Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- తాంసి
మండలంలోని భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఎంపి గొడం నగేష్, ఎంఎల్‌ఎ రాథోడ్ బాపురావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శిథిలావస్థకు చేరుకోవడంతో రూ.60 లక్షల నిధులు మంజూరు చేసి నూతన భవనాన్ని నిర్మించడం జరిగిందని అన్నారు.వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆరోగ్యకేంద్రంలో ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వైద్య చికిత్సలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు. అదేవిధంగా సమయపాలన పాటించాలన్నారు. ఇప్పటివరకు ఆసుపత్రిలో పిల్లలకు ఆపరేషన్లు, 200 ప్రసవాలు చేశామని, పిహెచ్‌సికి ఒక అంబులెన్స్‌ను సైతం ఏర్పాటు చేశామని డాక్టర్ విజరుపార్థ ఎంపి, ఎంఎల్‌ఎ దృష్టికి తీసుకొచ్చారు. భీంపూర్ పిహెచ్‌సి పరిధిలోని గిరిగామ గ్రామాన్ని తాంసిలో కలిపి నిపాని గ్రామాన్ని భీంపూర్ పిహెచ్‌సిలో విలీనం చేయాలని అన్నారు. లింకురోడ్డు లేని కారణంగా వడెగావ్, గుబిడి గ్రామాల ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని వివరించారు. దీనికి వారు సానుకూలంగా స్పందించారు. ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లి ఆర్థిక ఇబ్బందులు తెచ్చుకోకుండా ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చి వైద్య చేయించుకోవాలని ఎంపి సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పెంటకుప్పలను ఊరికి దూరంగా వేయాలన్నారు. మురుగుకాల్వల్లో నీరు నిల్వకుండా ఎప్పటికప్పుడు పూడిక తీసివేయాలన్నారు. అలాగే చిన్నపిల్లలను ఐదు ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించడానికి పెంటావాలెంట్ టీకాలు వేయించాలన్నారు. అనంతరం ప్రాథమిక పాఠశాలలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా స్వయంగా ఎంఎల్‌ఎ రాథోడ్ బాపురావు రక్తదానం చేసి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారు.ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేయాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచు మాణిక్‌రావు, ఎంపిపి సురుకుంటి మంజుల, జడ్‌పిటిసి పులిశ్రీలత, ఇన్‌ఛార్జి డిఎంహెచ్‌ఓ చందు, ఎస్‌పిహెచ్ సాధన, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ భోజారెడ్డి, డిఇ నర్సింగ్‌రావు, ఎంపిడిఓ భూమయ్య, తహసీల్దార్ రమేష్ రాథోడ్, ఎంపిటిసి రేణుకాఅమృత్‌రావు, టిఆర్‌ఎస్ నాయకులు మేకల నాగయ్య,శ్రీధర్‌రెడ్డి, నారా యణ, రాజు, సర్పంచులు పాల్గొన్నారు.