Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భైంసా రూరల్
గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌తో కలిసి కమిటీ సభ్యులు సోమవారం పరిశీ లించారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద నిమజ్జ నోత్సవ ఏర్పాట్లపై సమీక్షిం చారు.ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ జాబీర్ హైమాద్ మాట్లాడారు. నిమజ్జనోత్స వానికి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. స్థలాన్ని చదును చేయడంతోపాటు క్రేన్ సౌకర్యం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. రాత్రివేళలో ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక లైటిం గ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.ఆయన వెంట ఉత్సవ కమిటీ అధ్యక్షులు సి.శంకర్, కార్యదర్శి డాక్టర్ నగేష్‌తోపాటు పాటు సభ్యులు ఉన్నారు.