Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మల్, కుభీర్, భైంసా, ఆసిఫాబాద్, జైనూర్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభం
నవతెలంగాణ-నిర్మల్
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్ పట్టణంలోని కేదర్‌నాథ్ జిన్నింగ్ మిల్లులో వ్యవసాయశాఖ, సీపీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంత్రి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చిత్తశుద్ధితో అమలు చేస్తోందన్నారు. రైతు బంధు, రైతుబీమా, సకాలంలో నాణ్యమైన ఎరువులు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి, జాయింట్ కలెక్టర్ ఏ.భాస్కర్‌రావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు ధర్మాజీ రాజేందర్, రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ నల్లా వెంకట్‌రాంరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ ఎర్రవోతు రాజేందర్, ఎఫ్‌ఏసీఎస్ చైర్మెన్ రాంకిషన్‌రెడ్డి, సీసీఐ అధికారి ఆయూశ్ దేశ్వంత్, మార్కెట్ కమిటీ అధికారి శ్రీనివాస్, ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, ముడుసు సత్యనారాయణ, సుభాశ్‌రావు, గండ్రత్ ఈశ్వర్, పడిగెల కేథర్‌నాథ్, నాయకులు పాల్గొన్నారు.
పంటకు మద్దతు ధర పొందాలి :జడ్పీ చైర్‌పర్సన్ కోవలక్ష్మి
ఆసిఫాబాద్:రైతులు తాము పండించిన పత్తి పంటకు మద్దతు ధర పొందాలని జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి జిల్లాకేంద్రంలోని బాలాజీ జిన్నింగ్ మిల్లులో సోమవారం సీసీఐ ద్వారా చేపట్టే పత్తి కొనుగోళ్లను సోమవారం ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జిల్లాలోని రైతులు పండించిన పంటకు మద్దతు ధర పొందాలని సూచించారు. ప్రభుత్వం పత్తి పంటకు మద్దతు ధర రూ.5550గా నిర్ణయించిందని, సాధ్యమైనంతవరకు తేమ శాతం తక్కువగా ఉండేవిధంగా చూసుకొని పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని చెప్పారు. తేమశాతం పెరిగిన కొద్దీ ఒక్కో శాతానికి ఒక్కో విధంగా రేటు మారుతుందన్నారు. రైతులు నష్టపోవడానికి వీలులేదని, కొనుగోళ్లలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే తమను సంప్రదించాలని అన్నారు. అంతకు ముందు మార్కెటింగ్ శాఖ అధికారులు, జిన్నింగ్ మిల్లు యజమానులు వారికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. మార్కెట్‌కు పత్తి అమ్మకానికి తీసుకొచ్చిన రైతులను సన్మానించారు. కార్యక్రమంలో సీసీఐ సీఈఓ ప్రమోద్, ఎంపీపీ మల్లికార్జున్, వ్యవసాయ మార్కెటింగ్ స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి వెంకటేష్, రాహుల్ పాల్గొన్నారు.
జైనూర్: మండలకేంద్రంలోని స్టార్ జిన్నింగ్‌లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని సోమవారం జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జాయింట్ కలెక్టర్ రాంబాబు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ కనక యాదవ్‌రావ్, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యలు ఇంతియాజ్‌లాలా, తహసీల్దార్ ఏజాజ్ అహ్మద్‌ఖాన్, ఎంపీపీ తిరుమల, వైస్ ఎంపీపీ లక్ష్మణ్, జిన్నింగ్ యజమాని రాథోడ్ రితేష్, జామ్ని ఎంపీటీసీ మహదేవ్, గ్రామ పటేల్ కొడప హాన్ను, మాజీ పీపీ కొడప విమలప్రకాష్ పాల్గొన్నారు.
కుభీర్:మండలంలోని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని ముధోల్ ఎమ్మెల్యే జి.విఠల్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ చైర్మెన్‌తో కలిసి సీసీఐ పత్తి కొనుగోళ్లను సోమవారం ప్రారంభించారు.కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండలాధ్యక్షులు ఎన్నిల అనిల్, టీఆర్‌ఎస్ జిల్లా కార్యదర్శి తూమ్ రాజేశ్వర్, మాజీ జడ్పీటీసీ శంకర్ చౌహన్, వైస్ ఎంపీపీ మోహీనొద్దీన్, సర్పంచ్ మీరావిజరుకుమార్, సర్పంచుల సంఘం అధ్యక్షులు దత్తుగౌడ్, వ్యాపారవేత్తలు సంతోశ్, ఆనంద్, బాలాజీ, దత్తు, కార్యదర్శి ప్రశాంత్, టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
భైంసా: పట్టణంలోని ధనుంజరు జిన్నింగ్ మిల్లులో సోమవారం సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి అడెల్లు, చైర్మెన్ రుక్మిణి మురళీగౌడ్, నాయకులు ఏజాజ్ అహ్మద్, రమేశ్ మాశెట్టివార్, రైతులు పాల్గొన్నారు.