Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
- కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు
నవతెలంగాణ - ఆసిఫాబాద్
ప్రజాఫిర్యాదుల పరిష్కారమే అధికారుల పనితీరుకు కొలమానమని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీలను స్వీకరించారు. అంతకుముందు అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను అధికారులు త్వరగా పరిష్కరించాలని సూచించారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్ విధానంలో ఆయా శాఖల ఉన్నతాధికారులకు పంపుతున్నామని, వారు దానిని పరిష్కరించి, వివరాలను తన మెయిల్‌కు పంపించాలని సూచించారు. సోమవారం వచ్చిన మొత్తం 20 ఫిర్యాదుల్లో ఎక్కువగా భూములకు సంబంధించిన ఫిర్యాదులే ఉన్నాయి. ఆయా ఫిర్యాదులను విన్న కలెక్టర్ వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. భూములకు సంబంధించిన ఫిర్యాదులు తగ్గేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అయితే ఫిర్యాదుదారులు అంతంత మాత్రంగానే రావడంతో ప్రజావాణి వెలవెలబోయింది. పట్టా పాస్‌పుస్తకాల్లో పేరు మార్పు, రైతుబంధు రావడం లేదని పలువురు అర్జీలు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ దత్తు పాల్గొన్నారు.