- జలమండలి జనరల్ మేనేజర్‌కు కార్పొరేటర్ వినతి వతెలంగాణ-బాలానగర్ బాలానగర్ డివిజన్ పరిధిలో తాగునీరు సజావుగా అందించాలని జలమండలి జనరల్ మేనేజర్ వినోద్ భార్గవ్‌కు కార్పొరేటర్ కాండూరి నరేంద్ర ఆచార్య విన్నవించారు. గురువారం ఆయన కార్యాలయంలో కలిసి సమస్యను వివరించారు. గత నెల రోజుల నుంచి బాలానగర్ డివిజన్‌లో తాగునీరు రోజు విడిచి రోజు సరఫరా చేయడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. పలు చోట్ల నాలుగురోజుకు ఓసారి తాగునీరు సరఫరా అవుతోందన్నారు. పైప్‌లైన్‌లలో అంతరాయాలను గుర్తించి మరమ్మతులు చేయాలని సూచించారు. అలాగే షాపూర్‌నగర్‌లో 7.5లక్షల గ్యాలన్లతో నిర్మితమవుతున్న ట్యాంకును త్వరగా వినియోగంలోకి వచ్చేలాగా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనివల్ల బాలానగర్, ఫతేనగర్ డివిజన్ ప్రజలకు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అవుతుందని తెలిపారు. అందుకు స్పందించిన జలమండలి జనరల్ మేనేజర్ ప్రజల నీటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తాగునీటి సమస్యకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారని కార్పొరేటర్ నరేంద్ర ఆచార్య తెలిపారు.