- రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
నవతెలంగాణ-నిర్మల్
రాష్ట్రంలో విశ్వకర్మలు(కార్పెంటర్లు) సమస్యలను వీలైనంత త్వరలో పరిష్క రిస్తామని, ఇందుకోసం అటవీశాఖ అధికారులు, విశ్వకర్మల ప్రతిని ధులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణం, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. విశ్వకర్మల సమస్యలపై సంఘం ప్రతినిధులతో అరణ్య భవన్‌లో మంత్రి శుక్రవారం సుదీర్ఘంగా చర్చించారు. కార్పెంటర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి పరిష్కరిస్తామని అన్నారు. విశ్వకర్మలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందిపెట్టే ప్రసక్తే లేదని, అదే సమయంలో పర్యావరణ పరంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు విశ్వకర్మలు సహకరించాలని కోరారు. అన్నివర్గాల సమస్యలను పరిష్కరించటంలో తెలం గాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోం దన్నారు. అలాగే కార్పెంటర్ల సమస్యలను సానుభూతితో పరిష్కరిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.సమా వేశంలో సమా వేశంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదన చారి, పీసీసీఎఫ్ ఆర్.శోభ, అదనపు పీసీసీఎఫ్ ఆర్‌ఎం.డోబ్రియల్, వివిధ జిల్లాలకు చెందిన అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
Authorization