Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మందమర్రి
సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు హెచ్‌ఎంఎస్‌తోనే సాధ్యమని హెచ్‌ఎం ఎస్ జనరల్ సెక్రటరీ రియాజ్ అహ్మద్ అన్నారు. ఆదివారం మందమర్రి పట్టణంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. హెచ్‌ఎంఎస్ యూనియన్ కార్మికుల సమస్య లపై పోరాడుతూ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నామని తెలిపారు. ఐఎన్‌ట ీయూసీ, టీబీజీకేఎస్, ఏఐటీయూసీ కార్మికులను మోసం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఇతర కార్మిక సంఘాల కార్మికుల హక్కులను కాపాడడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఐదు సంవత్స రాలుగా గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్ అంతర్గత కుమ్ములాట, సీట్ల కోసమే తప్ప కార్మికులకు ఒరగబెట్టిందేమి లేదన్నారు. అధికారంలోకి వస్తే మొదటి సంతకం కార్మికుల వారసత్వ ఉద్యోగాలపై అన్న టీబీజీకేఎస్ వారసత్వ ఉద్యోగాలు సాధిం చడంలో విఫలమైందన్నారు. యాజమాన్యం కార్మి కులపై ఒత్తిడి తెస్తున్న కార్మిక సంఘాలైన ఐఎన్ టీయూసీ, టీబీజీకెఎస్, ఏఐటీయూసీ పట్టించు కోవడం లేదన్నారు. అనంతరం కొంతమంది కార్మి కులు హెచ్‌ఎంఎస్‌లో చేరారు. ఈ సమావేశంలో ఏరియా వైస్‌ప్రెసిడెంట్ బోనాల శ్రీనివాస్, సెంట్రల్ సెక్రటరీ జీవన్‌జోయల్, బ్రాంచ్ కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు వెల్ది సుదర్శన్ పాల్గొన్నారు.