Sat 04 Nov 12:22:55.386994 2017
Authorization
- భారత ఉపఖండంలో సమారు క్రీ. పూ.9000 నుంచి మేకలు పెంపుడు జంతువులుగా ఉన్నాయి.
- పాలు, మెన్యూర్, మాంసం, ఎముకలు మొదలైన వాటి కోసం వ్యవసాయ దారులు వీటిని పెంచుకునే వారు.
- మేకలలో 210 రకాలు ఉన్నాయి.
- కాశ్మీరీ, అంగోరా రకాల మేకలకి పొడవైన, పట్టులాంటి జుట్టు ఉంటుంది. దీన్ని వస్త్ర పరిశ్రమలో ఉపయోగిస్తారు.
- మేకల జీవిత కాలం సగటున 15 సంవత్సరాలు.
- మేకలు వాటి దవడలను రోజుకి దాదాపు 60 వేల సార్లు కదిలిస్తాయి.
- కనుపాప దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. అందుకే ఇవి 360 డిగ్రీల కోణంలో ఎటువైపైనా తల కదిలించకుండానే చూడగలవు.
- వీటి పెదవులు చాలా సున్నితంగా ఉంటాయి.
- మేకలు ఆహార విషయంలో శుభ్రతకి ప్రాధాన్యతనిస్తాయి. మట్టితో ఉన్న ఆకులని, గడ్డిని తినడానికి ఇష్టపడవు.
- మేకల పై దవడకి దంతాలుండవు.
- మేక పొట్ట నాలుగు భాగాలుగా వుంటుంది.
- మేక పాలు తాగడానికే కాదు, మాంసం తినడానికి కూడా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమంది ఇష్టపడతారు.
- మేక పాలు తొందరగా జీర్ణమవడమే కాదు, వాటిలో ఎక్కువ మోతాదులో కాల్షియం, విటమిన్ ఏ ఉంటుంది.
- ఇవి చాలా చురుకుగా ఉంటాయి. పెద్ద పెద్ద కొండలే కాదు, చెట్లు కూడా ఎక్కగలుగుతాయి.
- మేక స్వరంలో తేడాలుంటాయి. ఒక్కో దేశం మేక ఒక్కో రకంగా అరుస్తుంది.