నవతెలంగాణ-ఆసిఫాబాద్ ప్రాథమిక విద్యలో కనీస సామర్థ్యాలు పెంచే ఉద్దేశంతో గిరిజన సంక్షేమశాఖలో గురువారం నిర్వహించిన పునాది 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో మొత్తం 333 పాఠశాలల్లో ఈ పరీక్షలు నిర్వహించారు. మండలంలోని మాలన్‌గొంది (కె), మాలన్‌గొంది (జి)పాఠశాలలను జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఉద్దవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించి పాఠశా లల ప్రధానోపాధ్యాయులపై మండిపడ్డాడు. సరైన సమయానికి పరీక్ష నిర్వహించక పోవడంతో వారి నుండి వివరణ కోరారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 8వ తేదీలోపు పరీక్షలకు సంబంధించి పూర్తి నివేదికను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యా యులు అందజేయాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. నివేదిక సమర్పణ లో, పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.