Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నిర్మల్
గ్రామపంచాయతీలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ప్రతి గ్రామంలో చేపట్టిన పనులను నిరంతరం కొనసాగేలా పర్యవేక్షించాలని కలెక్టర్ ఎం.ప్రశాంతి ప్రత్యేకాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ సెల్‌లో సోమవారం మండల ప్రత్యేకాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.30 రోజుల గ్రామ కార్యాచరణ ప్రణా ళికలో భాగంగా చేపట్టిన పనులపై ప్రత్యేకాధికారులు నివేదిక అందించాలని అన్నారు. ప్రతి గ్రామంలో కచ్చితంగా డంపింగ్‌యార్డు, తడి, పొడి చెత్త వేర్వేరుగా వేసేందుకు షెడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. ప్రతి షెడ్‌కు రూ.2.5 లక్షలు చెల్లించనున్నట్టు తెలిపారు. ప్రతి నర్సరీకి ఫెన్సింగ్, గేట్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి నర్సరీకి నీటి సదుపాయం ఉందో లేదో చూడాలని సూచించారు. సర్పంచులు, కార్య దర్శులతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించాలని పేర్కొన్నారు. వారానికి ఒకసారి డ్రయినేజీలు శుభ్రం చేయించాలన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్న విషయాలను గమనించాలని పేర్కొన్నారు. ఎలక్ట్రిసిటీ థర్డ్‌వైర్ పనులు ఎంతవరకు జరిగాయో పరిశీలించాలన్నారు. అక్టోబర్ 2019 నుంచి పంచాయతీ కార్యాలయం బిల్లును చెల్లించాలన్నారు. అంతకుముందు కలెక్టర్ బదిలీ అయిన తహసీల్దార్లకు ఉత్తర్వులు అందజేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఏ.భాస్కర్‌రావు, భైంసా ఆర్డీఓ రాజు, డీపీఓ శ్రీనివాస్, డీఎస్‌ఓ కిరణ్, ఉద్యానవన శాఖ అధికారి శరత్‌కుమార్, జిల్లా విద్యాధికారి టామ్నే ప్రణీత, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధిశాఖ అధికారి కిషన్, ఏఓ కరీం పాల్గొన్నారు.