పు కానప్పుడు, చక్రవడ్డీ ఇమ్మనడం మాత్రం తప్పా? మరి, ఆ మాటే తను అక్కతో ఎందుకు అనలేడు? ''చక్రవడ్డీయే ఇస్తే బాగుంటుంది'' అంటే అక్కతో? ఇందాకేమో, ''అసలు వడ్డీయే వద్దంటోంది'' అని చెప్పి, ఇప్పుడు, ''చక్రవడ్డీ ఇవ్వండి'' అంటే, పిచ్చోణ్ణి చూసినట్టు చూడరూ? ఆ చక్రవడ్డీ బాపతు లెక్క తను పెట్టుకోవలిసిందే! అసలు, అక్కని వడ్డీయే ఇవ్వొద్దన్నాడు. అక్క, తన మాట నమ్మి వడ్డీ లెక్క మానేస్తే, మొత్తం వడ్డీ అంతా తను ఇవ్వవలిసిందే ఎక్కడో అప్పు తెచ్చి!
నాలుగు రోజుల్లో అంతా సెటిలై పోయింది. డబ్బంతా తెచ్చి భార్యామణికి అప్పగించాడు.
ఆ మనిషి నమ్మలేకపోయింది. ''వాళ్ళు చక్రవడ్డీయే ఇస్తారంటే, డబ్బుని వాళ్ళనే వుంచుకోమందునే'' అంది.
వెంటనే తన సెల్‌ తెరిచింది. ''లోచనకి థ్యాంక్స్‌ చెపుతాను'' అంది. లోచన పలక గానే మొదలు పెట్టింది. ''సారీ లోచనా! నిన్ను చక్రవడ్డీ అడిగానా నేను? అసలు వడ్డీయే తీసుకోకూడదనుకున్నాను. పోనీ ఇస్తే, బారు వడ్డీ చాలదా? చక్రవడ్డీ దాకా ఎందుకు చెప్పు? మన మధ్య ఈ వడ్డీల గోలలేమిటి?''
''అదేవిటి శ్యామలా? చక్రవడ్డీ కాదే మేమిచ్చింది! బ్యాంకు వడ్డీ లాగే లెక్క పెట్టారు మా ఆయన.''
''కాదులే, చక్రవడ్డీ లెక్కలే వున్నాయి. మీకు ఇంకా అవసరం అయితే, ఈ డబ్బు మళ్ళీ తీసుకోండి! వడ్డీయే వొద్దంటే మీరు వింటారా? మీకెలా ఇవ్వాలనిపిస్తే అలా ఇవ్వండి! ఉంటానూ'' అంటూ ఫోన్‌ బంద్‌! ''నీ అప్ప అలా చెప్పిందేమిటి? తను బారు వడ్డీయే ఇచ్చానందేమిటి?''
తర్వాత, రమేష్‌ జవాబులు చెప్పవలసి వచ్చింది. ''అది కాదు శ్యామూ! నీకు చక్రవడ్డీయే ఇష్టం కదా? దానికైతే, ఇంకా ఎంత ఎక్కువ చేరాలో అది నేనే చేర్చాలే.''
''అంటే, చక్రవడ్డీ మాట మీ అక్కకి తెలీదా?''
''అస్సలు తెలీదు.''
''అయితే, నాకెందుకు చెప్పలేదు? చెప్తే, నేను ఆమెతో 'చక్రవడ్డీ' మాట ఎత్తేదాన్ని కాదు కదా? రేపు మీ అక్క నిన్ను అడుగుతుంది. నువ్వేం చెప్పుకుంటావు?''
''ఏదో చెప్పుకుంటాలెద్దూ! శ్యామూని జోక్‌ చెయ్యడానికి అది నేనే కలిపాన్లే అని చెపుతా!''
''నువ్వు జోక్‌గా చేశావంటే వాళ్ళు నమ్ముతారా? మీ వాళ్ళందరూ నన్నే తప్పుపడతారు. అసలు, ఈ వడ్డీల గొడవలు మీ వాళ్ళతో చెప్పొద్దని మీ అక్కతో చెప్పు వెంటనే.''
''తప్పకుండా చెప్తా!'' అంటూ రమేష్‌ డాబా మీదకి పరిగెత్తాడు. ''అక్కా! నిజంగా నేను జోక్‌గా చేశాను'' అని చెప్పాలని ఆరాటం!
అక్క ఫోను ఎంగేజ్డ్‌గా వుంది. ఏదో అనుమానం వచ్చి, తండ్రికి ఫోన్‌ చేస్తే, అదీ ఎంగేజ్డ్‌గా వుంది.
పది నిముషాలు అక్కడే నిలబడి నిలబడి చివరికి అక్కని పట్టుకున్నాడు. ''ఇంతసేపూ నాన్నతో మాట్లాడావా అక్కా?''
''అవును, చక్రవడ్డీ గొడవంతా చెప్పాను.''
''ఏవన్నాడు నాన్న?''
''అసలు సరిగా వినలేదు. ఏదో కంగారులో వున్నాడు. 'సరేలే, సరేలే' అన్నాడు.''
''మళ్ళీ చెప్పకు అక్కా! నేను వూరికే శ్యాముని ఏడిపించాలని, నా డబ్బే కొంత కలిపి అలా చేశానక్కా!''
''ఏం సరదాలవి? చెత్త!'' అని అక్క కోపంగా ఫోను ఆపేసింది.
డాబా మీదకి వెంటనే రమేష్‌కి ఫోను!
''ఏం అంది మీ అక్క?''
''నన్నే తిట్టింది. ఏం సరదాలవి - అంది.''
''సరదాకి చేస్తే చేస్కో! నీ డబ్బు నీ కిచ్చేది లేదు.''
''నా కెందుకు? నీకివ్వాలనే అలా చేశా!''
రెండు గంటల గందరగోళంతో ఆ ప్రమాదం అలా దాటగలిగా ననుకున్నాడు. అంతలో మళ్ళీ రేగింది. అప్పటి దాకా తల్లీ కూతుళ్ళ మధ్య ఏవో లెక్కలు జరిగాయి. ''అవును, అవును'' అనుకుంటూ ''రామూ!'' అని పిలిచింది.
రామూ హాజరు!
''నీ డబ్బయినా, అది మనదే. మీ అక్కే చక్రవడ్డీ ఇస్తే, మనకి కాస్త ఎక్కువ డబ్బు వచ్చినట్టు అయ్యేది గానీ, నీ డబ్బులో నించి తీసి ఇస్తే, మనకి ఎక్కువ వచ్చినట్టా? 'సరదా' అనుకున్నావు గానీ, అసలు జరిగిందంతా నష్టం మనకి! నష్టం మీ అక్కకి లేకుండా చేశావు. ఇలా వుంటాయి నీ సరదాలు!''
'సరదా' అన్నమాట పెద్ద అబద్దం!
అబద్దాలు! అబద్దాలు! అబద్దాలు!
అక్కతో, అమ్మతో, నాన్నతో, రవీంద్రతో, ఆఖరికి ముద్దుల పెళ్ళంతో! నిజం ఏదైనా వుంటే, అది తప్ప టడుగుల చిట్టితో! ''దామ్మా! బొమ్మలు చూద్దాం!'' అంటాడు. అది నిజమే.
ఒక అబద్దం ఎన్ని అబద్దాలకు దారి తీస్తోందో లెక్క కట్టలేక పోతున్నాడు లెక్కల టీచరు!
ననన
సంక్రాంతి సెలవుల రోజులు. 'పుట్టిల్లు' అనేది వుండి, తల్లిదండ్రులనే వాళ్ళు వుంటే, రెక్కలొచ్చి ఎగిరిపోయిన పిల్లలు కూడా, తల్లిదండ్రుల దగ్గిరికి ఎప్పుడంటే అప్పుడు వచ్చి పోతూనే వున్నా, సంక్రాంతి పండగైతే మాత్రం తోడబుట్టిన వాళ్ళందరూ పుట్టింట్లో కలుసుకోడం ఒక ముచ్చట అనుకుంటారు!
సులోచన తన కొడుకు తోటీ, మనోహర్‌ కూడా తన కొడుకు తోటీ, రేపు భోగి అనగా బయ్యారం చేరిపోయే వున్నారు. చేరవలిసింది రమేష్‌, తన కూతురితో!
రమేష్‌ భార్యామణికి బయ్యారం నచ్చదు. ఆ పేరే పడదు. అత్తగారింటికని వెళ్తే, తన 13 లక్షల ముచ్చటని అక్కడ చెప్పుకోవచ్చని వుంటుంది గానీ, అక్కడ ఎవరైనా దాన ధర్మాలు అడుగుతారేమోనని డౌటు! ''ఇవ్వలేను'' అనడానికి వుండదు. ఇవ్వడానికీ కుదరదు! ఎటూ తేలని కిరి కిరి అది!
''పింకీకి ఇప్పుడు సంవత్సరం మీద ఏడో నెల. బేసి నెలల్లో పిల్లల్ని ఎటూ తిప్పకూడదు'' అని మమ్మీకి నచ్చే అమ్మమ్మ వాదం!
''వొస్తున్నారా?'' అని తండ్రి ప్రశ్న రమేష్‌కి.
''నేను వస్తాను, శ్యామల రానంటోంది. పిల్లల్ని బేసి నెలల్లో తిప్పకూడదట!'' - ఆ ముక్క చెప్పక తప్పలేదు. అబద్దం అంటే ఆ పూట భయం పుట్టింది.
''ఎప్పుడూ ఇదే చెపుతున్నావు. ఏదీ, ఆ అమ్మాయికి ఇయ్యి! నేను మాట్లాడతాను.''
ఫోను, కోడలి చేతిలోకి మారింది.
''శ్యామలా! ఇదేంటమ్మా, ఇవేం నమ్మకాలు?''
''ఈ నమ్మకాలేవీ నాకు లేవండీ, మా మమ్మీకే అవన్నీ. పిల్లని తనే పెంచుతోంది కదండీ? మమ్మీ నమ్మకాలతో నడవకపోతే ఎలాగండీ?''
''పెంచడం అంతా ఒక్కళ్ళే చేస్తారా? రమేష్‌ చాలా చేస్తాడే! నువ్వూ చేస్తావు. ఆవిడ ఎంత చూస్తే మాత్రం, పిల్ల మీద హక్కులు అమ్మవీ కాదు, నాన్నవీ కాదు, అమ్మమ్మవేనా?''
''మా మమ్మీకి పింకీ అంటే చాలా ప్రేమండీ! దాన్ని వదిలి వుండలేదు.''
''అయితే, ఆవిణ్ణీ రమ్మను! అందరూ కలిసి రండి! ఒక కుటుంబం వాళ్ళం ఏడాదికి ఒక్క సారన్నా కలుసుకోవద్దూ? విదేశాల్లో వున్నారా? బస్సెక్కితే రెండు గంటల ప్రయాణం!''
''పిల్లకేమన్నా అవుతుందేమోనని మమ్మీకి....''

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

వాళ్ళి‌ద్ద‌రూ అంతే!
వాళ్ళి‌ద్ద‌రూ అంతే..! - రంగ‌నాయ‌క‌మ్మ‌
వాళ్ళి‌ద్ద‌రూ అంతే
వాళ్ళి‌ద్ద‌రూ అంతే..!రంగ‌నాయ‌క‌మ్మ‌
వాళ్లి‌ద్ద‌రూ అంతే..! రంగ‌నాయ‌క‌మ్మ‌
వాళ్ళి‌ద్ద‌రూ అంతే..! - రంగాన‌య‌క‌మ్మ
వాళ్ళి‌ద్ద‌రూ అంతే!
వాళ్ళి‌ద్ధ‌రూ అంతే!
వాళ్ళి‌ద్ద‌రూ అంతే..! - రంగ‌నాయక‌మ్మ
వాళ్ళి‌ద్ద‌రూ అంతే!

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
10:20 AM

వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి..

10:03 AM

కేపీహెచ్‌బీలో మహిళ అనుమానాస్పద మృతి

10:00 AM

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... ఉగ్రవాదులకు మసూద్ అజర్ ఆదేశాలు!

09:55 AM

ఈ యాప్ వాడితే మీ డబ్బులు మటాష్: ఆర్బీఐ హెచ్చరిక

09:42 AM

సరిహద్దుల్లో 140 ఐఏఎఫ్ విమానాలు...

09:33 AM

విషమంగానే మధులిక ఆరోగ్యం

09:28 AM

తెలంగాణ కొత్త జిల్లాలకు కలెక్టర్, ఎస్పీల ప్రకటన!

09:20 AM

బాబుతో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన అశోక్‌ గజపతి

09:12 AM

నేడు కాళేశ్వరంను సందర్శించనున్న ఆర్థిక సంఘం

09:11 AM

జయరాం హత్యకేసులో మరో పోలీసు అధికారిపై వేటు

08:36 AM

రష్యాలో కుప్పకూలిన యూనివర్సిటీ భవనం

08:30 AM

ఉస్మానియా ఆస్పత్రిని పునర్నిర్మించాలని హైకోర్టులో పిల్‌

08:25 AM

జయరాం కేసులో కొనసాగుతున్న విచారణ

08:22 AM

మాలావత్ పూర్ణ అరుదైన ఘనత

08:19 AM

ఇంకా కశ్మీర్‌లోనే పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి.!

మరిన్ని వార్తలు
04:40 PM

దళిత విద్యార్థులతో టాయిలెట్ల క్లీనింగ్

02:21 AM

మేక్‌ ఇన్‌ తెలంగాణ

02:10 AM

యాదాద్రి జాగా సంగతేంటి

02:05 AM

పెట్రోల్‌ బంకుల కోసం తగ్గుతున్న గిరాకీ!

02:03 AM

భూబిల్లుకు నిరసనగా రైతు ఆత్మహత్యలు

01:57 AM

ఇక పక్కా రాజకీయమే..

03:56 AM

ఫ్లడ్‌లైట్ల వెలుగులో... అక్రమ నిర్మాణాలు

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.