Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • బాబుతో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన అశోక్‌ గజపతి
  • నేడు కాళేశ్వరంను సందర్శించనున్న ఆర్థిక సంఘం
  • జయరాం హత్యకేసులో మరో పోలీసు అధికారిపై వేటు
  • రష్యాలో కుప్పకూలిన యూనివర్సిటీ భవనం
  • ఉస్మానియా ఆస్పత్రిని పునర్నిర్మించాలని హైకోర్టులో పిల్‌
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Google+
  • Android
  • Pinterest
జనార్దన్‌ బతికే ఉన్నాడు | SOPATHI SUNDAY SPECIAL | www.NavaTelangana.com
  • మీరు ఇక్కడ ఉన్నారు
  • ➲
  • హోం
  • ➲
  • సోపతి
  • ➲
  • కథ
  • ➲
  • స్టోరి

జనార్దన్‌ బతికే ఉన్నాడు

Sun 09 Aug 00:15:52.841972 2015

జోరుగా వర్షం కురుస్తోంది. గత నాలుగు రోజులుగా చెదురుమదురుగా కురిసే వాన, ఇవాళ జోరందుకుంది. మొన్నటిదాకా చెమటలు కక్కించిన సూర్యుడు మబ్బుల చాటున దాక్కొంటున్నాడా అనిపిస్తోంది. పొద్దుట నుంచి ఒక్క సూర్యకిరణం ప్రసరిస్తే ఒట్టు... బంగాళాఖాతంలో నెలకొన్న అల్పపీడన ప్రభావంతో ఉత్తర తెలంగాణ ఆకాశం నిండా నీటి దుప్పటి పరచినట్టుగా ఉంది. ముసురు వాన వల్ల రైతులు పొలాల్లోకి అడుగిడ్డానికి సాహసించట్లేదు..
అది 1985-86 సంవత్సరాల మధ్యకాలం. ఆదివాసీల ఇలాకా... దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక మారుమూల గోండు గూడెం సమీపంలో ఒక సంఘటన జరిగింది. ఆకాలంలో వామపక్ష మిలిటెంట్‌ ఉద్యమం బాగా బలంగా కొనసాగుతోంది. పోలీసు వాహనంలో గవర్నమెంట్‌ డాక్టర్‌. డాక్టర్‌ జనార్దన్‌ని దట్టమైన ఆ అడవిలోకి తీసుకెళ్ళారు. ఒక ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మిలిటెంట్‌కి పోస్టుమార్టం నిర్వహించడానికి ఆ డాక్టర్‌ని తీసుకెళ్ళారని తెలిసింది. కాని ఎందుకో తిరిగి రాలేదు.
డాక్టర్‌ జనార్దన్‌ లేడన్న వార్త ఇంటి వాళ్ళకే కాదు, యావత్‌ ఏరియా ఆసుపత్రి చుట్టు పక్కనున్న పల్లెల్లోకి అనుమానం పాములా పాకిపోతోంది. డా.జనార్దన్‌ని ఏరియా ఆసుపత్రినుంచి ఎందుకు తీసుకెళ్ళారో ఎవరి నుంచీ స్పష్టమైన సమాధానం రావట్లేదు. గుసగుసలు ప్రారంభమైనై. పోలీసు వాకీటాకీల్లో ఆ కాలంలో అన్ని పోలీసు స్టేషన్లకీ ఒక వార్త వైర్‌లెస్‌ ద్వారా బట్వాడా చేయబడుతోంది.. ఏమని? జనార్దన్‌ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడని.. గవర్నమెంట్‌ ఏరియా ఆసుపత్రికి జనం తండోప తండాలుగా రావడం మొదలైంది.
వర్షం కొద్ది కొద్దిగా తగ్గు ముఖం పట్టినప్పటి నుంచి జనం నదీ ప్రవాహంలా తరలి వస్తున్నారు.
అందరిలో ఒకటే ఉత్కంఠ... డా. జనార్దన్‌ ఎన్‌కౌంటర్‌లో అమరుడయ్యాడని... ఈ వార్త జనం మెదళ్ళని కలవర పెడుతోంది.
డాక్టర్‌ జనార్దన్‌ అక్షరాలా ప్రజావైద్యుడు. దాదాపు ఇరవై గంటలకు పైగా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలందించేవాడు. ఒక్కోసారి రాత్రుళ్ళు కూడా ఆసుపత్రిలోనే గడిపేవాడు. రోగుల వద్ద నుంచి అక్రమంగా ఎలాంటి వసూళ్ళకీ పాల్పడేవాడు కాదు. అప్పుడు గరీబు రోగుల వద్ద మందులకు పైసల్లేకుంటే తన జేబులోంచి తీసి యిచ్చేవాడు. గత ఇరవై సంవత్సరాలుగా తనకు బదిలీ లేదు, బదిలీ అయితే ప్రజలు ఊరకుండరు. ప్రభుత్వాలు మారుతున్నాయి కాని, డాక్టర్‌ జనార్దన్‌ వన్‌ మ్యాన్‌ ఆర్మీలా రోగుల ప్రాణాలు కాపాడుతూనే ఉన్నాడు. డాక్టర్‌కి కొంచెం కోపం మెండు కాని, గుణం ముందు అన్ని బలాదూర్‌. అందువల్ల ప్రజల ఆదరాభిమానాలకి పాత్రుడయ్యాడు. అలాంటి తమ డాక్టర్‌ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిండని విని ప్రజలు జీర్ణించులేకపోతున్నారు.
వర్షం దాదాపు వెలిసినట్టే.. కాని ప్రజల కళ్ళల్లో దు:ఖపు మేఘాలు కన్నీళ్ళని వర్షిస్తూనే ఉన్నాయి. ఏరియా ఆసుపత్రి దగ్గర దాదాపు పదివేలకు పైగా జనం పోగయ్యారు. 'డాక్టర్‌ జనార్దన్‌ అమరహై!' లాంటి నినాదాల జోరు హెచ్చయ్యింది. ఏరియా ఆసుపత్రి ఎదురుగానే టౌన్‌ పోలీసు ఠాణా ఉంది. పోలీసు వాళ్ళ చెవిలో పిడుగులా ఈ వార్త పడింది.
జనాన్ని కంట్రోల్‌ చేయడానికి పోలీసులు లాఠీలు, తుపాకుల్తో రంగప్రవేశం చేశారు. పైనుంచి వచ్చిన ఆదేశాల్లో తిరిగి వాకీటాకీలు, వైర్‌లైస్‌ సెట్ల ద్వారా తాజా వర్తమానం పాస్‌ చేయడం మొదలు పెట్టారు. ఏమని? డాక్టర్‌ జనార్దన్‌ చావలేదు, బతికే ఉన్నాడని! కాని ప్రజలు ఎందుకో నమ్మట్లేదు. తన వాహనంలో, తగిన ఫోర్స్‌తో డి.ఎస్‌.పి ఆసుపత్రి ముందు ప్రత్యక్షమయ్యాడు. జనాన్ని కంట్రోల్‌ చేయడానికి తానే హ్యండ్‌ మైక్‌ ద్వారా డాక్టర్‌ చనిపోలేదని ప్రకటిస్తున్నాడు. కాని గుమికూడిన జనం.. మా ప్రజల డాక్టర్‌, డాక్టర్‌ జనార్దన్‌ మాకు కావాలనీ, మా ముందు ఉంచడని.. స్లోగన్స్‌ ఎత్తు కోవడం మెండైంది.
ఇక లాభం లేదని డి.ఎస్‌.పి డాక్టర్‌ జనార్దన్‌ని రూంలోంచి బయటికి రమ్మని జనం ముందు ప్రవేశపెట్టాడు. జనం కళ్ళలోంచి ఆనందబాష్పాలు రాలడం షురువైంది. అయితే తమ డాక్టర్‌ బతికే ఉన్నాడు సరే చనిపోయింది ఏ జనార్దన్‌ అని తర్జనభర్జన కొనసాగుతోంది జనంలో..
నాలుగు రోజుల ముసురు వాన ముగింపు పలికింది. సూర్యుడు మబ్బుల పరదాల చాటు నుంచి లోకాన్ని వీక్షిస్తున్నట్లుగా వెలుగులు విరజిమ్ముతున్నాడు. జనం వాడల్లో మెల్ల మెల్లగా కదలాడుతున్నారు.
ఉదయం నుంచి వార్త పత్రికలన్ని ఇళ్ళలో పంపిణీ చేస్తున్నారు. జనం ఆసక్తిగా పేపర్లు తిరిగేస్తున్నారు. ఎన్‌కౌంటర్లో చనిపోయింది డా.జనార్దన్‌ కాదనీ, జనార్దన్‌ అనే పేరున్న ఒక మిలిటెంట్‌ లీడర్‌ అని. ప్రజల్లో ఆనందం, ఆందోళన ఏకకాలంలో సంభవించినయి. మరో ప్రత్యామ్నయ పద్ధతులతో ప్రజలకు అవినీతి, దోపిడీ లేని రాజ్యం అందించాలని జనార్దన్‌ ఉద్యమిస్తున్నాడు. ప్రజల్లో ఎక్కువ మంది ఇలా అనుకొంటున్నారు. ''మాకు డా.జనార్దన్‌ కావాలి, ఆ జనార్దన్‌ కూడా కావాలి, ఎవరి మార్గంలో వారు ప్రజల కోసం పాటు పడుతున్నారు గదా! ఇద్దరు జనార్దన్‌లూ బతికే ఉండాలి. ఎవరైనా ఎందుకు చనిపోవాలని'' జనం దు:ఖితులయ్యే దృశ్యం కళ్ళముందు భారంగా కదలాడుతోంది.
- డా. దామెర రాములు
సెల్‌ : 9866422494

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

మూడో ముడి
గాంధారి పశ్చాత్తాపం
మారిన దొంగ
మోకు!
అనుబంధాలు
'కేకి'తాళీయమ్‌
కొత్త బంగారు లోకం
పట్టుచీర
ఆడ మనసు
రెండిరలు ఒక జగిలి!

కామెంట్స్

మీ కామెంట్ పోస్ట్ చెయ్యండి

తాజా వార్తలు

  • తాజా వార్తలు
  • మోస్ట్ కామెంటెడ్‌
09:20 AM

బాబుతో విభేదాలపై క్లారిటీ ఇచ్చిన అశోక్‌ గజపతి

09:12 AM

నేడు కాళేశ్వరంను సందర్శించనున్న ఆర్థిక సంఘం

09:11 AM

జయరాం హత్యకేసులో మరో పోలీసు అధికారిపై వేటు

08:36 AM

రష్యాలో కుప్పకూలిన యూనివర్సిటీ భవనం

08:30 AM

ఉస్మానియా ఆస్పత్రిని పునర్నిర్మించాలని హైకోర్టులో పిల్‌

08:25 AM

జయరాం కేసులో కొనసాగుతున్న విచారణ

08:22 AM

మాలావత్ పూర్ణ అరుదైన ఘనత

08:19 AM

ఇంకా కశ్మీర్‌లోనే పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి.!

08:12 AM

పాక్‌ నుంచి దిగుమతులపై 200 శాతం సుంకం

08:10 AM

నేడు ఓయూలో ఫెస్టివల్ ఆఫ్ ఇన్నర్ పీస్

07:57 AM

18న జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా

07:53 AM

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 72 మందిపై కేసులు నమోదు

07:52 AM

నూతన జిల్లాల్లో ఘనంగా ఆవిర్భావ వేడుకలు

07:49 AM

అమ‌రుల కుటుంబాల‌కి అమితాబ్ ఆర్ధిక సాయం

07:42 AM

ట్రోఫీని పుల్వామా అమరులకు విరాళంగా ఇచ్చిన విదర్భ జట్టు

మరిన్ని వార్తలు
04:40 PM

దళిత విద్యార్థులతో టాయిలెట్ల క్లీనింగ్

02:21 AM

మేక్‌ ఇన్‌ తెలంగాణ

02:10 AM

యాదాద్రి జాగా సంగతేంటి

02:05 AM

పెట్రోల్‌ బంకుల కోసం తగ్గుతున్న గిరాకీ!

02:03 AM

భూబిల్లుకు నిరసనగా రైతు ఆత్మహత్యలు

01:57 AM

ఇక పక్కా రాజకీయమే..

03:56 AM

ఫ్లడ్‌లైట్ల వెలుగులో... అక్రమ నిర్మాణాలు

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.