Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రౌండ్‌టేబుల్ సమావేశంలో టీమాస్‌ఫోరం నాయకులు
- 3న నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆవిర్భావ సభ
నవతెలంగాణ-కడెం
తెలంగాణ సామాజిక, ప్రజా సంఘాల ఐక్యవేదిక(టీ-మాస్ ఫోరం) ఆవిర్భావ సభను నిర్మల్‌లో 3న నిర్వహిస్తున్నామని, దీన్ని విజయవంతం చేయాలని ఫోరం నాయకులు కోరారు. మండల కేంద్రంలో టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో సోమవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీ-మాస్ ఫోరం జిల్లా కమిటీ సభ్యులు జి.కిషన్‌కుమార్ మాట్లాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో టీ-మాస్ ఫోరం ఆవిర్భావ సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. దీన్ని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, కుల దురంకార హత్యలు, దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణలో 5 మాసాల పాటు మహాసభ పాదయాత్ర నిర్వహించారని అన్నారు. రాష్ట్రంలో నెలకొన్న అనే సమస్యలు, సామాజిక న్యాయం, పలు అంశాలపై టీ-మాస్ ఫోరం ఆవిర్భవించిందని అన్నారు. సెప్టెంబర్ 3న నిర్మల్‌లో నిర్వహించే టీ-మాస్ ఫోరం ఆవిర్భావ సభలో బడుగు, బలహీన వర్గాల నాయకులు పాల్గొనాలని కోరారు. కార్యక్రమానికి టీ-మాస్ స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రజానాయకులు గద్దర్, ఫోరం కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, విమలక్క, జెవి.రాజు, సత్యనారాయణ, జి.రాములు, జాన్ వెస్లీ, అద్దంకి దయాకర్, ఎం.సాయిబాబు, ఎండి.అబ్బాస్ హాజరవుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దుర్గం నూతన్‌కుమార్, కార్యదర్శి ఠాకూరి తిరుపతి, డీవైఎఫ్‌ఐ నాయకులు సురేశ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.దాదేమియా, వివిధ ప్రజా, కుల సంఘాల నాయకులు అర్ల రమేశ్, దుత్ల గంగన్న, లక్ష్మణ్, కేవీపీస్ నాయకులు రాజలింగు, దుర్గం పోశలింగం పాల్గొన్నారు.