Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • భారత్‌ పర్యటనలో అర్జెంటీనా అధ్యక్షుడు..
  • పాటియాలా కోర్టులో చిదంబరానికి ఊరట
  • ఆర్మీ చేతికి జైషే కమాండర్‌..?
  • డ్వాక్రా మహిళలను ఇబ్బంది పెట్టొద్దు: ఏపీ సీఎం
  • పాక్‌ కు చైనా సాయం : రా మాజీ చీఫ్‌
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
రబ్‌ న కరే | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

రబ్‌ న కరే

Wed 24 Jan 07:32:53.433732 2018

ఆ తల్లి నేల మీద దొర్లుతున్నది. దగ్గుతో ఆమెకు ఊపిరి ఆడటం లేదు. ఒకటే దగ్గు... క్షణం ఆగని దగ్గు. తల్లి చుట్టూ మూగారు తమ్ముళ్ళు, చెల్లెళ్ళూ. అందరికంటే పెద్దది అయిన ఆ అమ్మాయికి ఏం చెయ్యాలో తోచలేదు. తల్లికి మందు తీసుకురావాలి. అదొక్కటే ఆలోచన. నిరుపేద కుటుంబం అది. డాక్టర్ని పిలిచే స్తోమత లేని కుటుంబం. ఎలాగైనా సరే తల్లికి మందు తేవాలి అని నిర్ణయించుకుంది ఆ అమ్మాయి.
ఇంట్లోంచి బయటకి పరుగెత్తింది. కాళ్లకి చెప్పుల్లేవు. తలమీద దుపట్టా కప్పుకోలేదు. మందు కోసం పరుగెత్తింది.
ఆసుపత్రిలో కిటికీ వెనక వున్న కాంపౌండర్‌ ఆమెవైపు చూడలేదు. ఆమెను పట్టించుకోలేదు. ఆమె పదేపదే బతిమాలింది. తిరస్కారంగా ఆమె వైపు చూస్తూ తలమీద దుపట్టా కప్పుకో... క్యూలో రా అని కసిరాడు. క్యూ చాలా పొడుగ్గా వుంది. క్యూలో కిటికీ దగ్గరికి చేరుకున్న వారికి మందులతో పాటు కేకలు, హెచ్చరికలూ అందిస్తున్నాడు కంపౌండర్‌. ఆమె తలమీద దుపట్టా కప్పుకుంటూ క్యూలో నిలబడ్డది. కానీ అది ఆమె తలమీద నుంచి మాటిమాటికీ జారి పోతున్నది. అక్కడ వున్న వాళ్ళంతా ఆమె వైపే చూస్తున్నారు. చెప్పుల్లేకుండా కంకర తేలిన రోడ్డు మీద పరుగెత్తుకురావడం వల్ల ఆమె కాలికి గాయం అయింది. ఆమెకు ఆ విషయమే తెలీదు. ఆమె ఆలోచనంతా అమ్మ మీదే!
కిటికీ దగ్గరికి ఎప్పుడు చేరుతుందో తెలీదు. ఎవరెవరో వచ్చి క్యూలో దూరుతున్నారు. ఆమె కిటికీ దగ్గరికి చేరేటప్పటికి టైమ్‌ అయిపోయింది. ధడాల్న కిటికీ మూసేశాడు కంపౌండర్‌. చేసేదేమీ లేక ఆమె ఇంటికి తిరిగి వచ్చింది.
అప్పటికే ఆ తల్లి చచ్చిపోయింది. తమ్ముళ్ళూ చెల్లెళ్ళూ విపరీతంగా ఏడుస్తున్నారు.
రాత్రి నించి ఏమీ తినకపోవడంతో ఆమెకు ఆకలిగా వుంది. నీరసంగా వుంది. తమ్ముళ్ళకీ చెల్లెళ్ళకీ తిండి పెట్టగలిగితే బాగుండుననుకుంది. ఎవరో వాళ్ళు... పెద్దగా అరుచుకుంటూ ఇంట్లోకి జొరబడ్డారు. అమ్మాయికి యేం చెయ్యాలో అర్ధం కాలేదు. ఆకలి... ఆకలి... కనీసం తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి ముందు ఏమైనా తినడానికి పెట్టండి అని ఆమె ప్రాధేయపడింది. కానీ వాళ్ళు ఆ మాటలు పట్టించుకోకుండా ఆమెను అరెస్టు చేసి తీసుకుపోయారు.
కోర్టులో జడ్జి గారిని చూస్తే ఆమెకు భయం వేసింది. కానీ మౌనంగా వుండకూడదనుకుంది. మాట్లాడితీరాలని అనుకుంది.
అయ్యా! నేను అమ్మను చంపానని తీసుకువచ్చారు. నా తప్పేమిటి? నా తలపైన కప్పుకుందుకు లేకపోతేనేం... నా కడుపు ఖాళీదయితేనేం, నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఆకలితో దప్పికతో అలమటిస్తుంటే భయంతో వణికిపోతుంటే వీళ్ళు మా ఆకలిని పట్టించుకోలేదు. నన్ను లాక్కువచ్చారు. నేనే తప్పూ చెయ్యలేదు. వీళ్ళే తప్పు చేశారు. నన్ను వదిలేయండి అమ్మ శరీరం అలా పడివున్నది పై కప్పు లేకుండా. ఆమెను సమాధి చెయ్యాలి వెంటనే వదిలెయ్యండి. కానీ జంకింది. 'తనకు న్యాయం చెయ్యమన్న' ఒక్క మాట మాత్రమే అని అలా నిశ్శబ్దంగా నిలబడి పోయింది.
'న్యాయం గురించి మాట్లాడకు. ఆ మాట అంటే మాకు భయం. కనీసం ఆ ఆలోచన వచ్చినా వణికిపోతాం. నీకు శిక్ష తప్పదు. నీకు తెలియదా? ఇక్కడికి వచ్చినవారు ఎవరయినా సరే 'న్యాయం' అడిగారా మేం వారిని తప్పక శిక్షించి తీరుతాం' అన్నాడు న్యాయమూర్తి.
ఆ అమ్మాయి తలమీద దుపట్టా కప్పుకుంది. అది చాలీ చాలనిది కనుక జారిపోతూ ఉన్నది. జారిపోకుండా దాన్ని రెండు చేతుల్తోనూ పట్టుకుంది.
'మరొక నిందితుడ్ని ప్రవేశ పెట్టండి' అన్నాడు జడ్జి.
ఒక ముసలాడిని లోపలికి లాక్కువచ్చారు. అప్పటికే చావబాదినట్టున్నారు. మూల్గుతూ ఉన్న ముసలాడు చేతులు జోడించి దయతలచండని ప్రార్థిస్తున్నాడు.
జడ్జి అడిగాడు 'వీడు చేసిన నేరమేమిటి?'
'ఈ ముసలాడు జబ్బు పడ్డాడు. ఆసుపత్రిలో నర్సుని మందు ఇవ్వమని బతిమాలాడు. జాలిపడి నర్సు వీడికి మందు ఇచ్చింది'.
'ఆ నర్సు ఎక్కడీ' అక్కడ ఉన్నవారంతా అదిరిపడేట్టు అరిచాడు జడ్జి.
'ఇక్కడే ఉంది'
'తీసుకురండి'
నర్సుని ప్రవేశపెట్టారు.
'నువ్వు ఈ ముసలాడి మీద జాలిపడి మందు ఇచ్చావు కదూ! నిజం చెప్పు...' అన్నాడు జడ్జి.
'లేదు! నేను జాలిపడలేదు! లేదు లేదు నేను ఈ ముసలాడికి నా చేత్తో మందు ఇవ్వలేదు. నా చేతిలోంచి తనే మందు లాక్కున్నాడు. నాకు తెల్సు... జబ్బు పడటం క్షమించరాని నేరమని నాకు తెల్సు. ఆసుపత్రులు, వినోదం కోసం విహారయాత్రల కోసం కట్టించబడినవని కూడా నాకు తెల్సు'.
'ఏమన్నావు? ఈ ముసలాడు మందు లాక్కున్నాడా!' జడ్జీ ఫక్కున నవ్వాడు. 'అలాగయితే అతడి శిక్ష తగ్గించవచ్చు. కానీ ఉరే ముసలాడా అసలు నీకీ జబ్బు ఎలా వచ్చింది?'
'జడ్జిగారూ నేనెలా చెప్పగలను. ముసలాడ్ని అయిపోయాను కదా అందువల్ల ఏ జబ్బయినా రావచ్చును. వస్తే అది నా నేరమని నాకు తెల్సు'.
కోర్టులో జరుగుతున్న ఈ విచిత్రాన్ని చూస్తూ ఆశ్చర్యపోయిన ఆ అమ్మాయి తలమీద దుపట్టా జాగ్రత్తగా కప్పుకుంటూ ముసలాడివైపు జాలిగా చూసింది. ముసలాడు భయంతో వణుకుతున్నాడు. నిలబడే శక్తిలేక తనను పెడరెక్కలు విరిచి పట్టుకున్నవాళ్ళమీద వాలిపోతున్నాడు. వాళ్ళు ముసలాడ్ని కుదిపి చక్కగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముసలాడు ఎలుగెత్తి ఏడవసాగాడు. లోపలికి ప్రవేశపెట్టబడిన మరో యువకుడి ఏడ్పు శబ్దంలో వాడి ఏడుపు వినిపించకుండా పోయింది. చేతులు పైకి ఎత్తి పెట్టించి లోపలికి ఈడ్చుకు రాబడ్డ యువకుడు అరుస్తున్నాడు.
'నేను నిర్దోషిని.. నేను నిర్దోషిని. నేను భార్యని ప్రేమించలేదు. నేనా నేరం చేయలేదు. నన్నెందుకు తీసుకువచ్చారు. వదిలెయ్యండి' అతి ప్రయత్నం మీద కన్నీళ్ళని ఆపుకుంటూ అన్నాడతను.
'సైలెన్స్‌' అని గర్జించాడు జడ్జి. అంతా నిశ్శబ్దమై పోయింది.
'ఏం నేరం చేశాడితను?' అడిగాడు జడ్జి.
'మిలార్డ్‌! ఇతను భార్యను ప్రేమించాడు. ప్రేమించడమే కాదు ఆ ప్రేమను వ్యక్తం కూడా చేశాడు. హఠాత్తుగా మరణించిన భార్య పక్కన కూచుని ఏడుస్తున్నాడు'.
'లేదు మిలార్డ్‌ లేదు! చూడండి నా కళ్ళు పూర్తిగా ఎండిపోయి వున్నవి. ఒక్కటంటే ఒక్క చుక్క నీరు కూడా లేదు. నేను నా భార్యను ప్రేమించలేదు. నిజం చెప్పాలంటే నేను ఆమెను ద్వేషించాను'.
'అబద్దం మిలార్డ్‌! కన్నీటి చారికలు ఇతని చెంపల మీద కనబడుతూనే ఉన్నవి. చూడండి'.
చిరునవ్వు నవ్వడానికి విఫల ప్రయత్నం చేస్తూ ఆ యువకుడు 'సార్‌! ఇవి ఆనంద బాష్పాలు' అన్నాడు.
'నీకు తెలియదా మన దేశంలో ప్రేమించడం నేరమని.. ముఖ్యంగా భార్యను ప్రేమించడం పాపమని. నీకు మరణశిక్ష తప్పదు!' జడ్జి అన్నాడు.
'దయ చూడండి మిలార్డు! మీ అధికారులు తప్పుగా అర్ధం చేసుకున్నారు. నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. నా భార్యను ఎన్నడూ ప్రేమించలేదు. అందుకే ఆమె మరణించినా ఎంత సంతోషంగా ఉన్నానో చూడండి'.
ఆ యువకుడు మళ్ళీ నవ్వడానికి ప్రయత్నించాడు కానీ కళ్ళ నుంచి నీళ్ళు ధారగా కురిశాయి. ఇదంతా చూస్తున్న అమ్మాయి కూడా యేడవసాగింది.
'అతన్ని క్షమించండి. ప్రేమించడం నేరం కాదు'. అతని పట్ల సానుభూతితో ఏడుపు ఆపుకోలేకపోయిన ఆమె దుపట్టా సంగతి పట్టించుకోలేదు. వెక్కి వెక్కి ఏడుస్తూ జడ్జి పాదాల మీద పడ్డది.
'మిలార్డ్‌! మేమంతా అమాయకులం. నేనూ ఈ ముసలాడూ, ఈ యువకుడూ మేము ఎవరికీ అపకారం చెయ్యలేదు. మమ్మల్ని ఎందుకు శిక్షిస్తున్నారు. మేం ఆకలితో ఉన్నాం. ఖాళీ కడుపుత్తో వున్నాం. మమ్మల్ని వదిలేయండి'.
'దూరంగా ఉండు! నీ నేరాన్ని ఒప్పుకుంటున్నావు కదా!'
'అయ్యా! ఆమె తలమీద ముసుగు లేదు' అన్నాడో అధికారి.
భయంతో ఆ అమ్మాయి వెనక్కి కదిలింది.
'తలమీద ముసుగు లేకపోవడం ఎంత అవమానకరమైన విషయం. ఈమెను తీసుకువెళ్ళి ఉరి తీయండి. ముక్కలు ముక్కలుగా నరకండి' అన్నాడు జడ్జి.
అధికారులు ముఖాలు వికృతంగా పెట్టి ఆమెవైపు వచ్చారు. ఆమె నిస్సహాయంగా అరిచింది.
'నాకు ప్రాణభిక్ష పెట్టండి. నేను దుపట్టాను తీయను... ఎప్పుడూ తీయను' అని అరుస్తూనే ఉంది.
వాళ్ళు ఆమెపైకి లంఘించారు.
దేవుడా వీళ్లు నన్ను శిక్షించకుండా చెయ్యి.. ఆపు చెయ్యి. ఏం? నా తలపై కప్పు లేకుంటే యేం? నా కడుపు ఖాళీగా ఉంది... ఒక్క క్షణం... ఇప్పుడే నా తలని కప్పుకుంటాను... నన్ను వదిలేయండి... నా తమ్ముళ్ళు... నా చెల్లెళ్ళు... ఆమె గొంతు గద్గదమైంది.
వికృతమైన ముఖాలు ఆమెకు చాలా దగ్గరగా వచ్చేశాయి. ఆమె వెర్రిగా చుట్టూ చూసింది. తప్పించుకునే మార్గమే కనపడలేదు.
అనాలోచితంగా ఆమె తన పొడవాటి గౌనును పాదాల దగ్గర్నించి పైకి... పైపైకి లాగి... రెప్పపాటు సమయంలో తలపైన కప్పుకుంది.
- చింతపట్ల సుదర్శన్‌, 9299809212
మూలం : ఫరీదా హఫీజ్‌

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మూడో ముడి
గాంధారి పశ్చాత్తాపం
మారిన దొంగ
మోకు!
అనుబంధాలు
'కేకి'తాళీయమ్‌
కొత్త బంగారు లోకం
పట్టుచీర
ఆడ మనసు
రెండిరలు ఒక జగిలి!

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
11:17 AM

భారత్‌ పర్యటనలో అర్జెంటీనా అధ్యక్షుడు..

11:12 AM

పాటియాలా కోర్టులో చిదంబరానికి ఊరట

11:10 AM

ఆర్మీ చేతికి జైషే కమాండర్‌..?

11:06 AM

డ్వాక్రా మహిళలను ఇబ్బంది పెట్టొద్దు: ఏపీ సీఎం

11:04 AM

పాక్‌ కు చైనా సాయం : రా మాజీ చీఫ్‌

11:04 AM

నగరంలో కాల్పుల కలకలం

10:58 AM

ఇద్దరు కాంగ్రెస్‌ యూత్ నాయకుల మృతి..

10:57 AM

లిఫ్ట్ అడిగి కత్తితో గొంతుకోశాడు..!

10:55 AM

తాడేపల్లిలో రైతుల నిరసన

10:52 AM

తరగతి గదిలో మద్యం తాగిన విద్యార్థినులు

10:49 AM

పుదుచ్చేరి సీఎంతో భేటీ కానున్న కేజ్రీవాల్‌...

10:45 AM

జయరాం హత్య కేసు...పోలీస్ అధికారులకు నోటీసులు

10:43 AM

పాక్‌కు షాకిచ్చిన ముఖేష్‌ అంబానీ..

10:36 AM

భారత్‌ వ్యతిరేక నినాదాలు చేసిన యువకుడి అరెస్టు..

10:33 AM

వీడియో చూశాక పనిచేయలేకపోయాను: మోహన్‌లాల్‌

మరిన్ని వార్తలు
04:40 PM

దళిత విద్యార్థులతో టాయిలెట్ల క్లీనింగ్

02:21 AM

మేక్‌ ఇన్‌ తెలంగాణ

02:10 AM

యాదాద్రి జాగా సంగతేంటి

02:05 AM

పెట్రోల్‌ బంకుల కోసం తగ్గుతున్న గిరాకీ!

02:03 AM

భూబిల్లుకు నిరసనగా రైతు ఆత్మహత్యలు

01:57 AM

ఇక పక్కా రాజకీయమే..

03:56 AM

ఫ్లడ్‌లైట్ల వెలుగులో... అక్రమ నిర్మాణాలు

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.