Sat 18 Jul 18:23:12.164276 2015
Authorization
ఐకమత్యం
ఒక స్కూల్లో పరీక్ష జరుగుతుంది.
పిల్లలు ( మాస్టారుతో) : మీ మాస్టార్లంతా ఒకటేనండీ! నీతులు చెప్పుతారు కాని పాటించనివ్వరు.
మాస్టారు : ఏరా ఏం జరిగింది ?
పిల్లలు : మీరే కదండీ ఏ పనినైనా ఐకమత్యంగా కలిసిమెలిసి చేస్తే తొందరగా అయిపోతుదంని చెప్పారు. మరిప్పుడేమో విడివిడిగా దూరంగా కూర్చోబెట్టి పరీక్ష రాయమంటున్నారు. ఇది అన్యాయం సార్!
ప్రమోషన్
జడ్జి పాత దొంగతో : ఓ... నువ్వా! నేను వకీలుగా ఉండగా సైకిలు దొంగలించావు. నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్‌నైనప్పుడు మోటర్‌సైకిలు దొంగిలించావ్. ఇప్పుడు నేను జడ్జీ అయినప్పుడు కారు దొంగలించావు. చాలా విచిత్రంగా ఉందే!
దొంగ : ఏం లేదుసార్! మీ మాదిరిగానే నాకు కూడా ప్రమోషన్ వచ్చిదంతే సార్!
మాట మీద నిలబడతా
రాము : నీ వయస్సెంత?
సోము : పన్నెండు సంవత్సరాలు
రాము : క్రితం ఏడాది కూడా నువ్వు ఇలాగే చెప్పావే!
సోము : అయితే ఏంటట. నేను మాట మీద నిలబడే రకాన్ని.
వద్దన్నాక కూడా
రాము : మీ హోటల్‌కి ఇంకెప్పుడూ రాను
మేనేజర్ : ఏమైంది సార్
రాము : నాకింకేమీ వద్దన్నాక మీ సర్వర్ బిల్లు తెచ్చి ఇచ్చాడు.
హారన్
యజమాని : ఏంటీ! కారుకి ఏమయింది. షడన్‌గా ఆపావు?
డ్రైవర్ : బండరాయి అడ్డువచ్చిందండి.
యజమాని: హారన్ మోగించలేకపోయావా?
లాభం-నష్టం
నాన్న : ఒక గొడుగు ఎనభైరూపాయల ఏభైపైసలకి కొని డెబ్బై ఐదు రూపాయాలు డెబ్బైఐదు పైసలు అమ్మితే లాభమా ! నష్టమా!
కొడుకు : రూపాయల్లో నష్టం, పైసల్లో లాభం వచ్చింది డాడీ!
డబుల్ ధమాకా!
మేనేజర్ : మా అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రమోషన్‌తో పాటు ఇల్లరికం రమ్మంటే ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావ్?
మేనేజర్ పి.ఎ. : ఆ జీవితకాల శిక్ష కంటే ...పక్కింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ..కోట్ల ఆస్తి ఇస్తానన్నారు సార్ అందుకే ఆలోచిస్తున్నా...!
పెంపకం
తల్లీదండ్రి : పెద్దయ్యాక ఏమౌతావ్ బుజ్జీ?
బుజ్జి : ఏమో మరి! మీ పెంపకం బాగుంటే ఏ డాక్టరో, కలెక్టరో అవుతామనుకుంటున్నా...!!
గురువెవరు?
మాస్టారు : నీకు సున్నా మార్కులొచ్చాయిగా... మీ నాన్నగారు ఏమన్నారు?
విద్యార్థి : నీకు చదువు చెప్పిన సన్నాసి ఎవడ్రా అన్నారండి.
ఎస్కలేటర్
ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లో కొత్తగా ఎస్క్సలేటర్‌ని పెట్టారు.
పక్కనే బోర్డుమీద ఇలా రాసి ఉంది. ''ఎస్కలేటర్ మీద వెళ్లదల్చుకున్న వాళ్ళు కుక్కల్ని చేత్తో ఎత్తుకొని పట్టుకోవాలి''.
పై ఫ్లోర్‌కి వెళ్లాలనుకున్న ఒకాయన అది చూసి, ఇదెక్కడి గొడవరా బాబు! ఇప్పుడు కుక్కని వెతికి తెచ్చుకోవాలా! అనుకుంటూ వీధిలోకెళ్లాడు కుక్కను వెతకడానికి.
- సేకరణ : మౌక్తిక్, హైదరాబాద్