Wed 24 Jan 07:33:51.763396 2018
Authorization
- ఇతరులు చెప్పిన మాటలను గుడ్డిగా నమ్మవద్దు. ఏదైన సందేహం ఉంటే పక్కవారిని అడిగి తెలుసుకోవాలి. ఇలా చేస్తేనే సరైన సమాధానం దొరుకుతుంది.
- ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి. ఈ అలవాటు చాలా మంచిది. ఇది వినయ, విధేయతలను నేర్పిస్తుంది.
- ప్రతిరోజూ చేసే పనిలో ఓ కొత్త విషయాన్ని నేర్చుకోవడం లేదా రాయడం, పెయింటింగ్ వేయడం, సంగీతం వినడం, పాటలు పాడటం, కవిత్వం రాయడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల సృజనాత్మకత పెరుగుతుంది.
- చేసే పనిని ఏకాగ్రతతో చేయాలి. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు, అలాగని ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు.
- అహంకారం జీవితాన్ని నాశనం చేస్తుంది. ఇది చుట్టూ ఉన్న వాళ్లను దూరం చేయడంతో పాటు చివరకు ఒంటరిని చేస్తుంది. అందరితో కలిసిమెలసి ఉండటం, సానుకూలంగా ఆలోచించడం మంచి పద్ధతి.
కఓటమిని అంగికరించడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడే విజయానికి చేరువవుతారు. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్లీ ప్రయత్నించడం మాత్రం ఆపకూడదు.
- తాతాల్కికంగా వచ్చే ఫలితాలతో సంతృప్తి పడటం వల్ల కొన్నిసార్లు ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు. ఈ విషయంలో కాస్త జాగ్రతగా ఉండాలి.
క కొన్నిసార్లు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. అలాగని నిరుత్సాహాపడవద్దు.
- చదివిన విషయాన్ని నోట్ చేసుకోవడం లేదా గుర్తుంచుకోవడం చేయాలి. ఈ అలవాటు భవిష్యత్‌లో ఏదో ఓ రకంగా ఉపయోగపడుతుంది.
- మిమ్మల్ని అభిమానించే వ్యక్తుల పట్ల శ్రద్ధ కలిగి జీవించాలి. ఇలా తోటి వారిని ప్రేమించడం వల్ల ఆపద సమయంలో అందరూ మీకు తోడుగా ఉంటారు.
- ఎలాంటి పరిస్థితినైనా దైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోవద్దు.
- ఆడంబరాలకు పోకుండా సంతృప్తిగా జీవించడం అలవాటు చేసుకోవాలి. కుటుంబ పరిస్థితులకు, స్థోమతకు తగినట్టుగా జీవిస్తే సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే నిరాడంబరంగా జీవించడం మంచి పద్ధతి.
- మీరు ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నారో గమనించుకోవాలి. కొన్నిసార్లు చెడు స్నేహం వల్ల మోస పోతారు. కాబట్టి మంచి వ్యక్తిత్వం ఉన్న స్నేహితులతో సంబంధాలను పెంచుకుంటే ఎన్నో విషయాలను నేర్చుకుంటారు.
- ప్రతిరోజు వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం తప్పని సరి! ఇలా చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.