Sun 29 Jul 02:27:08.041211 2018
Authorization
సమాజంలోని రుగ్మతలపై పాఠకుల్ని ప్రభావితం చేసే ధోరణిలో కొందరు కవిత్వం రాస్తారు. తమ మనసులోని భావాన్ని శక్తివంతమైన పదాలతో సమాజ మార్పుకు ఏం చేయాలో అక్షరీకరంచి చైతన్యపరుస్తారు.
ఏదో కీర్తికోసమో, అవార్డులు- సత్కారాల కోసమో రాసేవారు కొందరుంటే... పేరు - కీర్తి కోసం కాక సమాజంలో మార్పును, స్వేచ్ఛా స్వాతంత్య్రాల్ని అందరి బాగు కోరి కవిత్వం - సాహిత్యం రాసేవారు కొందరుంటారు. ఉబుసుపోక రాసే కవులు వుంటారు (కవి అనిపించుకోవాలని). సరోజినిగారు మధ్య కోవకు చెందినవారు. ఈమె కవితల్ని 'సుమధుర కావ్య సురభిళాలు' అంటూ చక్కటి విలువైన ముందుమాటను సీనియర్ సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వరరావు రాశారు. ఈమె కవితల్లో కొన్ని వాక్యాలు పాఠకుల్ని ఎంతో ఆలోచంపజేస్తాయి. నివాళి, క్షణికలు, జీవనఝరి, ఏకాంతం, గోడ, కవీ - కవీ, భ్రమణకాంక్ష లాంటి కవితలు ఈ సంపుటికే హైలెట్‌గా నిలిచాయి. కవయిత్రికి అభినందనలు.
- తంగిరాల చక్రవర్తి, 9393804472