Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జన్నారం
మండలంలోని పొన్కల్ గ్రామ పంచాయతీకి చెందిన నగరు శ్రీలత, జన్నారం గ్రామానికి చెందిన సిటిమల రాకేశ్ ఇద్దరు గత పది నెలల నుంచి ప్రేమించుకున్నారు. వీరిద్దరి పెండ్లికి రాకేశ్ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో రాకేశ్ పెండ్లికి నిరాకరించాడు. శనివారం రాకేష్ ఇంటి ముందు శ్రీలత కూర్చొని నిరసన చేపట్టింది. సాయంత్రం నాలుగు గంటలకు పోలీసులు, ఐద్వా మండల అధ్యక్షులు పోత విజయ కూకటిగారి లక్ష్మి ప్రియుడు రాకేశ్ ఇంటికి చేరుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎస్సై వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రేమ వివాహం జరిపించారు. కార్యక్రమంలో అదనపు ఎస్సై బలరాం నాయక్, సీపీఐ(ఎం)జిల్లా నాయకులు పోతుశంకర్, కూకటి గారి బుచ్చయ్య తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లపెల్లి రాజేశ్వర్, టీఆర్‌ఎస్ జిల్లా అధికార ప్రతినిధి సిటిమల భరత్‌కుమార్, నరసింహులు, మున్ను, శ్రీకాంత్ రెడ్డి, ఇరువురు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.