- నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఘనంగా హోంగార్డ్స్ రైజింగ్ డే
నవతెలంగాణ- ఆసిఫాబాద్
పోలీసు వ్యవస్థలో హోంగార్డుల సేవలు అభినందించదగిన ఆసిఫాబాద్ ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం 57వ హోంగార్డ్స్ రైజింగ్‌డేను నిర్వహించారు.ఎస్పీ ముఖ్యఅతిథిగా హాజరై హోంగార్డుల నుంచి గౌరవవందనం స్వీకరిం చారు. అనంతరం మాట్లాడారు. జిల్లాలో మొత్తం 166 మంది హోంగార్డు ఆఫీసర్ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. హోంగార్డుల సంక్షేమాన్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.ఆ తర్వాత మెగా ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సుధీంద్ర, ఏఆర్ ఏఎస్పీ సురేశ్, డీఎస్పీ సత్యనారాయణ, సీఐ రాజు, ఆర్‌ఐలు శేఖర్‌బాబు, శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డ్స్ పాల్గొన్నారు.
నిర్మల్:స్థానిక పరేడ్‌గ్రౌండ్‌లో హోంగార్స్ రైజింగ్ డేను శుక్రవారం నిర్వహిం చారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్పీ శశిధర్‌రాజు హాజరయ్యారు. అనంతరం ఇటీవల నిర్వహించిన క్రీడాపోటీల్లో, విధుల నిర్వహణలో ప్రతిభ కనబర్చినవారిని అభినందించి పురస్కా రాలు అందజేశారు.ఆతర్వాత మంచిర్యాల చౌరస్తా నుండి జెండాఊపి కవాతును ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాస్‌రావు, వెంకట్‌రెడ్డి, డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, ఎస్బీఐ డీఎస్పీ వెంకటేష్, నిర్మల్ పట్టణ, గ్రామీణ సీఐలు జాన్ దివాకర్, శ్రీనివాస్‌రెడ్డి, జీవన్ రెడ్డి, ఆర్‌ఐ వెంకటి, హోంగార్డ్స్ ఆర్‌ఐ కృష్ణాంజనేయులు, ఎంటిఓ వినోద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆదిలాబాద్‌టౌన్: స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్‌లో హోంగార్డ్స్ రైజింగ్ డేను శుక్రవారం నిర్వహించారు. డీఎస్పీ వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ సయ్యద్ సుజాఉద్దీన్ ముఖ్యఅతిథులు విచ్చేసి జెండాను ఆవిష్కరించారు. జిల్లాలో 281 మంది హోంగార్డులు పనిచేస్తున్నారని, అందులో 38 మంది మహిళలు ఉన్నారని అన్నారు. అనంతరం హోంగార్డు కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులు, స్థానిక ప్రజలు, విద్యార్థులతో కలిసి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.హెడ్‌క్వార్టర్ నుండి ప్రారంభమైన ర్యాలీ కుమురంభీం చౌక్, తెలంగాణతల్లిచౌక్, అశోక్ రోడ్డు మీదుగా గాంధీచౌక్, అంబేద్కర్‌చౌక్ వరకు కొనసాగింది.హోంగార్డు యూనిట్ ఇన్‌చార్జిలు డి. వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిబ్బంది ఆర్ మోహన్, గంగన్న, జి శ్రీనివాస్ 57వ హోంగార్డ్ రైజింగ్ డేకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు సుధాకర్‌రావు, ఇంద్రవర్ధన్, హోంగార్డు ఇన్‌చార్జి అధికారి డి.వెంకటేశ్వర్లు, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచల వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ ఎస్సై ఏస్‌ఏ బాకీ, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్‌హక్, ఆర్‌ఎస్సైలు, హోంగార్డు సిబ్బంది పాల్గొన్నారు.
Authorization