Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నిర్మల్
ప్రజావాణికి వచ్చిన అర్జీలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) సోమేశ్వర్ అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో వివిధప్రాంతాల నుంచి వచ్చిన దరఖాస్తుదారుల నుంచి సోమవారం ఆర్జీలను స్వీకరించి మాట్లాడారు. జిల్లాలోని మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలపై ఆర్జీల రూపంలో ఫిర్యాదు చేస్తారని, వాటిని జాప్యం చేయకుండా త్వరితగతిన పరిక్షించాలని అన్నారు. ప్రజా సమస్యలు పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో నిర్మల్, భైంసా ఆర్డీఓలు ప్రసూనాంబ, రాజు, జడ్పీసీఈఓ సుధీర్, జిల్లా వ్యవసాయాధికారి కోటేశ్వర్ రావు, డీపీఓ శ్రీనివాస్, డీఈఓ ప్రణీత, మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ అధికారి విజరుకుమార్, ఎస్సీ వెల్ఫేర్ అధికారి కిషన్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాణిక్యరావు, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.
నాణ్యమైన పోలీసు సేవలందించాలి:ఎస్పీ
నాణ్యమైన పోలీసు సేవలందించాలని, పోలీసుల గౌరవం మరింత పెంచాలని ఎస్పీ సి.శశిధర్‌రాజు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల విభాగంలో వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలకు పోలీసులు అండగా ఉండాలని, స్నేహభావంతో మెలగాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు తెలియజేయాలన్నారు. 8333986939 వాట్సాప్‌కు సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.